Gunde Ninda Gudi Gantalu Weekly: రోహిణికి విపరీతమైన టెన్షన్.. పల్లెటూరిలో బాలు మీనా రొమాన్స్.. చివరికి
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండి గుడిగంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
మార్చి 31వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈ వారం చాలా ఆసక్తికరంగా సాగింది. గత వారంలో మనోజ్ కు జాబు లేకపోవడం, మౌనిక తాళి మార్చే ఫంక్షన్ జరగడంతో సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇక ఈ వారం మొత్తం రోహిణి పై నడిచింది. రోహిణి మనోజ్ ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు తన పుట్టింటి నుంచి ఒక్కరు కూడా రాలేదు. దాంతో మరిది బాలు, అత్త ప్రభావతి నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దాంతో అన్ని దారులు మూసుకోవడం మూలంగా తన మేనమామ వస్తున్నాడని అబద్ధం చెపుతుంది. తన మేనమామగా నటించేందుకు ఒక జూనియర్ ఆర్టిస్టును ఏర్పాటు చేస్తుంది. ఆయనకు ముందుగానే బట్టలు, గోల్డ్ బ్రాస్ లెట్ ఇచ్చి తను చెప్పిన వెంటనే బయల్దేరు అని చెబుతుంది. ఇక ఇంటికి వెళ్లి తన మేనమామ వస్తున్నాడని చెబుతుంది. దాంతో ప్రభావతి ఎంతగానో సంతోషిస్తుంది.

ఏప్రిల్ 1న తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో.. రోహిణి విషయం ఓవైపు నడుస్తుండగానే మరోవైపు సత్యం తల్లి గారు సుశీలమ్మ ఫోన్ చేస్తుంది. ఉగాది పండుగకు అందరూ ఇక్కడికి రావాలని కొడుకు సత్యంతో చెబుతుంది. మనవళ్ళు, మనవరాలను తీసుకొని రావాలని అంటుంది. దాంతో సత్యం కుటుంబ సభ్యులందరినీ తన సొంత ఊరైన పసర్లపూడి గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని, అందరూ సిద్ధంగా ఉండండి అని తన నిర్ణయాన్ని చెబుతాడు. శృతి రాలేనని రవితో చెప్పినప్పటికీ అత్త ప్రభావతి వల్ల ఆ గ్రామానికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. కానీ అక్కడ తనకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా ఒక్కరోజూ కూడా ఉండబోనని రవితో అంటుంది. ఇక రవి నీకు అలాంటి పరిస్థితి ఏమాత్రం కలగబోదని, నువ్వు వచ్చి చూస్తే పల్లెటూరిలో ఎంతటి ప్రశాంతత లభిస్తుందో నీకే తెలుస్తుందని రవి శృతితో చెబుతాడు.
ఏప్రిల్ 2వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో ఇక సత్యం కుటుంబ సమేతంగా తన తల్లి గారి ఊరైన పసర్లపూడి గ్రామానికి బయలుదేరుతారు. దారిలో తన గ్రామం గురించి బాలుకు సత్యం ఎన్నో విషయాలు చెబుతాడు. తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషిస్తాడు. సత్యం ఎంతో సంతోషంతో తన చిన్నప్పటి విషయాలను బాలుతో చెబుతుంటే ప్రభావతి మాత్రం తనకేం పట్టనట్టు ఉంటుంది. దాంతో బాలు తనదైన శైలిలో పంచులు పేలుస్తాడు. ఇక చివరికి ప్రయాణం ముగిసి పసర్లపూడి గ్రామానికి చేరుకుంటారు. గ్రామానికి వెళ్లగానే సత్యం ఊరి ప్రారంభంలోనే దిగి తన స్నేహితులను కలిసి మాట్లాడుతాడు. ఇక తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా వారికి పరిచయం చేస్తాడు. తన స్నేహితుల బాగోగులు కూడా అడిగి తెలుసుకుంటాడు. అందరినీ కలిసి సందర్భంగా ఆనందంలో మునిగి తేలుతాడు.
