Gunde Ninda Gudi Gantalu Weekly: బామ్మ రిటర్న్ గిప్ట్.. మీనాపై ప్రభావతి నిందా.. బాలు అరెస్ట్.. మనోజ్ బాగోతం ?
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండెనిండా గుడి గంటలు సీరియల్ కు ఉన్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం (నవంబర్ 17వ తేదీ) ఎపిసోడ్ పూర్తిగా సుశీలమ్మ 75వ పుట్టినరోజు వేడుకలతో హంగామాగా సాగింది. బాలు ప్రత్యేకంగా ప్లాన్ చేసి, ఆమె చిన్ననాటి స్నేహితులందరిని ఒకచోటుకు చేర్చి గ్రాండ్ సర్ప్రైజ్ ఇస్తాడు. తన బాల్యం జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు తిరగడంతో సుశీలమ్మ భావోద్వేగానికి లోనవుతుంది. ఈ వేడుకలో సుశీలమ్మ స్నేహితురాలు సత్యవతి భర్త గోపాలం కూడా హాజరవుతాడు. అతను ఒకప్పుడు సుశీలమ్మపై వన్‌సైడ్ లవ్ పెట్టుకున్నాడని వెల్లడించడంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. వారి లవ్ స్టోరీ చెప్పమని శృతి అడగగా, గోపాలం సుశీలకు రాసిన ప్రేమలేఖ తప్పుగా సత్యవతికి చేరి ఆమెతోనే పెళ్లి అయ్యిందని చెబుతాడు.

ఈ విషయం పెళ్లి రాత్రే తెలిసి "శోభనం పదేళ్లు జరగలేదు" అంటూ సత్యవతి నవ్వు తెప్పిస్తుంది. కేక్ కటింగ్ సమయంలో సుశీలమ్మ తన కోడలు ప్రభావతిని కౌగిలించుకుని ప్రశంసించడం అందరినీ ఆకట్టుకుంటుంది. తర్వాత ఆమె గోపాలంకు స్వయంగా కేక్ తినిపించడం కుటుంబ సభ్యులను ఆశ్చర్యంలో ముంచుతుంది. చివర్లో బాలు ఇచ్చిన సర్ప్రైజ్ తన జీవితంలో డబ్బుతో కొనలేని వజ్రం వంటిదని, చిన్ననాటి స్నేహాన్ని తిరిగి ఇచ్చాడని చెప్పి, తన వారసత్వ బంగారు గొలుసును బాలకు గిఫ్ట్‌గా ఇస్తుంది. ఈ సంఘటనతో ప్రభావతి, మనోజ్ షాక్ అవుతారు.
మంగళవారం (నవంబర్ 18వ తేదీ) ఎపిసోడ్‌లో సుశీలమ్మ పుట్టినరోజు వేడుక లో బాలు-మీనా ప్రేమతో చేసిన సర్ప్రైజ్‌కు కృతజ్ఞతగా సుశీలమ్మ తరతరాలుగా వస్తున్న విలువైన బంగారు ఆభరణాన్ని కానుకగా ఇస్తుంది. ఆ గౌరవం చూసి మీనా ఆనందంతో మురిసిపోతుంది. అయితే బాలు మాత్రం కొంత దిగులుగా కనిపిస్తాడు, ఎందుకంటే ఇటీవల జరిగిన ఆభరణాల నకిలీ ఘటన అతని మనసును కదిలిస్తుంది. బామ్మను బస్టాంప్ వద్ద డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే బాలు ఇంటి తలుపులు మూసి, ఇక నిజం దాచుకోలేనని ప్రకటిస్తాడు. మనోజ్, రోహిణిని బయటకు వెళ్లకుండా ఆపి, మీనా చేతిలో ఉన్న ఆభరణాలను అందరి ముందు పెడుతాడు.
