Gunde Ninda Gudi Gantalu Weekly: డీల్ కోసం ఫ్యామిలీ డ్రామా, మత్తులో బయటపడ్డ నిజం, 50 లక్షల ఫైన్..

Photo courtesy: Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 16వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

సోమవారం ఎపిసోడ్ అనూహ్య మలుపులతో ఆసక్తికరంగా సాగింది. ప్రారంభంలోనే బాలు, మనోజ్ తమ శుభవార్త చెప్పేందుకు పోటీ పడగా, ప్రభావతి తన వ్యంగ్యంతో వాతావరణాన్ని మార్చింది. అయితే సత్యం ఆమెకు కౌంటర్ ఇస్తూ పరిస్థితిని సమతుల్యం చేశాడు. అనంతరం బాలు సుమతి పెళ్లి ఫిక్స్ అయ్యిందని చెప్పడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ప్రభావతి మరోసారి నెగెటివ్‌గా స్పందించడంతో బాలు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సమయంలో మనోజ్ అనూహ్యంగా పాజిటివ్‌గా స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని మాటలు విని బాలు షాక్ అవుతూ కాసేపు విచిత్రంగా ప్రవర్తించడం ఎపిసోడ్‌కు హాస్యాన్ని జోడించింది.

Gunde Ninda Gudi Gantalu week roundup story March 16th to March 20 th Episodes highlights

Photo courtesy: Jio Hotstar

తరువాత మనోజ్ తన మ్యారేజ్ యానివర్సరీని గ్రాండ్‌గా చేయాలని చెప్పగా, దాని వెనుక అసలు కారణం బయటపడింది. ముంబై నుంచి వచ్చే ఇంటర్నేషనల్ డీలర్‌ను ఇంప్రెస్ చేయడానికి ఈ ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించాడు. కీలకంగా, ఆ డీల్ కోసం తన ఫ్యామిలీని రిచ్‌గా చూపించాలని మనోజ్ చెప్పడం ట్విస్ట్‌గా మారింది. బాలు, రవి తమ నిజాయితీపై నిలబడినా, చివరకు కుటుంబం కోసం సహాయం చేయడానికి అంగీకరించారు. మరోవైపు రోహిణి కూడా మీనాను ఒప్పించడానికి ప్రయత్నించగా, మొదట నిరాకరించిన మీనా చివరికి ఒప్పుకుంది. చివరిలో బాలు-మీనాల మధ్య జరిగిన సంభాషణ భావోద్వేగంతో పాటు హాస్యాన్ని కలిపింది. అబద్ధాలపై మీనా సందేహాలు, బాలు ఆందోళన ఎపిసోడ్‌కు బలం చేకూర్చాయి.

మంగళవారం ఎపిసోడ్‌లో కథ ఉత్కంఠభరితంగా ముందుకు సాగింది. బాలు, మీనా ఇద్దరూ మనోజ్, రోహిణి ప్లాన్‌లపై అనుమానంతో ఉండగా, బాలు ఈ డ్రామాను ఎంతవరకు కంట్రోల్ చేయగలనో తెలియదని ఆందోళన వ్యక్తం చేస్తాడు. ఇదే సమయంలో మనోజ్-రోహిణి తమ మ్యారేజ్ యానివర్సరీతో పాటు ఫర్నిచర్ షాప్ 100 రోజుల వేడుకలను ఫైవ్ స్టార్ హోటల్‌లో ఘనంగా నిర్వహిస్తారు. ఆర్భాటమైన ఏర్పాట్లు, స్టైలిష్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. రోహిణి తన ఫ్రెండ్ విద్యకు అసలు ప్లాన్ చెబుతూ, భారీ లోన్స్ తీసుకుని ఈ ఈవెంట్ పెట్టామని, పెద్ద డీల్ వస్తే జీవితం మారిపోతుందని వెల్లడిస్తుంది.