ఏప్రిల్ 3వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో పసర్లపూడి గ్రామంలో సుశీలమ్మ తన కొడుకు కోడలు మనవళ్లు మనవరాళ్ళు ఎప్పుడు వస్తారు అని ఎదురుచూస్తుంది. ఈ లోగా కుటుంబ సమేతంగా అందరూ కనిపిస్తారు. ముందుగా బాలు వచ్చి సుశీలమ్మను ఎత్తుకొని తిప్పుతాడు. ఆనందంతో ఆమె పొంగిపోతుంది. కొడుకు కోడలు మనవళ్లు మనవరాల్లను పలకరిస్తుంది. అందరి బాగోగులు తెలుసుకుంటుంది. అందరినీ ఇంట్లోకి తీసుకెళ్లి ఇంట్లోనే విషయాలను చెబుతుంది. ఇక రవికి ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా వివరిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్క గదిని ఇస్తుంది. చివరికి బాలు మీనా మిగలడంతో వారిని తన రూములోనే పడుకోమని చెబుతుంది. అయితే బాలు ను మీనా తో కలవకుండా చేసి కాసేపు ఆట పట్టిస్తుంది. దీంతో మీనాను ఎలాగైనా కలవాలని బాలు నిర్ణయించుకుంటాడు. దీంతో ఒక లెటర్ రాసి 'అందరూ పడుకున్నాక గడ్డివాము దగ్గరకు రా నీకో రహస్యం చెబుతానని చెబుతాడు'. అయితే అప్పటికే రోహిణి అనుమానంగా తిరుగుతూ ఎవరికో ఫోన్ మాట్లాడుతున్న విషయాన్ని బాలు గమనిస్తాడు. అదే విషయాన్ని మీనాతో చెబుతాడు. ఆ మలేషియా మేనమామ సంగతేంటో చూస్తానని నిర్ణయించుకుంటాడు.

ఏప్రిల్ 4వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో రోహిణ వాళ్ల మేనమామ కోసం ప్రభావతి ఎదురుచూస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడూ వస్తారా? అని ఎదురుచూస్తూనే ఇంట్లో తెగ హడావుడి చేస్తూ ఉంటుంది. ప్రభావతి చేసే ఓవరాక్షన్ కు బాలు మండిపడుతాడు. తనదైన శైలిలో పంచుల వర్షం కురిపిస్తాడు. మరోవైపు సత్యం కూడా ప్రభావతి హడావుడికి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇక సుశీలమ్మ కూడా రోహిణి కంటే నువ్వే ఎక్కువ తాపత్రాయ పడుతున్నావని మండిపడుతుంది. అందుకు ప్రభావతి మాట్లాడుతూ ఆయన మలేషియా నుంచి వస్తున్నారు కదా అందుకని అన్ని ఏర్పాట్లు చేయాలని కదా అని బదులిస్తుంది. ఇక బయట కారు వచ్చిన శబ్ధం కావడంతో వెళ్లి చూస్తారు. అందులో వచ్చింది రోహిణి వాళ్ల మేనమామ కాదని తెలిసే లోపే రోహిణి వాళ్ల మేనమామగా జూనియర్ ఆర్టిస్ట్ మాణిక్యం వస్తాడు. భయంతో పరుగులు తీస్తూ వచ్చి ఇంటి ముందు ఉన్న కుడితి తొట్టేలో పడిపోతాడు. దాంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక అతన్ని పైకి లేపి, ఇంట్లోకి తీసుకెళ్తారు. ఆయన ఫ్రెషప్ అయ్యి పొడి బట్టలు వేసుకుని వస్తాడు. అయితే రోహిణి మేనమామగా వచ్చిన ఆయన ఏం మాట్లాడాడు, బాలు ఎలా స్పందించాడు అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