ఆ ఆభరణాలు టేబుల్‌పై పడగానే ప్రభావతి, మనోజ్ గట్టిగా షాక్ అవుతారు."బామ్మకు గొలుసు కొనాలనుకుని మీనా ఆభరణాలు తీసుకెళ్లాం... షాప్‌లో ఇవన్నీ నకిలీ అని చెప్పారు!" అని బాలు నిజం బయటపెడతాడు. దీంతో ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తమవుతుంది. ప్రభావతి వెంటనే మీనా మీద తప్పు నెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే మీనా "నా పుట్టింటి మీద నిందలు వేయొద్దు" అంటూ హెచ్చరిస్తుంది. బాలు కూడా "బామ్మ కోసం చాలా ఓపిక పట్టా... ఇక నిజం బయటపడాల్సిందే" అని హెచ్చరిస్తాడు. తర్వాత బాలు-మీనా కలిసి రవి, శృతి దగ్గరకు వెళ్లి అసలు నేరస్తులను బయటపెట్టేందుకు ప్లాన్ రూపొందిస్తారు.
బుధవారం (నవంబర్ 19వ తేదీ)ఎపిసోడ్‌లో కవరింగ్ నగల వివాదం మరింత ముదిరి ఇంట్లో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నకిలీ నగలను మీనానే మార్చి ఉండొచ్చని ప్రభావతి సూచించడంతో మీనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రభావతి తన తప్పును ఒప్పుకోకపోగా, విషయాన్ని సుశీలమ్మ పైకి మళ్లించే ప్రయత్నం చేయడంతో సత్యం కూడా చిరాగ్గా స్పందిస్తాడు. ఈ టెన్షన్ నడుమ బాలు రెండు రోజుల్లో అసలు నిజాన్ని బయటపెడతానంటూ ఒట్టు పెట్టి వెళ్లిపోవడంతో ఇంటి వాతావరణం మరింత హైప్ అవుతుంది. ఇక మనోజ్-ప్రభావతి మధ్య భగ్గుమనే వాగ్వాదం జరుగుతుంది. ప్రభావతి "నీ వల్లనే సమస్యలు వస్తున్నాయి" అంటూ ఎమోషనల్ అవుతుంది.
మరోవైపు మీనా కోపంతో ఉడికిపోగా, బాలు ఆమెను శాంతింపజేస్తూ " నగలను మనోజ్, అమ్మ నే తీశారు" అని చెబుతాడు. అయితే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పడంతో మీనా మరింత అసహనం వ్యక్తం చేస్తుంది. ఇదంతా జరుగుతుండగా, నిజం బయటపడాల్సిందే అని నిర్ణయించిన బాలు-మీనా, శృతి, రవితో కలిసి నకిలీ నగల షాప్ నుండి ఫోన్ చేసినట్లు నటిస్తూ మనోజ్ నోట నిజం చెప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఇదిలా ఉండగా షాప్‌లో మనోజ్ అనుమానాస్పదంగా ప్రవర్తించగా రోహిణి కూడా అటెన్షన్‌లో పడుతుంది. ఇదే సమయంలో రోహిణికి చింటూ నుంచి ఫోన్ కాల్ రావడం మరింత ఉత్కంఠగా మారింది.
గురువారం (నవంబర్ 20వ తేదీ)ఎపిసోడ్‌లో కూడా కవరింగ్ నగల వివాదంపై తిరుగుతూ మరిన్ని కొత్త ట్విస్టులు, టెన్షన్ సన్నివేశాలతో సాగింది. రోహిణి-సుగుణమ్మ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో చింటూపై సుగుణమ్మకు ఉన్న మమకారం, రోహిణి నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడుతుంది. ఇదిలా ఉండగా బాలు వేసిన ప్రణాళిక అమల్లోకి వస్తుంది. శృతి కవరింగ్ నగల షాప్ నుండి కాల్ చేసినట్టు నటించి మనోజ్‌ను టెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే.. గతంలో జరిగిన మోసాలు గుర్తుకు వచ్చి మనోజ్ వెనుదిరుగుతాడు. అయితే అతని మాట తీరు బాలు-మీనా అనుమానాలను మరింత బలపరుస్తుంది. ఈ విషయాన్ని మనోజ్ తన తల్లి ప్రభావతికి కాల్ చెబుతాడు. అసలు విషయం గ్రహించిన ప్రభావతి వెంటనే అతనిపై రెచ్చిపోయి, ఎట్టి పరిస్థితుల్లోనైనా నగలు తీసుకురమ్మని ఆదేశిస్తుంది.
