Gunde Ninda Gudi Gantalu Weekly: సుశీలమ్మ పుట్టినరోజు.. బామ్మ చివరి కోరిక తీర్చిన బాలు.. ప్రభావతి పన్నాగాలు
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండెనిండా గుడి గంటలు సీరియల్ కు ఉన్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే నవంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం (నవంబర్ 10వ తేదీ) ఎపిసోడ్‌లో ప్రభావతి, మీనాక్షి మధ్య సరదా డీల్ జరుగుతుంది. పాత టీవీ ఇస్తే రిటర్న్ గిఫ్ట్‌లో సగం వాటా ఇస్తానని ప్రభావతి చెప్పగా, మీనాక్షి సరదాగా అంగీకరిస్తుంది. మరోవైపు మీనా, బామ్మ సుశీలమ్మ 75వ పుట్టినరోజు వేడుకలను వీడియోగా రికార్డ్ చేసి ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని భావిస్తుంది. మొదట సుశీలమ్మ "నేనేమైనా సెలబ్రిటినా?" అని అడిగినా, తర్వాత మనవరాలిపై ప్రేమతో ఓకే అంటుంది. ఈ క్రమంలో ప్రభావతి జోక్యం చేసుకోగా, సుశీలమ్మ "నువ్వు దేవసేన అనుకుంటున్నావా?" అంటూ పంచ్ వేస్తుంది.

తరువాత మీనా, బామ్మను డాబాపైకి తీసుకెళ్లి, తమ కష్టాలను చూపిస్తుంది. ఒక్కో ఇటుకతో ఇల్లు కడుతున్నామని చెప్పడంతో సుశీలమ్మ కదిలిపోతుంది. సహాయం చేస్తానని చెప్పినా, మీనా తమ కష్టమే గౌరవమని చెబుతుంది. సుశీలమ్మ తన బాల్య స్నేహితులను గుర్తుచేసుకుంటూ వారిని కలవాలని చివరి కోరిక చెబుతుంది. ఇక బాలు ఇంటికి రాకపోవడంతో సత్యం ఆందోళన చెందుతాడు. ప్రభావతి అతను తాగి ఉంటాడని వ్యంగ్యంగా మాట్లాడగా, సత్యం కోపపడతాడు. వాస్తవానికి బాలు బామ్మ స్నేహితులను వెతుకుతున్నాడని తెలియదు. ఈ క్రమంలో రవి, శృతి మౌనికను బామ్మ బర్త్‌డేకు ఆహ్వానిస్తారు. మొదట సంకోచించిన మౌనిక, అత్తయ్య అనుమతితో చివరికి రావడానికి సిద్ధమవుతుంది.
మంగళవారం(నవంబర్ 11వ తేదీ)ఎపిసోడ్‌లో మౌనికను రవి, శృతి కలిసి ఇంటికి రమ్మని అడగడంతో, అత్తయ్య ప్రోత్సాహంతో ఆమె సంతోషంగా వెళ్తుంది. బామ్మ 75వ పుట్టినరోజు వేడుకలు ఉత్సాహంగా సాగుతాయి. ఈ వేడుకల్లో మీనా, బాలు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి, సుశీలమ్మ మధ్య మాటతీరు ఘర్షణకు దారి తీస్తుంది. ప్రభావతి బాలు ప్రవర్తనకు బామ్మనే కారణమని నిందిస్తే, సుశీలమ్మ ఆవేదనతో ఎమోషనల్ అవుతుంది. మీనా మధ్యలో జోక్యం చేసుకోవడంతో ప్రభావతి ఆమెపై కోపం చూపిస్తుంది. అదే సమయంలో రవి, శృతి మౌనికను తీసుకొచ్చి ఇంట్లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తారు.
