Gunde Ninda Gudi Gantalu Weekly: తప్పించుకున్న మనోజ్.. ఇరకాటంలో పడ్డ రోహిణి.. డేగ కన్నేసిన బాలు

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండి గుడిగంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 24వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

మార్చి 24వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో రోహిణికి మలేషియా తండ్రి లేకున్నా ఉన్నాడని చెప్పి మనోజ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లు అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీసింది. కానీ ప్రస్తుతం మాత్రం రోహిణికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఓవైపు మనోజ్ కు జాబ్ లేకపోవడంతో బాలు మాటిమాటికి దెప్పిపోడుస్తున్నాడు. మనోజ్ ను బాలు పదే పదే మాటలు అనడం రోహిణికి ఏమాత్రం నచ్చడం లేదు. దాంతో తన భర్తకు సపోర్ట్ మాట్లాడి ఇరకాటంలో పడింది. అంతా మనోజ్ కు సపోర్ట్ మాట్లాడే బదులు తన మలేషియా తండ్రికి ఏ బిజినెస్సో, ఏ కార్ల కంపెనీనో పెట్టించొచ్చు కదా అని బాలు ఎటకారం చేస్తాడు. దాంతో మనోజ్ కు జాబ్ లేదని అప్పటి వరకు ఆగ్రహం చేసిన బాలు ఇక ఫోకస్ మొత్తం రోహిణిపై పెడుతాడు. సీన్ మొత్తం తనవైపు తిరిగడంతో రోహిణి కంగారు పడుతుంది. బాలు మాటలకు బాధపడ్డట్టు నటించి అసలు సమస్యను పక్కదారి పట్టిస్తుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story March 24th to March 28th Episodes highlights

మార్చి 25న తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో.. అప్పటికే సత్యం ఇంట్లో మౌనిక తాళి మార్చే ఫంక్షన్ ముగియడంతో మళ్లీ మనోజ్ కు జాబ్ లేదనే తతంగం నడుస్తుంది. ఇదే సమయంలో రోహిణికి మనోజ్ తో పెళ్లి అయినప్పటి నుంచి తమ పుట్టింటి నుంచి ఒక్కరూ రాకపోవడంతో అత్త ప్రభావతి ఒత్తిడి చేస్తుంది. మీ నాన్న ఒక్కసారి కూడా రాలేదు కదా రోహిణి, ఈసారి ఎలాగైనా పిలిపించు. అలాగే మనోజ్ కు మీ నాన్నతో చెప్పి ఏదోక బిజినెస్ పెట్టించి ఆ బాలుగాడి నోరు మూయించు అని సలహా ఇస్తుంది. ఓ రకంగా రోహిణిని ఆదేశిస్తుంది... దీంతో రోహిణి నో చెప్పలేకపోతుంది. అప్పటికే మనోజ్ కు జాబ్ లేకపోవడం, పైగా ఎంతో కాలంగా తన తండ్రి మలేషియాలో ఉంటాడని అబద్ధాలు చెబుతూ వస్తుండటంతో ఇక ఈసారి నో చెప్పే అవకాశం లేకుండా పోయింది రోహిణికి. దీంతో తన తండ్రి జర్మనీలో ఉన్నాడని చెబుతుంది. ఎలాగైనా తన తండ్రితో మాట్లాడి రమ్మని చెబుతానని చెబుతుంది.

మార్చి 26వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో అత్త ప్రభావతికి తన తండ్రిని రమ్మని చెబుతానని చెప్పిన రోహిణి, ఇక తప్పని పరిస్థితిలో తన తండ్రి రావడం లేదని సమాధానం ఇస్తుంది. బదులుగా తన మేనమామను మలేషియా నుంచి పంపిస్తున్నారని అత్త ప్రభావతికి చెబుతుంది. తన తండ్రి జర్మనీలో బిజినెస్ పనిలో చాలా బిజీగా ఉన్నాడని, ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని చెప్పి తాత్కాలికంగా ఆ సమస్య నుంచి గట్టేక్కుతుంది. ఆ వెంటనే తన స్నేహితులురాలు వద్దకు వెళ్లి ఇంట్లో జరిగిన విషయాలన్నింటిని చెబుతుంది. ఇక ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతుంది. దాంతో తన స్నేహితురాలు తన మేనమామ ఎలా ఉంటాడో ఇంట్లో వాళ్లకు తెలియదు కాబట్టి ఒక జూనియర్ ఆర్టిస్ట్ ను ఏర్పాటు చేసి తన మేనమామగా నటించేలా ప్లాన్ చేద్దామని బదులిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ను సంప్రదిస్తారు. ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ ఇస్తున్నామని అబద్ధం చెప్పి రోహిణికి మేనమామగా నటించేందుకు ఒప్పిస్తుంది. అతను కూడా ఒప్పుకుంటాడు. దాంతో మేనమామను తీసుకొచ్చే పని రోహిణికి సగం పూర్తవుతుంది.

