Gunde Ninda Gudi Gantalu Weekly: చింటూకు యాక్సిడెంట్.. ఆందోళనలో రోహిణి.. విద్య మాస్టర్ ప్లాన్
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
గుండె నిండా గుడి గంటలు సిరీయల్ సోమవారం ( సెప్టెంబర్ 22 న) ఎపిసోడ్ లో రోహిణి పసుపు తాడు వేసుకొని తిరుగుతుండటం చూసి ప్రభావతి ఆసుయపడుతుంది . "నీకు కొత్త పుస్తెలతాడు తెచ్చిపెడతా" అని అంటుండగా, అక్కడికి వచ్చిన శృతి, "మరి మీనా కూడా పసుపు తాడుతోనే ఉందిగా, ఆమెపై అనవసరంగా మాటలు అనొద్దు. మా అమ్మ ఎవ్వర్ని డబ్బు కోసం ఒత్తిడి చేయలేదు" అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇదిలా ఉండగా, బాలు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి, జ్వరంతో అలసిపోయి కుర్చీలో నిద్రిస్తున్న మీనాను చూసి బాధపడుతాడు. వెంటనే "నేను టాబ్లెట్స్ తీసుకొస్తాను, నువ్వు మనోజ్ గదిలో పడుకో" అని చెబుతాడు. మీనా తొలుత నిరాకరించినా, "ఈ వారం ఆ గది మనదే" అని బాలు చెప్పడంతో ఒప్పుకుంటుంది. ఇంతలో షాపింగ్ నుంచి రోహిణి, మనోజ్‌లు వస్తారు. తమ బెడ్‌రూమ్‌లో మీనా పడుకుని ఉండటం చూసి కోపంతో ప్రభావతికి ఫిర్యాదు చేస్తారు. దీంతో మండిపడిన ప్రభావతి, జ్వరంతో ఉన్న మీనాను బలవంతంగా లేపి కిందికి ఈడ్చుకొస్తుంది. ఇది చూసిన బాలు కోపంతో తల్లిపై విరుచుకుపడతాడు. ఈ క్రమంలో సత్యం వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. జరిగిన విషయాలను బాలు వివరించడంతో పరిస్థితి అర్థం చేసుకున్న సత్యం, గొడవ తగ్గించడానికి గదుల సర్దుబాటు చేస్తాడు. బాలు-మనోజ్ ఒక గదిలో, మీనా-ప్రభావతి-రోహిణి మరో గదిలో ఉండాలని చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

మంగళవారం ( సెప్టెంబర్ 23 ) ఎపిసోడ్ లో తండ్రి సత్యం చెప్పడంతో బాలు, మనోజ్ ఒకే గదిలో పడుకుంటారు. అయితే.. బాలు నాన్‌స్టాప్‌గా కథలు చెబుతుండడంతో మనోజ్ నిద్రపోకుండా ఉంటాడు. మరోవైపు కింద మీనా పడుకోవడం పై రోహిణి ప్రశ్నిస్తే, ప్రభావతి ఆమెను అవమానకరంగా మాట్లాడుతుంది. "పూలు అమ్ముకునే వాళ్లకి, మలేషియాలో పెరిగిన వాళ్లకి తేడా ఉంటుంది" అంటూ మీనాను అవమానిస్తుంది. ఆ మాటలకు మీనా బాధపడుతుంది. రాత్రి ప్రభావతి గురక రాగం వల్ల రోహిణి నిద్రపట్టక హాల్లోకి వస్తుంది. మనోజ్ కూడా హాల్లోనే పడుకుంటారు. ఇక ఉదయం మీనా ఆలస్యంగా లేవడంపై మండిపడుతుందిప్రభావతి. నా తనకు ఒంట్లో బాలేదని చెబుతూనే, కావాలనే రూమ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అవుతుంది. వంట చేయలేదని ప్రభావతి ప్రశ్నించగా, ఈ ఇంట్లో వంట మీనా ఒక్కతే చేయాలా అని సత్యం నిలదీస్తాడు. శృతి, రవిలు వచ్చి మీనాను సపోర్ట్ చేస్తారు. రోహిణి, మనోజ్ కూడా బయటే తినేస్తామని చెప్పడంతో ప్రభావతి దిగులు చెందుతుంది. బాలు, ఇకపై మీనా తనకే, నాన్నకే వంట చేస్తుందని స్పష్టం చేస్తాడు. చివర్లో మీనాకు డాక్టర్ చూపిస్తాడు బాలు. చింటూకి యాక్సిడెంట్ అయ్యి అతని అమ్మమ్మ ఆసుపత్రికి వస్తుంది. బాలు, మీనాలు ఆమెకు ధైర్యం చెబుతారు. చిన్న సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పడంతో ఆమె భయపడుతుంది. రోహిణికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో ఆలోచిస్తూ ఎపిసోడ్ ముగుస్తుంది.
