Gunde Ninda Gudi Gantalu Weekly: బాలు అరెస్ట్, మనోజ్‌పై మీనా దాడి, రోహిణి ప్లాన్ ఫెయిల్, సుమతి పెళ్లి ఫిక్స్!
photo courtesy: jio hotstar
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మార్చి 9వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
గుండె నిండా గుడి గంటలు సోమవారం (మార్చి 9) ఎపిసోడ్ భావోద్వేగభరిత సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగింది. తన భవిష్యత్తు కోసం అక్క మీనా, బావ బాలు నాటకం ఆడారని తెలుసుకున్న శివ తీవ్ర పశ్చాత్తాపంలో పడతాడు. తన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భావించి, మీనాతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాలును చూసి క్షమాపణ కోరుతాడు. బాలు మాత్రం శివను సముదాయిస్తూ ఇకనైనా చెడు సవాసాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టమని సలహా ఇస్తాడు. మీనా జరిగిన నిజాన్ని పోలీసులకు వివరించినా, ఎస్‌ఐ వచ్చేవరకు ఏమీ చేయలేమని వారు చెబుతారు. సహాయం కోసం మీనా శృతికి ఫోన్ చేస్తుంది. కానీ శృతి తండ్రి బాలుకు సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. దీంతో మీనా తీవ్ర ఆందోళనకు గురవుతుంది.

photo courtesy: jio hotstar
ఇదే సమయంలో శృతి తల్లి శోభ మరోవైపు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పడంతో మీనా ఇంట్లో కూడా కలకలం రేగుతుంది.ఇంటికి వచ్చిన మీనాను ప్రభావతి తీవ్రంగా ప్రశ్నిస్తుంది. సత్యం కూడా కోపంగా స్పందిస్తూ ఇలాంటి విషయాలు తనకు ముందే చెప్పాల్సిందని అంటాడు. ఇంట్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మీనా తీవ్రంగా బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం ఎస్‌ఐ ముందుకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించడంతో అసలు నిజం బయటపడుతుంది. దీంతో ఎస్‌ఐ బాలును విడుదల చేయమని ఆదేశిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత శివ బాలు కాళ్లపై పడిపోతాడు. బాలు అతన్ని లేపి ప్రేమగా బుద్ధి చెబుతాడు. ఇక చివర్లో రాజేష్ ఇచ్చిన సమాచారంతో గుణను పట్టుకునేందుకు బాలు ప్లాన్ వేస్తాడు. గుణను బలంగా కొట్టి హెచ్చరించడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది
మంగళవారం ఎపిసోడ్ ఉత్కంఠతో పాటు భావోద్వేగాలతో నిండిపోయింది. బాలు చేసిన పనిపై సత్యం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "ప్రతి పనికీ ఒక పద్ధతి ఉంటుంది. పని తప్పు కాకపోయినా చేసిన విధానం సరైంది కాదు" అంటూ బాలను మందలిస్తాడు. తన నిర్ణయాలు మీనా జీవితంపై కూడా ప్రభావం చూపుతాయని గుర్తు చేస్తూ ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తాడు. తండ్రి మాటలు విన్న బాలు నిశ్శబ్దంగా నిలబడి ఇకపై తప్పు చేయనని హామీ ఇస్తాడు.ఇదిలా ఉండగా శృతి-రవి మధ్య విభేదాలు మొదలవుతాయి. జ్వరంతో బాధపడుతున్న శృతి తనతో ఉండాలని రవిని కోరుతుంది. కానీ హోటల్‌లో వచ్చిన పెద్ద ఆర్డర్ కారణంగా రవి వెళ్లాల్సి వస్తుంది. దీంతో శృతి ఆవేశంతో భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
చివరికి రవి సారీ చెప్పి పనికి వెళ్లిపోవడంతో శృతి బాధతో తన పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయిస్తుంది. మీనా, ప్రభావతి ఎంత నచ్చజెప్పినా శృతి వినకుండా తన పుట్టింటికి వెళ్లిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభావతి రవిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుండగా, మీనా మాత్రం రవిని శాంతింపజేస్తూ సమస్యను సర్దుబాటు చేసుకోవాలని సూచిస్తుంది. ఇక మీనా బంధువులు శుభలేఖ ఇవ్వడానికి ఇంటికి రాగానే ప్రభావతి వారిని అవమానిస్తుంది. దీంతో వారు భోజనం చేయకుండా వెళ్లిపోవడంతో మీనా తీవ్రంగా బాధపడుతుంది. ఇదే సమయంలో జలుబుతో వచ్చిన మనోజ్ చికెన్ సూప్ తెమ్మని మీనాకు చెప్పడంతో వాగ్వాదం మొదలవుతుంది. మాటలు పెరగడంతో మనోజ్ మీనాను అవమానకరంగా మాట్లాడతాడు. దీంతో ఆగ్రహించిన మీనా బెల్ట్ తీసుకుని మనోజ్‌పై దాడి చేస్తుంది. ఈ అనూహ్య ఘటనతో ఇంట్లో కలకలం రేగగా ఎపిసోడ్ హైడ్రామాతో ముగుస్తుంది.