"లేట్ అయితే ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది" అంటూ భయపెట్టడంతో మనోజ్ మరింత కలవరపడుతాడు. రోహిణికి విషయం తెలిసిపోతుందేమో అన్న భయం అతన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఇక బాలు-మీనా తదుపరి ప్లాన్ కోసం మీనాక్షి ఇంటికి చేరుతారు. పండ్లు ఇచ్చి, సెంటిమెంట్‌తో అసలు విషయం బయటపెట్టాలని ప్రయత్నిస్తారు. మీనాక్షి మాటల్లో తడబాటు కనిపించడంతో బాలు ఆమెకు అన్నీ తెలిసే ఉంటుందని భావిస్తాడు. కానీ నిజం బయటకొచ్చే సమయంలోనే ప్రభావతి అక్కడికి చేరి ప్లాన్‌ను పాడు చేస్తుంది. "ఒక నిమిషం ఆలస్యమైనా నిజం బయటపడేది" అని మీనాక్షి చెప్పడంతో ప్రభావతి భయంతో గుండె దడపడుతుంది. ప్లాన్ ఫ్లాప్ కావడంతో బాలు-మీనా నిరాశ చెందుతారు. అదే సమయంలో బాలు ఫ్రెండ్ రాజేష్ మెగా సెల్ ఆఫర్ గురించి చెప్పడంతో బాలు షాపింగ్‌కు వెళ్లాడు.
శుక్రవారం (నవంబర్ 21 వ తేదీ) ఎపిసోడ్‌లో బాలు-రాజేష్ కలిసి ఫర్నిచర్ షాప్‌కి వెళ్లడంతో కథ ఆసక్తికర మలుపు తిరిగింది. షాప్‌లో ప్రతి వస్తువుపై 50% ఆఫర్ కనిపించి ఆశ్చర్యపడిన వీరిద్దరూ, రాజేష్ ఒక బీరువా కూడా కొనేస్తాడు. ఇంతలో పోలీసులు అక్కడికి దూసుకువచ్చి, "ఇది దొంగ మాల్... ఇతర షాపుల నుంచి దొంగిలించిన వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు. ఎవరూ కదలొద్దు!" అంటూ వార్నింగ్ ఇచ్చేస్తారు. ఏ తప్పూ చేయలేదని చెప్పిన బాలు-రాజేష్‌లను పోలీసులు నమ్మకుండా అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్తారు. ఈ కేసుపై స్టేషన్‌లో విచారణ జరుగుతుండగా మనోజ్ కూడా అక్కడికి రావడం బాలను షాక్‌కు గురిచేస్తుంది. మాట్లాడే తీరు చూసి మనోజ్ కూడా మోసపోయాడని గ్రహిస్తాడు. అయితే.. మనోజ్ తన అమ్మిన ఫర్నిచర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తూ పోలీసులకు వివరాలు చెబుతాడు.
ఈ మొత్తం విషయాన్ని బాలు సెల్‌లో కూర్చొని తన ఫోన్‌లో రికార్డ్ చేస్తాడు. తరువాత విచారణ పూర్తి కావడంతో బాలు-రాజేష్‌లను పోలీసులు విడుదల చేస్తారు. ఇంటికి వచ్చిన బాలు డోర్ లాక్ చేయడం అందరికి అనుమానంగా అనిపిస్తుంది. " ఓ సినిమా ట్రైలర్ చూపించాలి" అంటూ నటిస్తూ అందరిని హాల్‌లోకి రప్పిస్తాడు. ఈ సమయంలో బాలు పోలీస్ స్టేషన్‌లో మనోజ్ చేసిన వాఖ్యల వీడియోను ప్లే చేస్తాడు. దీంతో సత్యం కోపంతో మనోజ్‌కు చెంపదెబ్బ కొట్టి మందలిస్తాడు. ప్రభావతి మాత్రం అసలు నకిలీ నగల విషయం బయట పడకుండా "నాలుగు లక్షలు అప్పు చేశావా?" అంటూ విషయాన్ని మళ్లిస్తుంది. రోహిణి సపోర్ట్ చేయడానికే ప్రయత్నించినా ఆగిపోవాల్సి వస్తుంది. ప్రభావతి ఈ డ్రామాతో తాత్కాలికంగా ప్రమాదం తప్పించుకున్నా, బాలు మాత్రం నిజం బయటపడే వరకు ఆగడని స్పష్టం చేస్తాడు.


Click it and Unblock the Notifications