మౌనికను ఎవరూ పిలవలేదని తెలుసుకున్న సత్యం ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇక రోహిణి బామ్మకు మేకప్ చేస్తూ, ఆమె కుటుంబంపై సుశీలమ్మ ఆరా తీస్తుంది. మేకప్ తర్వాత బామ్మ అందంగా తయారవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. మౌనిక, శృతి, రవి ఆమెను ఆటపట్టిస్తూ నవ్వులు పూయిస్తారు. సత్యం పూజలు నిర్వహించి బామ్మకు పట్టుచీర కానుక ఇస్తాడు. ఈ సన్నివేశం చూసి ప్రభావతి అసహనం చెందుతుంది. వేడుకలు ఉత్సాహంగా సాగుతాయి కానీ బాలు లేని లోటు అందరినీ బాధిస్తుంది. చివర్లో సుశీలమ్మ మీనాను నిలదీస్తూ - "బాలు ఎక్కడ? నాకు తెలుసుకోవాలి " అని భావోద్వేగంతో ప్రశ్నిస్తుంది.
బుధవారం (నవంబర్ 12వ తేదీ) ఎపిసోడ్‌లో బామ్మ సుశీలమ్మ పుట్టినరోజు వేడుకలు ఆనందంగా కొనసాగుతున్నాయి. కానీ, బాలు లేని వెలితి అందరినీ కలచివేస్తోంది. దీంతో సుశీలమ్మ మీనాను ప్రశ్నిస్తే, "ఏం లేదు బామ్మ, బాలు మీ మీద ప్రేమ తగ్గలేదు" అంటూ సమాధానమిస్తుంది. మీనా ను రెడీ అవ్వమని సుశీలమ్మ చెబుతుంది. అయితే, ఈలోగా ప్రభావతి వంట చేసేది ఎవరు అని తగువేస్తుంది. దీనికి సుశీలమ్మ గట్టిగా సమాధానం ఇస్తూ.. "నువ్వు కూడా ఆడదానివే కదా? నీకు వంట రాదా?" అంటూ వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు మీనాను నగలు వేసుకుని రామ్మనడంతో ప్రభావతి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. నకిలీ నగల విషయం బయటపడుతుందేమో అని భయపడుతుంది. ఇక మరోవైపు మౌనిక తన అత్తయ్య సువర్ణకు ఫోన్ చేసి పరిస్థితి అడుగుతుంది. అప్పుడు సంజు వచ్చి మౌనిక గురించి అడగడంతో సువర్ణ అబద్ధం చెబుతుంది.
కానీ సంజు అనుమానం చెంది, మౌనికకు ఫోన్ చేస్తాడు. అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో సంజు అనుమానం మరింత పెరుగుతుంది. ఇదిలా ఉంటే మీనాక్షి టీవీ గిఫ్ట్ తీసుకురావడంతో ఇంట్లో మరో డ్రామా మొదలవుతుంది. ప్రభావతి అది తానే కొన్నట్లు చెప్పడంతో అందరికీ అనుమానం కలుగుతుంది. ఈ సమయంలో మీనా నగలు ధరించి కిందికి వస్తుంది. సుశీలమ్మ ఆనందపడుతుంది. ఇంతలో సుమతి, పార్వతి రావడంతో ప్రభావతి వారిని అవమానిస్తుంది. దీనికి సుమతి కౌంటర్ ఇస్తూ అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. సుశీలమ్మ సుమతిని ప్రశంసిస్తూ, "ఆడపిల్ల జాబ్ చేసుకోవాలి, కానీ సరైన సమయంలో పెళ్లి జరగాలి" అంటుంది. పార్వతి కూడా అంగీకరిస్తుంది. వేడుకల్లో ఆనందం, టెన్షన్, అనుమానాలు ఇలా అన్నీ కలగలిసి ఒక సీరియస్ మలుపు తీసుకుంటాయి.
గురువారం (నవంబర్ 13వ తేదీ) ఎపిసోడ్‌లో సుశీలమ్మ సుమతి పెళ్లి గురించి మంచి మాట మాట్లాడుతుంటే, ప్రభావతి మాత్రం "సుమతి పెళ్లి చేయాలంటే ఎవరో ఒకరు చావాలి" అంటూ అసహ్యకరమైన వ్యాఖ్య చేస్తుంది. దీంతో ఇంట్లో వారంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సత్యం, శృతి, మీనా, బామ్మ వరుసగా ఆమెను నిందిస్తారు. దీంతో ఇంట్లో వాతావరణం వేడెక్కింది. ఇలాంటి సమయంలో శోభ హౌస్‌లోకి ప్రవేశించి "మిడిల్ క్లాస్ ఇళ్లలో కూడా బర్త్‌డే ఫంక్షన్ చేస్తారా?" అంటూ హేళనగా మాట్లాడటంతో మరోసారి గొడవ రాజుకుంది. మీనాక్షి, సుశీలమ్మ ఆమె మాటలకు కూడా తగిన కౌంటర్లు ఇస్తూ సీనును హైలైట్ చేశారు. సుమతి-రవి సరదాగా గొడవ పడుతున్నప్పుడు ప్రభావతి మరోసారి నోరు జారింది.