Gunde Ninda Gudi Gantalu week roundup story March 24th to March 28th Episodes highlights

మార్చి 27వ తేదీన (గురువారం) ఇక మేనమామతో మాట్లాడానని ఆయన వెంటనే బయల్దేరారని కూడా అత్త ప్రభావతితో చెబుతుంది. అంతకు ముందు మేనమామగా నటించేందుకు ఎంపిక చేసిన వ్యక్తిని మలేషియా బిజినెస్ మెన్ గా ఇంట్లో వాళ్లు నమ్మాలంటే అలాంటి ఆహార్యం ఉండాలని దుస్తులు కొనుగోలు చేస్తుంది. అలాగే మెట్టింటికి వస్తున్న సందర్భంగా తనకు సారె, మనోజ్ కు గోల్డ్ బ్రాస్లెట్ పెట్టాలని ఆ జూనియర్ ఆర్టిస్ట్ కు చెబుతుంది. తన భర్త ఇతనే నటిస్తున్నాడంటూ మనోజ్ ఫొటోను కూడా చూపిస్తుంది. అయితే దుస్తులు, గోల్డ్, ఇతర క్యాస్టూమ్స్ కు అయ్యే ఖర్చు కోసం గుణ ఫైనాన్షియర్ దగ్గర లక్ష రూపాయలు అప్పుచేస్తుంది. అయితే అక్కడే పని చేస్తున్న మీనా తమ్ముడు శివ రోహిణిని చూస్తాడు. ఇక అప్పు తీసుకున్న డబ్బులతో మీనా కావాల్సినవన్నీ కొనేసి జూనియర్ ఆర్టిస్ట్ కు ఇస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన మేనమామ వస్తున్నాడని అత్త ప్రభావతికి చెబుతుంది. అదే సమయంలో సత్యం తల్లి సుశీలమ్మ కుటంబం మొత్తంతో తన సొంతం గ్రామం పసర్లపూడికి రావాలని ఫోన్ చేసి చెబుతుంది. దీంతో అంతా ఆ ఊరికి బయల్దేరుతారు. ఇక తన మామను కూడా పసర్లపూడి గ్రామానికే రమ్మనని కూడా అత్త ప్రభావతి, మామ సత్యంకు రోహిణి చెబుతుంది.

మార్చి 28వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో సత్యం తన సొంతూరిలో కుటుంబ సమేతం అడుగుపెడుతాడు. కుటంబ సభ్యుల్లోని కొడుకులు, కోడళ్లను ఊర్లో తన చిన్నాటి స్నేహితులు కనిపించడంతో పరిచయం చేయిస్తాడు. అలాగే తన స్నేహితుల మంచి చెడులు తెలుసుకుంటాడు. ఆనందంతో ఉపొంగిపోతాడు. ఊర్లోని వీధులన్నీ తిరుగుతూ తన కొడుకులు, కోడళ్లకు చిన్నప్పటి మెమోరీస్ ను గుర్తుచేసుకుంటూ చెబుతుంటాడు. అలా ఊరంతా తిరుగుతూ చివరికి ఇంటికి వెళ్తాడు. అప్పటికే వీరికి కోసం ఎదురుచూస్తున్న సుశీలమ్మ వారందరికీ దిష్టి తీసి, ఇంట్లోకి తీసుకెళ్తుంది. అందరి మంచిచెడులు తెలుసుకొని, కొత్తగా పెళ్లైన రవి, శృతిలను ఆశీర్వదిస్తుంది. ఇక రోహిణి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. తన మేనమామగా వచ్చే జూనియర్ ఆర్టిస్ట్ రావడానికి ఆలస్యం చేయడంతో ఫోన్ చేసి క్లాస్ పీకుతుంది. ఆ సంగతిని బాలు గమనిస్తూ ఉంటాడు. కానీ ఎవరికి ఫోన్ చేసిందనే విషయం తెలుసుకోలేకపోతాడు. మొత్తానికి రోహిణి వాళ్ల మేనమామ విషయంలోనే ఏదో జరుగుతుందని పసిగడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X