Gunde Ninda Gudi Gantalu Weekly: బాలు గుట్టు రట్టు.. మీనా హ్యాపీ.. ప్రమాదంలో మౌనికా

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండి గుడిగంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 26వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

మే 26వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
సత్యం ఇంట్లో మనోజ్ జాబ్ విషయమై రచ్చ సాగుతోంది. మనోజ్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో ఎలాగైనా జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ముందు చేసిన వెయిట్ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండటంతో అందరూ ఏగతాళి చేస్తున్నారు.. కనీసం తల్లి ప్రభావతి కూడా మనోజ్ ను నమ్మబోదు. ఏమాత్రం డబ్బులు కూడా ఇవ్వడానికి ఇష్టపడదు. కానీ మనోజ్ మాత్రం ఎలాగైనా జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఓ కంపెనీలో ఉద్యోగం కోసమని మనోజ్ ఇంటర్వ్యూకు వెళ్తాడు. అయితే అక్కడ కన్సల్టెన్సీ ద్వారా విదేశాల్లో జాబ్ చేయడానికి ఉద్యోగ అవకాశం వస్తుంది. కానీ వారు 14 లక్షలు కట్టాలని డిమాండ్ చేస్తారు. దీంతో ఆ డబ్బు భారం రోహిణిపై పడుతుంది. మరోవైపు బాలు కారు అమ్మేసిన సంగతి ఇంట్లో తెలిసిపోతుంది. తన కారు అమ్మేసి ఆటో నడుపుతున్నానని అందరి ముందు ఒప్పుకుంటాడు.

Gunde Ninda Gudi Gantalu week roundup story May 26th to May 30th Episodes highlights

మే 27వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు ఆటో నడుపుతున్న విషయాన్ని రోహిణి అత్త ప్రభావతి దగ్గర చెప్పడంతో ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది. మన ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో మీకు పూర్తిగా తెలుసా అని రోహిణి ప్రభావతిని ప్రశ్నిస్తుంది. దాంతో ప్రభావతి నాకెందుకు తెలియదు అని బదులిస్తుంది. నువ్వు పార్లర్ నడుపుతున్నావ్, మనోజ్ కెనాడకు వెళ్తున్నాడు, శృతి డబ్బింగ్ చెబుతుంది, రవి రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేస్తున్నాడు. ఇక ఆ మీనాకు పూలకొట్టు ఉంది. బాలు కారు డ్రైవ్ చేస్తున్నాడు కదా అని అంటుంది. దాంతో రోహిణి స్పందిస్తూ వెంటనే బాలు ఇప్పుడు కారు డ్రైవ్ చేయడం లేదు అత్తయ్య, ఆటో నడుపుతున్నాడని నిజం చెబుతుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్న కారును అమ్మేసి, ఆ డబ్బులను ఏం చేశాడో తెలియడం లేదని రోహిణి ప్రభావతిని ఉసిగొలుపుతుంది. బాలు తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే బాలును ప్రభావతి హాలులోనే నిలదీస్తుంది. నీ కారు ఏమైపోయిందని, ఆటో ఎందుకు నడుపుతున్నావని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అందుకు బాలు తనకు వేరే సమస్యలు ఉండటంతో అమ్మేశానని అంటాడు. కానీ ఎందుకు అమ్మేశాడనే విషయం గానీ, ఆ డబ్బులు ఏం చేశాడనే విషయం మాత్రం చెప్పబోడు.