బుధవారం ( సెప్టెంబర్ 24) ఎపిసోడ్ లో చింటూకి యాక్సిడెంట్ అయిన వార్తను రోహిణికి చెప్పాలని ఆమె తల్లి అనుకుంటుంది. కానీ బాలు, మీనాలు దగ్గర ఉండటంతో టెన్షన్ పడుతుంది. ఫర్నిచర్ షాపులో మనోజ్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ప్లాన్ చెప్పమని రోహిణిని అడుగుతాడు. తక్కువ క్వాలిటీ వస్తువులకు పాలిష్ చేసి మంచి క్వాలిటీగా అమ్మేద్దామని చెప్పడంతో రోహిణి మండిపడి కస్టమర్లను మోసగించొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలోనే రోహిణికి తన తల్లి ఫోన్ చేసి చింటూ యాక్సిడెంట్ గురించి చెబుతుంది. దీంతో రోహిణి షాక్ అవుతుంది. అలాగే.. తల్లి "బాలు, మీనా ఇక్కడే ఉన్నారు" అని చెప్పడంతో రోహిణి మరింత టెన్షన్ పడుతుంది. బాలు వెనకనే ఉండటంతో తల్లి అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. చింటూ ఆసుపత్రిలో ఉందని తెలిసిన రోహిణి బాధతో కుప్పకూలిపోతుంది. తల్లిగా పక్కనే ఉండలేకపోతున్నానని బాధపడుతుంది. మరోవైపు ఆసుపత్రిలో బాలు, మీనాలు చింటూని చూసుకుంటూ ఆమె తల్లికి ధైర్యం చెబుతారు. డాక్టర్ బాబు బాగున్నాడని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఊపిరి పీలుస్తారు. రోహిణి తల్లి మీనాకి కృతజ్ఞతలు తెలుపుతుంది. ఇంతలో రోహిణి ఆసుపత్రికి చేరి చింటూని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. "నేను మంచి తల్లిని కాలేకపోయాను" అని కంటతడి పెడుతుంది. బాలు దగ్గర అనుమానం రాకుండా నిజం దాచుకోవాలని నిర్ణయిస్తుంది.
గురువారం ( సెప్టెంబర్ 25) ఎపిసోడ్ లో ఆసుపత్రి బయటకు వస్తున్న రోహిణికి బాలు, మీనాలు ఎదురవుతారు. "బాబును చూశావా?" అని బాలు అడగ్గా, "చూశాను... బాబుకి బాగా గాయమైందని పెద్దావిడకి ధైర్యం చెప్పాను" అని రోహిణి చెబుతుంది. బాలు "పాపం ఆ బాబుకి తల్లిదండ్రులు లేరట... మేనత్త దుబాయ్‌లో ఉంటుందట... ఎవరైనా చిన్నపిల్లను వదిలేసి ఉండగలరా?" అని బాధపడతాడు. "మనోజ్‌లాగే స్వార్థం చూసుకునే రకం అనుకుంటా" అని కూడా అంటాడు. దాంతో రోహిణి "ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉందో? సంపాదించి ఇక్కడికి పంపకపోతే వీళ్లూ ఎలా బతుకుతారు?" అని సీరియస్ అవుతుంది. ఈ సమాధానానికి బాలు, మీనాలు ఆశ్చర్యపడతారు. ఇంతలో ఆసుపత్రిలో చింటూ స్పృహలోకి వస్తాడు. "నాకేం కనిపించడం లేదు" అని చెప్పడంతో అందరూ కలత చెందుతారు. "నీ కంటికి మందు కట్టి ఉంచారు, రెండు రోజుల్లో కట్లు తీసేస్తారు" అని రోహిణి తల్లి ధైర్యం చెబుతుంది. "మీరు ఇక్కడే ఉండండి అంకుల్" అని బాలు, మీనాలపై చింటూ ప్రేమ చూపడంతో వాళ్లు ఎమోషనల్ అవుతారు. డిశ్చార్జ్ అయ్యేవరకు బాబు రికవర్ అవ్వాలని రోహిణి తల్లి కోరుకుంటుంది. కానీ బాలు, మీనాలు బాబును తీసుకుని తమ ఇంటికి వస్తారు. అక్కడ ప్రభావతి వీళ్లను చూసి మండిపడుతుంది. "మీకు రూం లేకపోతే ఇంకో ఇద్దరినీ ఎందుకు తీసుకొచ్చావు?" అని బాలు మీద కోపపడుతుంది. సత్యం మాత్రం వీళ్లను ఉంచాలని తేల్చిచెబుతాడు. రోహిణి కూడా "వాళ్లిద్దరూ మా బెడ్‌రూంలో ఉంటారు" అని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ప్రభావతి మాత్రం ఇంకా ఒప్పుకోకపోవడంతో సత్యం "వాళ్లని వదలలేం" అని హెచ్చరిస్తాడు. రోహిణి బాబును చూసుకుంటూ, మరోవైపు తన నిజం బయటపడుతుందేమోనని భయపడుతూ ఉంటుంది. ఇదే ఈ ఎపిసోడ్‌లోని ఎమోషనల్ హైలైట్.
శుక్రవారం ( సెప్టెంబర్ 26) ఎపిసోడ్ లో ప్రమాదంలో గాయపడిన చింటూని మీనా అక్కున చేర్చుకుని తన బెడ్‌రూంలో పడుకోపెడుతుంది. మరోవైపు రోహిణి తన గతం బయటపడుతుందేమోనని తీవ్ర టెన్షన్ పడుతుంది. నిద్రలోనే తన కొడుకు చింటూ తాను తల్లినని చెప్పుకుంటూ ఏడుస్తున్న కల పడుతుంది. దాంతో ఒక్కసారిగా లేచి కంగారు పడుతూ మీనా గదికి వెళ్తుంది. ఆ సమయంలో బాబు "అమ్మా... అమ్మా..." అంటూ ఏడవడం రోహిణిని మరింత కలవరపెడుతుంది. తన బిడ్డ దగ్గర ఉండలేకపోతున్నానని బాధపడుతుంది. మరుసటి రోజు వెంటనే తన ఫ్రెండ్ విద్యకు ఫోన్ చేసి పరిస్థితి చెబుతుంది. విద్య "ఇక వారిని ఇంట్లో ఉంచితే నీ రహస్యం బయటపడుతుంది" అని హెచ్చరిస్తూ ఒక ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం విద్య మీనాకు కాల్ చేసి పూల అల్లే పోటీలో సహాయం చేయమని అడుగుతుంది. మొదట నిరాకరించిన మీనా చివరికి ఒప్పుకుంటుంది. ఆమె వెళ్లబోతుండగా బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. "విద్యను నమ్మొద్దు" అని చెప్పినా, మాట ఇచ్చానని మీనా వెళ్ళిపోతుంది. రోహిణి తరువాత రవి, శృతిలను కూడా బయటకు పంపించేస్తుంది. ఇక తన ప్రధాన టార్గెట్ ప్రభావతి. చింటూ అమ్మమ్మ ఇక్కడే ఉంటారని అబద్ధం చెబుతూ ప్రభావతిని రెచ్చగొడుతుంది. "వారిని తానే పంపేస్తా" అన్న ప్రభావతికి రోహిణి అడ్డుపడి, "బాలు వాళ్లని తీసుకొచ్చాడు... నువ్వు పంపిస్తే గొడవ అవుతుంది" అని అడ్డుకుంటుంది. దాంతో ప్రభావతి తానే రోహిణి సహాయం కోరుతుంది. రోహిణి తన అత్తమామలను గుడికి పంపించి ప్లాన్ అమలు చేస్తుంది. ఇలా ఒక్కొక్కరిని ఇంట్లో నుంచి బయటకు పంపించే ప్రయత్నంలో రోహిణి తన మాస్టర్ ప్లాన్‌ను విజయవంతంగా మొదలుపెడుతుంది. ఇదే ఎపిసోడ్ హైలైట్.


Click it and Unblock the Notifications











