Gunde Ninda Gudi Gantalu Weekly: మీనాపై నిప్పులు కక్కిన ప్రభావతి.. షాక్ ఇచ్చిన రోహిణి.. మౌనికా కొత్త ప్రయాణం

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 9వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

జూన్ 9వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ప్రభావతి బాలు, మీనాలపై అక్కసు వెళ్లగక్కు తుంది. ఇంట్లోనే పూలు పోసి దండలు అల్లడంతో కూర్చోవడానికి కూడా స్థలం లేదని మండి పడిపోతుంది. దాంతో మీనా, బాలుపై సూటిపోటు మాటలు అంటుంది. బాలు కూడా తిరిగి ప్రభావతి నోరు మూయించేందుకు ప్రయత్నిస్తాడు. సత్యం కూడా ప్రభావతిని దెప్పి పొడుతూ ఉంటాడు. ఇక రవి అందరూ పని చేస్తుండటంతో వాళ్లకి భోజనాలు ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. కిచిడి వండుతాడు. అందరికీ ప్లేట్లలో వడ్డిస్తుంది. అందరూ తిని బాగుందని అభినందిస్తాడు. రెస్టారెంట్ ఓపెన్ చేసుకోమని సలహానిస్తారు. మరోవైపు మీనా వాళ్ల చెల్లెలు సుమతి రవికి షేక్ హ్యాండ్ ఇచ్చి పొగుడుతుంది. దాంతో ప్రభావతి పెద్ద గొడవ చేయాలని ప్రయత్నిస్తుంది. శృతి తో సుమితిపై చెడుగా చెప్పి తిట్టించాలని చూస్తుంది. కానీ శృతి అత్త ప్రభావతినే తిడుతుంది. దాంట్లో అనుమానించాల్సిన పనిలేదని బుద్ధి చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story June 9th to June 13th Episodes highlights

జూన్ 10వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మీనా, బస్తీ మహిళలందరూ రాత్రంతా కష్టపడి పూల దండలను రెడీ చేస్తారు. అన్ని రెడీ అవ్వడంతో పంపించడానికి సిద్ధం చేస్తారు. ఇక ఉదయాన్నే ట్రాలీలో దండల లోడ్ ను నింపుతారు. పార్టీ నేత తలపెట్టిన సామూహిక వివాహాల కార్యక్రమానికి పంపిస్తారు. కానీ ఫైనాన్షియర్ గుణ ఆ పూల దండలు పెళ్లి కార్యక్రమానికి చేరకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు. అందుకు తన అనుచరులను పంపించి ట్రాలీని ఎత్తుకెళ్లమని చెబుతాడు. వాళ్లు ట్రాలీని ఫాలో అయ్యి దొంగలిస్తారు. ట్రాలీ డ్రైవర్ జరిగిన విషయాన్ని బాలుకు చెప్పటడంతో టెన్షన్ పడుతారు. ఇదే సమయంలో రాజకీయ నేత దగ్గర పని చేస్తున్న అశోక్ ఫోన్ చేస్తాడు. దండలు సమయానికి రాకపోతే మన ప్రాణాలు పోతాయని భయపెడుతాడు. ఆ పార్టీ నేత కూడా హెచ్చరిస్తాడు. కానీ బాలు ట్రాలీని ఎవరో దొంగలించారని చెబుతాడు. దాంతో ఆయన కోపంతో ఊగిపోతాడు. అరగంటలో ట్రాలీ దండలతో తన ముందు ఉండాలని సమయం ఇస్తాడు. ఇక వెంటనే బాలు ఆ ట్రాలీ ఫొటోను క్యాబ్, ఆటో డ్రైవర్ల గ్రూప్ లో పెడుతాడు. దాంతో ఆటో డ్రైవర్ ఒకరు బండిని చూశానని చెబుతాడు. ట్రాలీనే ఫాలో అవుతాడు.

