Gunde Ninda Gudi Gantalu Weekly: కష్టాల్లో మౌనికా.. బాలు ఉగ్రరూపం.. ఆందోళనలో మీనా
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండి గుడిగంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 2వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
జూన్ 2వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మౌనికా కోసం సంజూ వెతుకుతూ బాలు కంట పడుతాడు. మౌనికా ఇంట్లో లేదనే విషయాన్ని బాలు తెలుసుకుంటాడు. వాళ్ల అత్తగారింటికి వెళ్లి మౌనికా ఎక్కడ ఉందని నిలదీస్తాడు. ఎవ్వరూ చెప్పకపోవడంతో కత్తితో సంజూ మెడపై పెట్టి బెదిరిస్తాడు. తన చెల్లికి ఏమైందని, ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నిస్తాడు. సమాధానం చెప్పకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. కానీ సంజూ బదులివ్వడు. అదే సమయంలో మౌనికా ఇంటికి తిరిగి వస్తుంది. సంజూను వదిలేయమని అడుగుతుంది. చెల్లిని చూసి బాలు శాంతిస్తాడు. అసలు ఎక్కడికి వెళ్లావని అడుతాడు. అందుకు మౌనికా గుడికి వెళ్లి తిరిగి వస్తున్నానని, ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వెళ్లడంతో నాకోసం వెతుకుతూ ఉన్నారని బాలుకు సర్దిచెబుతుంది. ఇక బాలు అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతాడు.

జూన్ 3వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రవి, శృతి గొడవ పడుతూ ఉంటారు. రాత్రి పూట ఏసీ కూల్ ఎక్కువ అయ్యిందని రవి తన భార్య శృతిపై మండిపడుతాడు. శృతి కూడా రవిపై పోట్లాడుతుంది. ఇద్దరూ కలిసి ఏసీ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు. వెంటవెంటనే ఏసీ ఆన్ చేసి ఆఫ్ చేయడంతో ఫ్యూజ్ పోతుంది. దాంతో ఇంట్లో వాళ్లందరూ ఉక్కపోతతో బయటికి వస్తారు. అప్పటికే సాయంత్రం పూట ప్రభావతికి రోహిణి ఫేస్ ప్యాక్ వేస్తుంది. దాంతో చీకట్లో ప్రభావతి దెయ్యంలా కనిపిస్తుంది. ప్రభావతిని చూసి అందరూ దెయ్యం దెయ్యం అంటూ భయపడుతారు. అసలు విషయం తెలుసుకొని ప్రభావతిని తిడుతారు. ఇక సత్యం కూడా మొహం కడుక్కోని పడుకోమని చెబుతాడు. మరోవైపు బాలు, మీనా తమకు వచ్చిన 500 పూల దండల ఆర్డర్ ను పూర్తి చేసేందుకు పూల మార్కెట్ కు వెళ్తారు. ఈ క్రమంలో మీనా, బాలుతో ఓ ఆటాడుకుంటుంది. ఇదే సమయంలో ఇద్దరి మధ్య మాటలు ఏర్పడుతాయి. మరోవైపు మౌనికాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు సంజూ ప్రయత్నిస్తూ ఉంటాడు. తన తండ్రి కూడా మౌనికు పంపించేసి మినిష్టర్ కూతురితో పెళ్లి చేయిస్తానని కొడుకు సంజూకూ హామీనిస్తాడు.
జూన్ 4న తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు, మీనా తమకు వచ్చిన పూల దండల ఆర్డర్స్ ను సకాలం పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. ముందుగా పూలు తీసుకురావడం కోసమని ఆటోలో పూల మార్కెట్ కు వెళ్తారు. తిరిగి వచ్చే సమయంలో బస్తీవాళ్లను పిలవడంతో పాటు సుమతిని కూడా రమ్మని చెబుతుంది. దారి మధ్యలో సుమతి కూడా ఆటోలో వస్తుంది. ఈ సమయంలో బాలుకు మీనాను మరింతగా దగ్గర చేసే ప్రయత్నం చేస్తుంది సుమతి. ఇదే సమయంలో బాలుకు కూడా మీనాపై ఉన్న కోపం పోతుంది. బాలు, మీనా కలిసి ఉండటంతో సుమతి సంతోషిస్తుంది. మరోవైపు బస్తీ నుంచి కొందరు మహిళలు మీనాకోసమని ఇంటికి వస్తారు. ఇంట్లోనే ఉన్న ప్రభావతి వాళ్లను చూసి ఏం కావాలని అడుగుతుంది. మీనా కోసం వచ్చామని, పూల దండలు అల్లడానికి వచ్చామని చెబుతారు. దాంతో ప్రభావతి మీనా గురించి వాళ్లతో తప్పుగా మాట్లాడుతుంది. దాంతో వాళ్లు ప్రభావతి మూతి పగలగొడుతామని, ఇంకో సారి మీనాను అంటే ఊరుకోమని హెచ్చిరించారు.
జూన్ 5న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మార్కెట్ నుంచి పూల సంచులు తీసుకొని బాలు, మీనా, సుమతి ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే బస్తీ వాసులందరూ మీనా, బాలును పలకరిస్తారు. ఇక పూలను ఇంట్లోకి తీసుకెళ్లి హాలులో పోసి దండలు అల్లేందుకు అందరూ కూర్చుంటారు. ఇల్లంతా పూలతో నిండిపోతుంది. దీంతో ప్రభావతి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇంటిని పూల మార్కెట్ ను చేశారని గులుగుతుంది. మరోవైపు మనోజ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటాడు. వాళ్లన్ని సత్యం అడ్డుకుంటూ ఉంటాడు. వాళ్ల మాటలకు తిరిగి కౌంటర్లు వేస్తాడు. ఈలోగా రవి, శృతి కూడా వస్తారు. వాళ్లు కూడా బాలు, మీనాకు సహకరించే ప్రయత్నం చేస్తారు.
జూన్ 6న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
పూల దండలు అల్లే పనిలో మీనా, బాలు, సుమతి, బస్తీ వాళ్లందరూ నిమగ్నమై పోయి ఉంటారు. ఇక సత్యం, రవి, శృతి, మీనాక్షి కూడా వాళ్లకు సహకరిస్తూ ఉంటారు. రవి ఇంట్లో వాళ్లందరికీ, బస్తీ మహిళలకు కూడా భోజనం తానే స్వయంగా వండుతానని చెబుతాడు. అందరి కోసం రుచికరమైన కిచిడిని తయారు చేస్తాడు. అందరూ తింటారు కానీ రోహిణి, మనోజ్ మాత్రం తిననని చెబుతారు. వాళ్లు ఆర్డర్ చేసుకుంటామని చెబుతారు. ఇక మిగిలిన వాళ్లందరూ తిని బాగుందని రవిని అభినందిస్తారు. ఈ క్రమంలో మీనా చెల్లి సుమతి కూడా రవికి శుభాకాంక్షలు తెలుపుతుంది. దాంతో సుమతి రవికి లింకేస్తూ ప్రభావతి గొడవ చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ శృతి ప్రభావతి ప్లాన్ ను తిప్పికొడుతుంది. సత్యం కూడా ప్రభావతిపై మండిపడుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ లో చూడాలి. మరోవైపు పూల దండలను అక్కడికి చేరకుండా, ట్రాలీని ఎత్తుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూడాలి.


Click it and Unblock the Notifications