అయితే శృతి ఆ విషయాన్ని పాజిటివ్‌గా మలుస్తూ రవిని సుమతితో కొట్టిస్తుంది. దీంతో మరోసారి ఇంట్లో నవ్వుల పువ్వులు పూశాయి. శృతి చేతలకు సత్యం కూడా ఇంప్రెస్ అయి "వయసులో చిన్నదైనా మనసు పెద్దది" అని ప్రశంసించాడు. శోభ మాత్రం మీనా బంగారం నకిలీ అని ప్రస్తావిస్తూ కొత్త గొడవకు తెరలేపడానికి ప్రయత్నించగా, శృతి ఘాటుగా హెచ్చరిస్తూ "ఇక మీదట నా ఇంటికి రాకు" అని బయటకు పంపించింది. మరోవైపు సంజీవ్ మౌనికపై అనుమానంతో తల్లి సువర్ణతో తగువాడి కోపంతో బయటకు వెళ్లిపోతాడు. కేక్ కటింగ్ సమయంలో కూడా బాలు రాకపోవడంతో బామ్మ అతనిని ఎదురు చూడాలని చెబుతుంది. ప్రభావతి, మనోజ్ అతడిని అవమానించేలా మాట్లాడుతుండగా, మీనా వారిని నిలదీసింది.
శుక్రవారం (నవంబర్ 14వ తేదీ)ఎపిసోడ్‌లో సుశీలమ్మ 75వ పుట్టినరోజు వేడుకలు ఆనందంగా సాగుతుండగా, బాలు కనిపించకపోవడంతో ఇంట్లో టెన్షన్ మొదలవుతుంది. బాలు రాకపోతే కేక్ కట్ చేయనని బామ్మ పట్టుదలగా చెబుతుంది. మనోజ్, ప్రభావతి బాలుపై సెటైర్లు వేస్తూ అవమానించే ప్రయత్నం చేస్తారు. అయితే మీనా తన భర్తను సమర్థించగా, సుశీలమ్మ కూడా మీనాను మెచ్చుకుంటుంది. గిఫ్టులు అందించిన తరువాత చివరకు బాలు ఎంట్రీ ఇస్తాడు. "నీ కోసం తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్" అంటూ బామ్మ కళ్లుమూయమని చెబుతాడు.
సుశీలమ్మ కళ్లుతెరిస్తే, ఆమె చిన్ననాటి స్నేహితులు సబ్బులు, రాజీ, సత్య ఒక్కొక్కరిగా వస్తారు. వారిని చూసి బామ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీనా పంపిన వీడియోలోని 'చివరి కోరిక' నెరవేర్చడానికే ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశానని బాలు చెబుతాడు. బాల్యం జ్ఞాపకాలు, పాత పాటలు, నవ్వులు ఇంటిని నింపేస్తాయి. అదే సమయంలో సత్యవతి మరో పెద్ద సర్ప్రైజ్ ఇస్తూ సుశీలమ్మ వన్‌సైడ్ లవర్ గోపాలాన్ని కూడా తీసుకొస్తుంది. గోపాలం ఎంట్రీతో బామ్మ సిగ్గుతో నవ్వుతుంది. ఈ సరదా మధ్య ఆమె పాత ప్రేమకథను అందరితో పంచుకుంటుంది. చివరకు బాలు చేసిన సర్ప్రైజ్‌కు కృతజ్ఞతగా, "నా నిజమైన గిఫ్ట్ నువ్వే బాలు" అంటూ ప్రత్యేక రిటర్న్ గిఫ్ట్‌ను అతనికే ఇస్తుంది.


Click it and Unblock the Notifications