మే 28న తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో...
బాలు కార్ అమ్మేసిన సంగతి తెలిసిన రోహిణి ఇంట్లో వాళ్లందరితో చెబుతుంది. దాంతో కుటుంబ సభ్యులందరూ బాలును నిలదీస్తారు. ఎందుకు కారు అమ్మేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తారు. ఇంటి కాగితాలను తాకట్టు పెట్టి కారు కొనిస్తే నువ్వేలా నీ ఇష్టానికి అమ్మేస్తావని తల్లి ప్రభావతి అంటుంది. ఆ డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని అంటుంది. మరోవైపు మనోజ్ కూడా తమ్ముడు బాలును నిలదీస్తూ ఉంటాడు. ఆ డబ్బులను ఏం చేశావని అడుతూ ఉంటాడు. ఇక రోహిణి కూడా బాలును ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో బాలు స్పందిస్తూ తనకు ఒక సమస్య ఎదురవ్వడం వల్ల సాల్వ్ చేసుకునేందుకు కారును అమ్మేశానని చెబుతాడు. త్వరలోనే ఆ డబ్బులను తిరిగి ఇస్తానని అంటాడు. కానీ ఇంట్లో వాళ్లూ కారు అమ్మితే అమ్మేశావు కదా.. కనీసం ఎందుకు అమ్మాల్సి వచ్చిందో అసలు కారణమైన చెప్పు అని అంటారు. దానికి కూడా బాలు సమాధానం ఇవ్వబోడు. సమయం వచ్చినప్పుడు అందరికీ బదులిస్తాడనని చెబుతాడు. మరోవైపు మనోజ్ కు అప్పు ఇచ్చిన అతను ఇంటికి వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వమని గొడవ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మౌనికాకు విడాకులు ఇచ్చేందుకు భర్త సంజూ వ్యూహాలు రచిస్తాడు. మౌనికాను టార్చర్ పెడుతూ ఉంటాడు.

మే 29వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు కారు అమ్మడానికి కారణం గుణ అని మీనాకు తెలుస్తుంది. అందుకే గుణకు వార్నింగ్ ఇస్తుంది. ఆ విషయాన్ని మీనా బాలుతోనూ చెబుతంది. వాడు నిన్ను కాళ్లు మొక్కాలనడంతోనే మీరు కారు అమ్మిన విషయం నాకు తెలిసిపోయిందని మీనా చెబుతుంది. అంతే కాదు గుణ ఆఫీస్ కు వెళ్లి వార్నింగ్ కూడా ఇచ్చేశానని అంటుంది. ఒక్క దానివే వాడి ఆఫీస్ కు ఎందుకు వెళ్లావని, వాడసలే రౌడీ అనే విషయం నీకు తెలుసు కదా అని అంటాడు. వాడికి బాలుకు మధ్య ఉన్న గొడవలో మీనాను దూరొద్దని సూచిస్తాడు బాలు. మరోవైపు బాలు చెల్లె మౌనికాను సంజూ నానా తిప్పలు పెడుతూ ఉంటాడు. కావాలని టార్చర్ పెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇప్పటికే ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంజూ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మౌనికాపై నిందలు వేసే ప్రయత్నం చేస్తాడు. తన స్నేహితులను పిలిచి ఇంట్లోనే మందు తాగుతాడు. మౌనికాతో అన్ని రకాల మాంసం వంటకాలు వండమని చెబుతాడు. డ్రైవర్ తో లింకేస్తూ అవమానిస్తాడు. దీంతో మౌనికా ఇంట్లో నుంచి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోతుంది.

మే 30వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మౌనికా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో సంజూ, వాళ్ల నాన్న ఎంతగానో భయపడుతారు. ఒకవేళ మౌనికా వాళ్ల పేర్లు రాసి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తమపైనే కేసులు నమోదు అవుతాయని అంటాడు. దాంతో వెంటనే మౌనికా ఎక్కడ ఉందో వెతకాలని సంజూ తండ్రి అనడంతో వీధుల్లో తిరిగి వెతుకుతాడు. ఇదే సమయంలో బాలు సంజూను గమనిస్తాడు. మౌనికా ఇంట్లో లేకపోవడం వల్లే సంజూ రోడ్లపై తిరుగుతూ వెతుకుతున్నాడని తెలుసుకుంటాడు. వెంటనే సంజూ వాళ్ల ఇంటికి వెళ్లి తన చెల్లి మౌనికాకు ఏమైందని అడుగుతాడు. ఎవ్వరూ సమాధానం చెప్పకపోవడంతో సంజూ గొంతుపై కత్తిపెట్టి మరీ బెదిరిస్తాడు. అదే సమయంలో మౌనికా ఇంటికి తిరిగి వస్తుంది. ఇక మరోవైపు మీనాకు బాలు స్నేహితుడి ద్వారా 500 పూల దండాల ఆర్డర్ రావడంతో సంతోషిస్తుంది. ఆ పనిలో నిమగ్నమైపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలా ఈ వారంలో బాలు గుట్టు రట్టు కావడంతో పాటు చెల్లి మౌనికా కష్టాలను చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X