Gunde Ninda Gudi Gantalu Weekly: ప్రభావతి కుట్ర.. మనోజ్ అబద్ధం.. బాలు ఆగ్రహం.. నిజం కోసం మీనా పోరాటం..
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండెనిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండెనిండా గుడి గంటలు సీరియల్ కు ఉన్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం (నవంబర్ 3వ తేదీ ) ఎపిసోడ్‌లో కిచెన్‌లో మీనా చేపల కూర వండుతుంటే ఆ వాసనతో బాలు ఆగలేక నేరుగా కిచెన్‌లోకి దూసుకెళ్తాడు. కుటుంబం అంతా భోజనానికి సిద్ధమవుతారు, కానీ ప్రభావతి మాత్రం పెద్ద కొడుకు మనోజ్ కోసం వేచి ఉంటుంది. కొద్దిసేపటికి మనోజ్ కంగారుగా ఇంటికొస్తాడు. నగలు అమ్మిన విషయాన్ని దాచిపెట్టి "అన్నీ సేఫ్‌గానే ఉన్నాయి అమ్మా" అని అబద్ధం చెబుతాడు. వీరిద్దరి సంభాషణను మీనా గమనిస్తుంది. ఇదే సమయంలో బాలు కోపంతో "లక్షలు మింగినోడా?" అంటూ అరుస్తాడు. దీంతో మనోజ్, ప్రభావతి కంగారుపడుతారు. సత్యం, మీనా, రవి ప్రశ్నించగా ప్రభావతి ఆ టాపిక్ ను దాటవేస్తుంది. ఇంతలో రోహిణి సంతోషంగా "మనోజ్ బిజినెస్‌లో లక్ష లాభం తెచ్చాడు!" అంటూ డబ్బులు చూపిస్తుంది.

బాలు, మీనా వ్యంగ్యంగా స్పందించగా, సత్యం కూడా " నిజంగా మనోజ్ లక్ష సంపాదించాడా? " అని ప్రశ్నిస్తాడు. ప్రభావతి మౌనం పాటిస్తుంది. రోహిణి అహంకారంగా "ఇది ప్రారంభం మాత్రమే" అంటూ 50,000 రూపాయలు తీసి "ఇది మీకోసం అత్తయ్య" అని ప్రభావతికి ఇస్తుంది. అవమానంతో ప్రభావతి ఏం మాట్లాడలేకపోతుంది. తర్వాత బయటకు తీసుకెళ్లి మనోజ్‌ను "ఇది నీ డబ్బు కాదు, మీనా అమ్మిన నగల డబ్బు" అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. మనోజ్ తలదించుకుంటాడు. మరుసటి రోజు ఉదయం కాఫీ విషయంలో బాలు, ప్రభావతి మధ్య తగాదా జరుగుతుంది. అప్పుడు సుశీలమ్మ ఫోన్ చేసి "నా 75వ పుట్టినరోజు మీ అందరితో జరుపుకోవాలి" అని చెబుతుంది. మీనా సంతోషంగా అంగీకరిస్తే ప్రభావతి మాత్రం మనసులో భయంతో "అత్తయ్య వస్తే నా రహస్యం బహిర్గతమవుతుందేమో" అని భయపడుతుంది.
మంగళవారం (నవంబర్ 4వ తేదీ) ఎపిసోడ్‌లో బాలు తన నాన్నమ్మ సుశీల పుట్టినరోజును గుర్తుండిపోయేలా చేయాలని నిర్ణయిస్తాడు. గోల్డ్ చైన్ బహుమతిగా ఇవ్వాలని భావిస్తాడు కానీ డబ్బుల కోసం ప్రయత్నించి విఫలమవుతాడు. అప్పుడు మీనా తన నగలను తాకట్టుపెట్టమని సూచిస్తుంది. అయితే ఆ నగలు ప్రభావతి దగ్గర ఉండటంతో బాలు తన తండ్రి సత్యం ద్వారా ఆ నగలను తీసుకురావాలనుకుంటాడు. కానీ, ఈ విషయం మనోజ్ దొంగ చాటున వెంటాడు. అతను వెంటనే ప్రభావతికి చెబుతాడు. ప్రభావతికి షాక్ అవుతుంది ఎందుకంటే ఆ నగలను మనోజ్ ఇప్పటికే అమ్మేశాడు. తాకట్టు పెట్టమన్నప్పుడు అమ్మేస్తే నాలుగు లక్షలు వస్తాయని చెప్పి ఆ నగలను అమ్మేశానని మనోజ్ నిజం చెబుతాడు.