ఇక అసలు ట్విస్ట్‌గా బాలు ఫోన్ దొంగిలించాలని రోహిణి-విద్య ప్లాన్ చేయడం కథలో టెన్షన్ పెంచుతుంది. మరోవైపు మనోజ్ తన స్టైల్‌తో అతిథులను ఆకట్టుకుంటూ, బాలు మీద జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు. ప్రభావతి గ్రాండ్ ఎంట్రీ, సత్యం సరదా ఆటపాటలు ఎపిసోడ్‌కు వినోదాన్ని జోడిస్తాయి. అయితే అసలు హైలెట్ బాలు-మీనాల గ్రాండ్ ఎంట్రీ. వీరి స్టైలిష్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రభావతి చేసిన సెటైర్లకు బాలు తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం నవ్వులు పూయిస్తుంది. ఇదే సమయంలో మనోజ్ ఢీ కొట్టడంతో బాలు ఫోన్ పడిపోవడం, విద్య దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నించడం కీలక మలుపు. కానీ బాలు అప్రమత్తంగా ఉండటంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది.

బుధవారం ఎపిసోడ్‌లో మనోజ్-రోహిణి అనివర్సరీ పార్టీ హంగామా మరింత ఉత్కంఠగా కొనసాగింది. ఫైవ్ స్టార్ హోటల్‌లో జరుగుతున్న ఈ గ్రాండ్ వేడుకలో ప్రతి సన్నివేశం ట్విస్టులతో ఆకట్టుకుంది. ప్రారంభంలో బాలు-మీనా కలిసి సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే, రోహిణి వారి ఫోన్ దొంగిలించాలనే ప్లాన్‌తో దగ్గరవుతుంది. కానీ బాలు తెలివిగా స్పందించి అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె ప్రయత్నం మళ్లీ విఫలమవుతుంది. దీంతో విద్యతో కోపంగా మాట్లాడిన రోహిణి, ఎలాగైనా ఫోన్ దక్కించుకోవాలని పట్టుదల చూపుతుంది.ఇక ముంబై నుంచి వచ్చిన డీలర్ ముఖేష్ ఎంట్రీతో కథకు కొత్త మలుపు తిరుగుతుంది. మనోజ్ తన ఫ్యామిలీని అతని ముందుకు గొప్పగా ప్రెజెంట్ చేస్తూ భారీ బిల్డప్ ఇస్తాడు.

సత్యంను గొప్ప తండ్రిగా, ప్రభావతిని ప్రముఖ డాన్సర్‌గా పరిచయం చేయడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు బాలు, మీనా, శృతి, రవి సరదాగా ప్రవర్తించడం మనోజ్‌కు నచ్చక, వారిని లో క్లాస్‌గా చూపించే ప్రయత్నం చేస్తాడు. తర్వాత కేక్ కటింగ్ సందర్భంగా సత్యం ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అతని మాటలకు ఇంప్రెస్ అయిన ముఖేష్, మనోజ్‌కు డీలర్‌షిప్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో కుటుంబం ఆనందంలో మునిగిపోతుంది. అయితే మరోవైపు బాలు ఫారెన్ లిక్కర్ విషయంలో తొలుత వెనుకంజ వేసినా, చివరకు తాగాలని నిర్ణయించుకోవడం కొత్త టెన్షన్‌కు దారితీసింది. మీనా ఇంటికి వెళ్లాలని కోరినా, పరిస్థితులు మారిపోవడంతో అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ పరిణామాలతో రాబోయే ఎపిసోడ్‌లో బాలు వల్ల పెద్ద ట్విస్ట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

గురువారం ఎపిసోడ్ హై డ్రామా, ఉత్కంఠతో సాగింది. మనోజ్-రోహిణి వెడ్డింగ్ అనివర్సరీ పార్టీ గ్రాండ్‌గా జరుగుతుండగా, ముంబై నుంచి వచ్చిన చీఫ్ గెస్ట్ ముఖేష్ కోసం ఏర్పాటు చేసిన మందు పార్టీ కథకు కీలక మలుపు తీసుకొచ్చింది. 'మీరు తాగితేనే డీల్' అంటూ ముఖేష్ కండిషన్ పెట్టడంతో, మనోజ్ ఇష్టం లేకపోయినా తాగాల్సి వస్తుంది. రవిని కూడా ఒత్తిడి చేయడంతో అతడూ మద్యం సేవించి, ఇద్దరూ మత్తులోకి వెళ్లిపోతారు. ఇక బాలు మొదట పార్టీకి దూరంగా ఉన్నా, రవి కనిపించక లోపలికి వెళ్లి పరిస్థితి చూసి షాక్ అవుతాడు. అదే సమయంలో ముఖేష్ పెద్ద కాంట్రాక్ట్ డీల్ ప్రకటించి వెంటనే సైన్ చేయమంటాడు.