బుధవారం ఎపిసోడ్‌లో ఉత్కంఠతో పాటు వినోదం కూడా కలిసిపోయాయి. గత ఎపిసోడ్‌లో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకుని మీనా తీవ్ర ఆవేశానికి గురవుతుంది. మనోజ్, ప్రభావతి, రోహిణిపై బెల్ట్‌తో దాడి చేస్తున్నట్లు భావిస్తుంది. అయితే అది నిజం కాదని, మీనా ఊహల్లో జరిగిన కల మాత్రమే అని తర్వాత తెలుస్తుంది. మీనా అలా నవ్వుతుండటాన్ని చూసి ప్రభావతి, రోహిణి, మనోజ్ ఆశ్చర్యపోతారు. బాలు వచ్చిన తర్వాత మీనా తనకు వచ్చిన ఆ కల గురించి చెబుతుంది. అది విన్న బాలు కూడా నవ్వుతాడు. కానీ ప్రభావతికి మాత్రం వారి నవ్వు అసలు నచ్చదు. ఈ సమయంలో ఇంటికి వచ్చిన సత్యం తన కోడలు ఇలా మనస్ఫూర్తిగా నవ్వడం చూసి సంతోషపడతాడు.
ఇక మరోవైపు శృతి ఒక్కసారిగా లగేజ్‌తో పుట్టింటికి రావడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడతారు. కానీ శృతి మాత్రం తలకు నొప్పి ఉందని చెప్పి కారణం చెప్పకుండా కోపంగా తన గదిలోకి వెళ్లిపోతుంది. కొంతసేపటికి రవి అక్కడికి వచ్చి శృతిని కలుస్తాడు. తన తప్పు అంగీకరిస్తూ క్షమాపణ చెప్పి డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేస్తాడు. దీంతో శృతి మనసు మార్చుకుని అతనితో తిరిగి అత్తవారింటికి వెళ్లడానికి అంగీకరిస్తుంది. రాత్రి భోజన సమయంలో మీనా అందరికీ వడ్డిస్తుంటే, మనోజ్‌కు మాత్రం కావాలనే వడ్డించదు. దీనిపై ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. ఇదే సమయంలో రవి, శృతి ఇంటికి చేరుకుంటారు. శృతి వెళ్లి తిరిగి రావడంపై ప్రభావతి ప్రశ్నించగా, శృతి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంది. బాలు వ్యంగ్యంగా మాట్లాడడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. చివరగా రోహిణిపై బాలు చేసిన వ్యాఖ్యలతో కుటుంబంలో మరోసారి కొత్త ఉద్రిక్తతలు మొదలయ్యే సూచనలతో ఎపిసోడ్ ముగిసింది.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో రవి, శృతి ఇద్దరూ కలిసి ఇంటికి రావడం చూసి ప్రభావతి ఆశ్చర్యానికి గురవుతుంది. పుట్టింటికి వెళ్లిపోయిన శృతి తిరిగి రావడం ఎందుకని ప్రశ్నించగా, రవి తన దగ్గరకు వచ్చి ఏడ్చి డైమండ్ రింగ్ ఇచ్చాడని శృతి చెబుతుంది. ఈ విషయంపై బాలు వ్యంగ్యంగా మాట్లాడడంతో ఇంట్లో వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. సత్యం మాత్రం మధ్యలో జోక్యం చేసుకుని గొడవను ఆపే ప్రయత్నం చేస్తాడు.అయితే ప్రభావతి కోపంతో రవిని ప్రశ్నించగా, మీనా ఫోన్ చేసి శృతి సమస్య గురించి చెప్పిందని రవి చెబుతాడు. దీంతో ప్రభావతి మీనాపై మండిపడుతుంది. కానీ సత్యం మీనాకు మద్దతుగా నిలబడి, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడుతున్న బాధ్యతగల కోడలు ఆమెనే అని స్పష్టం చేస్తాడు.