ప్రభావతి ఆగ్రహంతో మనోజ్‌ను తిడుతుంది. కానీ, వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది. మనోజ్ దగ్గర ఉన్న నగల ఫోటో ఆధారంగా కవరింగ్ నగలు చేయించి అసలు నగల స్థానంలో పెట్టాలని నిర్ణయిస్తుంది. వీరి కుట్రకు మీనాక్షి సాక్షిగా ఉండి "ఒకరోజు వీరి బాగోతం బయటపడుతుంది" అని మనసులో అనుకుంటుంది. మరోవైపు భోజనం సమయంలో బాలు తన ప్లేట్‌లో వెంట్రుక కనిపించడంతో "ఇంటికి కష్టాలు వస్తున్నాయేమో" అని అనుమానం వ్యక్తం చేస్తాడు. అదే సమయంలో మనోజ్, ప్రభావతి నకిలీ నగలతో ఇంటికి చేరుతారు. ఇలా వారి చేతలు కొత్త సమస్యలకు దారి తీస్తాయి.
బుధవారం (నవంబర్ 5వ తేదీ) ఎపిసోడ్‌లో కథ ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రభావతి, మనోజ్ ఇద్దరూ కలిసి ఇంటికి రావడంతో సత్యం అనుమానంతో "మీనా బంగారం ఎక్కడ?" అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నతో ప్రభావతి గందరగోళానికి గురవుతుంది. మీనా కూడా సూటిగా "నా నగలు ఇవ్వండి" అని అడగడంతో మనోజ్ మాటల్లో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు. అయితే శృతి అతన్ని నిలదీయడంతో వాదన తలెత్తి వాతావరణం వేడెక్కుతుంది. చివరికి ప్రభావతి మోసం దాచిపెడుతూ నగలు తీసుకువచ్చి మీనాకు ఇస్తుంది. కానీ లోపల భయంతో తల్లడిల్లుతుంది. బాలు, మీనా ఆ నగలను తీసుకుని జ్యువెలరీ షాప్‌కి వెళ్తారు. అక్కడ అవి నకిలీవని తెలిసి ఇద్దరూ షాక్ అవుతారు.
షాప్ ఓనర్ సీసీ ఫుటేజ్ చూపిస్తానని చెప్పినా, మీనా బామ్మ పుట్టినరోజు వేడుకలను దృష్టిలో పెట్టుకుని పోలీసులకు చెప్పకుండా వదిలేస్తుంది. అయితే బాలు తీవ్రంగా ఆగ్రహించి మనోజ్, ప్రభావతి పైన అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ మీనా గొడవ వద్దని బాలుతో ఒట్టు వేయిస్తుంది. ఇక ఇంట్లో సుశీలమ్మ పుట్టినరోజు వేడుకలు మొదలవుతాయి. కుటుంబ సభ్యులు ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నా, ప్రభావతి, మనోజ్ మాత్రం టెన్షన్‌లో మునిగిపోతారు. ఇక బాలు, మీనా ప్రవేశించగానే ప్రభావతి గుండెల్లో దడ మొదలవుతుంది. బాలు నిజం బయటపెడతాడా? ప్రభావతి బాగోతం బయటపడుతుందా? అన్నది ఆసక్తిగా మారింది.
గురువారం (నవంబర్ 6వ తేదీ) ఎపిసోడ్‌లో బాలు, మీనా కోపంగా ఇంటికి చేరుతారు. బంగారం విషయం గురించి గొడవ వద్దని మీనా చెప్పడంతో బాలు సైలెంట్‌గా ఉంటాడు. కానీ ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రభావతి మీనాపై ఆగ్రహంతో అరిచేస్తుంది. మీనా కూడా ఆవేశంగా కౌంటర్ ఇస్తూ తన మనసులోని బాధను బయటపెడుతుంది. బాలు తన కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ ఇన్‌డైరెక్ట్‌గా ప్రభావతి ముందు తన అసహనాన్ని చూపిస్తాడు. ఈ గొడవలో ప్రభావతి, మనోజ్ తమ రహస్యం బయటపడుతుందేమోనని టెన్షన్ పడతారు. ఇదిలా ఉండగా, రోహిణి తన కొడుకుతో మాట్లాడుతుండగా మనోజ్ విని అనుమానం పెంచుకుంటాడు. కానీ రోహిణి చాకచక్యంగా తన మాటలతో ఆ పరిస్థితిని సర్దుకుంటుంది.