జూన్ 11న తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మొత్తానికి ఆ బండి దొరుకుతుంది. పార్టీ నేతకు అప్పగిస్తారు.రాజకీయ నేత నుంచి ప్రాణభయం తొలగిపోయింది. సమయానికి దండలను అందించడం, బాలు నిజాయతికీ మెచ్చి ఆ నాయకుడు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత బాలు, మీనా ఇంటికి తిరిగి వెళ్తారు. రాత్రంతా తమకోసం పూల దండలు అల్లిన బస్తీ మహిళలకు డబ్బులను ఇవ్వాలని బాలు మీనా వాళ్ల దగ్గరికి వెళ్తారు. కానీ వాళ్లు ఆ డబ్బుల తమకు వద్దని అంటారు. ఇక ఆ డబ్బులతో మీనానే బంగారం చేయించుకోమని అంటారు. కానీ మీనా మాత్రం తన భర్త బాలుకు కారు కొనివ్వాలని అనుకుంటున్నట్టు చెబుతుంది. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంది. అలాగే కారు కొనడం విషయమై బాలు స్నేహితుడు రాజేష్ ను కూడా వెళ్లి కలుస్తుంది. అసలు విషయం చెబుతుంది.

జూన్ 12న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు కోసం మీనా కారు కొనివ్వాలని అనుకుంటుంది. దాంతో రాజేష్ దగ్గరకు వెళ్లి కారు కొనేందుకు సాయం కోరుతుంది. కారు కన్సల్టెన్సీ దగ్గరకు తీసుకెళ్లమని అడుగుతుంది. దీంతో వాళ్లు అక్కడికి వెళ్తారు. సెకండ్ హ్యాండ్ కార్లను చూసి ఒక కారును ఫైనల్ చేస్తారు. ఆ కారుకు 3 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ముందుగా 80 వేలు అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ మీనా దగ్గర ఉన్న డబ్బులకు ఇంకా 20 వేలు తక్కువ పడుతుంది. దాంతో చక్రపాణి అనే వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుంటుంది. అయితే వడ్డీకి అప్పు తీసుకునేప్పుడు ప్రభావతి చూస్తుంది. ఆ డబ్బులను ఏం చేస్తావని అడుగుతుంది. కానీ మీనా చెప్పదు. నేనే బంగారం చేయించుకుంటానని అంటుంది. మరోవైపు మౌనికాను సంజూ టార్చర్ చేస్తూనే ఉంటాడు. తన భర్త మారాలని మౌనికా అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభిస్తుంది. మరోవైపు రోహిణి బ్యూటీ పార్లర్ కు మనోజ్ వెళ్తాడు. పార్లర్ కు ప్రభావతి పేరును తొలగించడం గమనించి షాక్ అవుతాడు.

జూన్ 13న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రోహిణి తన పార్లర్ కు ప్రభావతి పేరును తొలగించడంతో మనోజ్ షాక్ అవుతాడు. కానీ రోహిణి వ్యాపారాన్ని పెంచేందుకు పెద్ద కంపెనీతో కలిసిపోయానని చెబుతుంది. అప్పుడు ఇంకా కస్టమర్లు వస్తారని, బాగా డబ్బులు వస్తాయని చెబుతుంది. డబ్బులు వస్తాయని ఆశపడి మనోజ్ సరేనని అంటాడు. ఇక ఇంటి దగ్గర ప్రభావతి మీనా అప్పు చేసిన సంగతి అందరికీ చెప్పాలని అనుకుంటుంది. మీనా కన్సల్టెన్సీలో 80 వేలు అడ్వాన్స్ కట్టి ఇంటికి రాగానే మండిపడుతుంది. డబ్బులన్నీ ఏం చేశావని, మీ పుట్టింట్లో ఇచ్చి వచ్చావా? అని నిందలు వేస్తుంది. నానా మాటలు అంటుంది. మనస్సుకు గాయం చేసేలా మాట్లాడుతుంది. ఇదే సమయంలో రోహిణి పార్లర్ కు తన పేరు తొలగించాడని మనోజ్ చెబుతాడు. కానీ రోహిణిని మాత్రం ఒక్క మాట అనడు. ప్రభావతి చూపిన తేడాకు బాలు, సత్యం మండిపోతారు. కానీ ప్రభావతి కూడా పార్లర్ కు తన పేరును తీసేశారని చెప్పడంతో షాక్ అవుతుంది. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X