ఇదిలా ఉండగా రోహిణి మరో కుట్రకు తెరతీస్తుంది. బాలు తాగే పాలలో నిద్రమాత్రలు కలిపి అతని ఫోన్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ప్రభావతి అనుకోకుండా అక్కడికి రావడంతో ఆమె ప్లాన్ విఫలమవుతుంది. తర్వాత మనోజ్ ఆమెను బెడ్‌రూమ్‌కు తీసుకెళ్లడంతో రోహిణి ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అవుతుంది.మరుసటి రోజు ప్రభావతి మనసులో మాత్రం మీనా నవ్వు గురించి సందేహం వెంటాడుతూనే ఉంటుంది. మరోవైపు మనోజ్ ఫర్నిచర్ షాప్‌లో కొత్త సమస్య తలెత్తుతుంది. బాలు కొట్టిన బాడీగార్డ్ చికిత్స ఖర్చు పేరుతో కొందరు వచ్చి రూ.50 వేల విలువైన ఫర్నిచర్ తీసుకెళ్తారు. దీంతో మనోజ్ బాలుతో గొడవ పడతాడు. అయితే బాలు అతని వడ్డీ వ్యాపారం రహస్యాన్ని బయటపెట్టి, రెండు నెలల రూ.50 వేల చెల్లిస్తానని హామీ పత్రం రాయిస్తాడు.
శుక్రవారం ఎపిసోడ్‌లో మీనా చెల్లి సుమతికి మంచి సంబంధం రావడంతో ఇంట్లో అందరూ ఆనందపడతారు. అయితే సుమతి మాత్రం వెంటనే పెళ్లికి అంగీకరించదు. తాను ఇంకా కొంతకాలం ఉద్యోగం చేస్తూ కుటుంబానికి సహాయం చేయాలని, ముఖ్యంగా శివకు ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి గురించి ఆలోచించనని చెబుతుంది. దీంతో ఇంట్లో కొంతసేపు చర్చ జరుగుతుంది. మీనా తన చెల్లిని ఓదార్చుతూ మంచి అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి ఒప్పిస్తుంది. బాలు సరదాగా సుమతిని ఆట పట్టించడంతో ఇంట్లో నవ్వులు వెల్లువెత్తుతాయి. తర్వాత సుమతి కూడా ఒక షరతుతో పెళ్లి చూపులకు అంగీకరిస్తుంది. అబ్బాయి నచ్చితేనే పెళ్లి చేస్తానని చెబుతుంది. కొద్దిసేపటికే పెళ్లి చూపులు జరుగుతాయి. సుమతి, అబ్బాయి ఇద్దరూ బయటకు వెళ్లి మాట్లాడుకుంటారు.
ఆమె స్వభావం, కుటుంబం చూపించిన ఆప్యాయత తనకు చాలా నచ్చాయని అబ్బాయి చెబుతాడు. సుమతి కూడా అతని మాటతీరును మెచ్చుకుంటుంది. చివరకు ఇద్దరూ పెళ్లికి అంగీకరించడంతో కుటుంబ సభ్యులందరూ ఆనందపడతారు. కట్నం అవసరం లేదని అబ్బాయి కుటుంబం చెప్పడంతో మీనా కుటుంబం మరింత సంతోషపడుతుంది. ఇక మరోవైపు రోహిణి జీవితంలో టెన్షన్ పెరుగుతుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ దినేష్ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తాడు. ఈ విషయం బయటకు రాకుండా రోహిణి అబద్ధం చెబుతుంది. సమస్యకు పరిష్కారం కోసం గుణను కలిసిన ఆమెకు, బాలు దగ్గర ఉన్న వీడియో తెచ్చితేనే సహాయం చేస్తానని అతడు షరతు పెడతాడు. మరోవైపు సుమతి పెళ్లి ఖరారవడంతో బాలు, మీనా మధ్య భావోద్వేగ సంభాషణ జరుగుతుంది. అదే సమయంలో మనోజ్‌కు ఒక పెద్ద ఇంటర్నేషనల్ డీల్ అవకాశం రావడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.


Click it and Unblock the Notifications