బాలు హెచ్చరించినా, మనోజ్ మత్తులోనే డాక్యుమెంట్ చదవకుండా సైన్ చేస్తాడు. తర్వాత బాలును కూడా తాగమని బలవంతం చేయడంతో, అతడు కంట్రోల్ కోల్పోయి వరుసగా తాగి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. మత్తులో ఉన్న సమయంలో బాలు అసలు నిజాలు బయటపెడతాడు. తన దగ్గర 40 కార్లు లేవని, మీనా పూలు అమ్ముతుందని, రవి చెఫ్ మాత్రమేనని చెబుతాడు. దీంతో ముఖేష్ షాక్ అవుతూ కోపంతో వెళ్లిపోతాడు. కానీ మిగతావాళ్లు దీనిని సీరియస్‌గా తీసుకోరు. ఈ గందరగోళంలో రోహిణి ప్లాన్ అమలు చేస్తూ, బాలు ఫోన్‌ను మనోజ్ కోట్‌లో పెట్టి కొత్త సమస్యకు నాంది పలుకుతుంది. చివర్లో మద్యం మత్తులో బాలు, రవి, మనోజ్ ఇంటి వద్ద హంగామా చేయడం, సత్యం కోపంతో ఊగిపోవడం ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది.

శుక్రవారం ఎపిసోడ్ హాస్యంతో పాటు భావోద్వేగాలను కలగలిపి ఆసక్తికరంగా సాగింది. పార్టీ నుంచి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మనోజ్, రవి, బాలు ముగ్గురూ గేటు దగ్గర తూలుతూ కనిపించగా, ప్రభావతి ఆందోళనతో పరుగెత్తుకుంటూ వస్తుంది. అయితే మత్తులో ఉన్న రవి తన తల్లినే గుర్తుపట్టకుండా "ఈ ఆంటీ ఎవరు?" అని అడగడం షాకింగ్‌గా మారుతుంది. మనోజ్ కూడా అదుపు తప్పి మాట్లాడడంతో సత్యం తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. వెంటనే వారిని ఇంట్లోకి రానివ్వొద్దని ఆదేశించి తలుపులు మూయిస్తాడు. ప్రభావతి వేడుకున్నా సత్యం కఠినంగా వ్యవహరించడంతో ముగ్గురు కొడుకులు బయటే ఉండాల్సి వస్తుంది.

చలిలో పడుకున్న వారి పరిస్థితి బాధ కలిగిస్తూనే, దుప్పటి కింద వేసుకుని చాపను కప్పుకుని నిద్రపోవడం కొంత హాస్యాన్ని కూడా తెస్తుంది. కొంతసేపటికి బాలు మత్తు దిగి తన తప్పును గ్రహించి పశ్చాత్తాపంతో మీనాతో మాట్లాడడం ఎపిసోడ్‌కు ఎమోషనల్ టచ్ ఇస్తుంది.ఇక రోహిణి ట్రాక్ కథలో ఉత్కంఠను పెంచుతుంది. శివ దొంగతనం వీడియో కోసం మనోజ్ ఫోన్‌ను తీసుకోవాలని ప్రయత్నించగా, మీనా మేల్కొని ఉండటం వల్ల సాధ్యం కాదు. దివ్య ఫోన్ కాల్‌తో రోహిణి టెన్షన్ మరింత పెరుగుతుంది. మరుసటి రోజు ఉదయం సత్యం ముగ్గురినీ గట్టిగా మందలిస్తాడు. రవి, బాలు క్షమాపణలు చెప్పినా, మనోజ్ మాత్రం తన తప్పును సమర్థించుకుంటూ రూ.50 లక్షల డీల్ గురించి చెప్పడం కథకు కొత్త ట్విస్ట్ తీసుకొస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X