Gunde Ninda Gudi Gantalu Weekly: రవిని చితకబాదిన బాలు.. పుట్టింటికి మీనా, వీధిలో బాలుకు అవమానం
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందులోనూ తెలుగు సీరియల్స్ ఉన్న క్రేజీ ఏ భాష సీరియల్స్ ఉండదంటే.. అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సీరియల్ ప్రారంభం కొన్ని రోజులకే హైరేంజ్ లో టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 21 వ తేదీ వరకూ జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!
అక్టోబర్ 21 వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్‌లో బాలు ఇంట్లో లేని సమయంలో మీనా తన అత్తగారింటికి వస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోమ్మని అమామనిస్తుంది. తానేమి తప్పు చేయలేదనీ, అలాగే రవి తప్పు కూడా ఏమీ లేదనీ, శృతి కి తన ఇంట్లో మరో పెళ్లి చేస్తున్నారని, రవిని బలవంతం చేయడంతో శృతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెబుతుంది. అయినా మీనా చెప్పిన విషయాన్ని పట్టించుకోరు. ఈ క్రమంలో బాలుకు ఫోన్ చేయడంతో.. ఆగ్రహంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని, నీకు నాకు సంబంధం లేదని, మీనాను ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని అవమానిస్తాడు. ఈ అవమాన భారం మీనా నుంచి వెళ్లిపోతుంది. మీనా తల్లికి అసలు విషయం తెలియడంతో సుమతిని కొడుతోంది. మీనాకు తల్లి ఇంటికి చేరుకుంటుంది.

అక్టోబర్ 23వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్‌లో సత్యం జైల్లో జరిగిన చేదు అనుభవాలను గుర్తుకు చేసుకుంటూ బాధపడతాడు. ఇంతలో బాలు వచ్చి అన్నం తినమని బ్రతిమిలాడుతాడు. మరోవైపు మీనాకు తల్లి ఆదరణ కరువు అవుతోంది. దీంతో గుడికి వెళ్లి బాధపడుతోంది. దీంతో దేవుడిపై భారం వేయమని పూజారి సలహా ఇస్తాడు. మరోవైపు.. శ్రుతి, రవి మధ్య గొడవ అవుతోంది. దీంతో శ్రుతి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో సంజూ కంట శ్రుతి పడుతోంది. శ్రుతిని ఏమైనా చేయాలని భావించే లోపు రవి అడ్డు వస్తాడు. ఈ క్రమంలో శ్రుతిని ప్రేమించిన పెళ్లి చేసుకున్న వ్యక్తి.. తనని నమ్మించి మోసం చేసిన వ్యక్తి రవినే అని తెలిసి.. షాక్ కు గురవుతాడు సంజూ..

అక్టోబర్ 24వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్‌లో శృతి,రవి కలసి తనని మోసం చేశారని, జోకర్లు చేసి ఎన్ని రోజులు ఆడించాలని,ఎలాగైనా వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని సంజు ఆలోచిస్తాడు. మరోవైపు మీనాను నానా మాటలు అని అవమానిస్తాడు బాలు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన మీనా మరోసారి కనిపించనని బాధతో వెళ్లిపోతుంది. మరోవైపు.. రవి రెస్టారెంట్ కు వచ్చాడనే విషయం తెలుసుకున్న బాలు.. ఆగ్రహంతో రవి దగ్గరకు వెళ్లాడు. కుటుంబ పరువును రోడ్డుకీడ్చాడనే కారణంతో కోపంతో ఇష్టవచ్చినట్టు కొడుతాడు. కుటుంబంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. మరో ఇంట్లో అడుగుపెట్టితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు బాలు.
అక్టోబర్ 25వ తేదీన ప్రసారమైన (శుక్రవారం) ఎపిసోడ్‌లో బాలు తన స్నేహితుడు రాజేశ్ తో కలిసి బార్ కు వెళ్తాడు. ఈ క్రమంలో బార్ లో బాలుకి షాకింగ్ సంఘటన ఎదురవుతుంది. వ్యక్తి తన భార్యను కొట్టడంతో తను ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోయిందని, ఎవరు కూడా తమ భార్యలను తిట్టకూడదని హెచ్చరిస్తాడు. దీంతో షాక్ అయినా.. బాలు తనకు తన మరో ఫ్రెండ్ కార్తీక్ ను తీసుకొని.. మీనా ఇంటికి వెళ్లాలని భావిస్తాడు. ఈ క్రమంలో టెన్షన్ భరించలేని మీనా కు ఫోన్ చేయమని బాలు తన ఫ్రెండ్ కు కాల్ చేయమని చెప్తాడు. ఫోన్ చేయించాడని గ్రహించి ఫోన్ కట్ చేస్తుంది. దీంతో మరింత టెన్షన్ పడ్డ బాలు మీనా ఇంటికి వెళ్తాడు.


Click it and Unblock the Notifications