ఇక మీనా తన తల్లిని సుశీలమ్మ పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తుంది. బాలు, మీనా ఇద్దరూ కలిసి బామ్మకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయిస్తారు. మరుసటి రోజు సుశీలమ్మ ఇంటికి రాగానే అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. బాలు ముఖం చూసి ఏదో దాచిపెడుతున్నాడని సుశీలమ్మ గ్రహిస్తుంది. వేడుకల్లో ప్రభావతి, మీనాను విస్మరించి హారతి ఇవ్వమని ఇతరులను పిలవడం సుశీలమ్మకు నచ్చదు. కానీ మీనా మౌనంగా ఉంటుంది. చివర్లో మీనా ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి సుశీలమ్మ ఎమోషనల్ అవుతుంది. "ఇదే నాకు గొప్ప బహుమతి" అంటూ మీనాను కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేస్తుంది.
శుక్రవారం (నవంబర్ 7వ తేదీ)ఎపిసోడ్‌లో సుశీలమ్మ 75వ పుట్టినరోజు వేడుకలతో ఇల్లు ఆనందంతో నిండిపోతున్నాయి. కుటుంబ సభ్యులందరూ ఆమెకు సర్ప్రైజ్ వేడుకలు ఏర్పాటు చేస్తారు. సుశీలమ్మ సంతోషంగా "ఇంత ప్రేమగా చూసుకున్నందుకు థాంక్స్" అంటూ అందరినీ ఆశీర్వదిస్తుంది. ఈ సమయంలో శృతి చిలిపిగా "బామ్మ, మీ అందానికి రహస్యం ఏమిటి?" అని అడగగా, సుశీలమ్మ నవ్వుతూ "సంతోషంగా ఉండడం, నా పనులు నేనే చేసుకోవడం" అంటుంది. వెంటనే బాలు "మా మీనా ఎప్పటికీ ముసలిద్ది కాదు" అంటూ ఫన్నీ పంచ్ వేస్తాడు. ఇంతలో సుశీలమ్మ "నా మనసుకి నచ్చిన గిఫ్ట్ ఇచ్చేవారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను" అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపడతారు.
ప్రభావతి వెంటనే సత్యం వద్దకు వెళ్లి "ఏం గిఫ్ట్ ఇవ్వాలి?" అని అడగగా, సత్యం "ఇప్పుడు మా అమ్మ గురించి కూడా నువ్వే ఆలోచిస్తున్నావా?" అంటూ సెటైర్ వేస్తాడు. ప్రభావతి మాత్రం "నేను కోడల్ని కదా, నాకు ప్రేమ ఉంటుంది కదా" అని చెప్పినా, సత్యం ఆమె ఉద్దేశ్యం రిటర్న్ గిఫ్ట్ కోసమేనని గుర్తిస్తాడు. ఇక రోహిణి, మనోజ్, శృతి, రవి కూడా గిఫ్ట్‌ల గురించి ఆలోచిస్తూ చర్చిస్తారు. రోహిణి మనోజ్ పొదుపు ప్లాన్‌పై నవ్వుతుండగా, శృతి బామ్మకు సెల్‌ఫోన్ ఇస్తానని చెబుతుంది. రవి మాత్రం ఆమెకు నచ్చిన వంటకం చేయాలని చెబుతాడు. బాలు మాత్రం "బామ్మ మనసు నాకు బాగా తెలుసు" అంటూ గిఫ్ట్ కోసం బయలుదేరుతాడు. ఇదిలా ఉంటే ప్రభావతి తన అత్తగారికి మీనాక్షిఇంట్లో ఉన్న పాత టీవీని గిఫ్ట్‌గా ఇవ్వాలని ఫిక్స్ అవుతుంది.


Click it and Unblock the Notifications











