Gunde Ninda Gudi Gantalu Weekly (June30-July4): రోహిణిపై ప్రభావతి ఫైర్.. బాలుపై కుట్ర.. మీనాను దొంగను చేసి..
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 30వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
జూన్ 30వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
శృతి ఫంక్షన్ ను అంగరంగ వైభవంగా జరిపించేందుకు శృతి వాళ్ల అమ్మ శోభ, నాన్న సురేంద్ర అన్ని ఏర్పాట్లను చేస్తారు. ఇక ఈ ఫంక్షన్ తో ఎలాగైనా తమ కూతురు శృతికి అత్తగారి ఇంటిపై ద్వేషం పెరిగేలా చేయాలని ముందుగానే కుట్ర పన్నుతారు. అందుకు బాలును పావుగా వాడుకోవాలని చూస్తారు. ఇక బాలు కూడా శృతి ఫంక్షన్ లో ఎవ్వరితో గొడవకు వెళ్లకూడదని, ఎవ్వరు ఏమన్నా సరే మౌనంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఇక మౌనవ్రతం పాటిస్తాడు. ఇక శృతి ఫంక్షన్ ను అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి. అయితే తమ కూతురు చాలా రిచ్ గా కనిపించాలని శృతి వాళ్ల అమ్మనాన్నలు ఒంటినిండా బంగారు నగలు చేయిస్తారు. శృతి ఆ నగలన్నీ ధరించి లక్ష్మిదేవీలా ముస్తాబవుతుంది. శృతిని బంగార నగల్లో చూసిన ప్రభావతి సంతోషంలో మునిగి తేలుతుంది. ఇక తాళి మార్చే ఫంక్షన్ కావడంతో ప్రభావతి శృతి కోసం పట్టుచీర, పూల దండ తీసుకొని వస్తుంది. మరోవైపు శృతి వాళ్ల అమ్మ కూడా పట్టుచీర, కాస్ట్లీ పూలదండ తీసుకొని వస్తుంది. ఆచారం ప్రకారం అత్తగారి ఇంటి నుంచి తీసుకొచ్చిన చీర, పూల దండ వేసుకోవాలని ప్రభావతి అంటుంది. లేదు లేదు ఆ నాసిరకం చీరను నా కూతురు కట్టుకోదని తను తెచ్చిన ఖరీదైన చీరనే కట్టుకుంటుందని శృతి వాళ్ల అమ్మ శోభ అంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఇక శృతి జోక్యం చేసుకొని అత్త ప్రభావతి తీసుకొచ్చిన చీరను కట్టుకుంటుంది. తన తల్లి తెచ్చిన పూలదండను మెడలో వేసుకొని ఇద్దరికీ న్యాయం చేస్తుంది.

జూలై 1వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ఇక శృతి తాళి మార్చే ఫంక్షన్ లోనే మనోజ్ భార్య రోహిణికి కూడా తాళి మార్చే ఫంక్షన్ ను చేయాలని ముందుగానే నిర్ణయిస్తారు. ఈ సందర్భంగా రోహిణి వాళ్ల నాన్నను మలేషియా నుంచి రమ్మనమని ప్రభావతి చెబుతుంది. దాంతో రోహిణి మా నాన్న వస్తున్నాడని ఫైట్ లో ఉన్నాడని చెబుతుంది. ఇక ఓవైపు ఫంక్షన్ కు శృతి రెడీ అవుతూ ఉంటే.. ప్రభావతికి టెన్షన్ అవుతూ ఉంటుంది. ఇక మీ నాన్న ఎప్పుడు వస్తాడని చెప్పి పదే పదే అడుగుతుంది. ముందు నాన్నకు ఫోన్ చేసి నాకివ్వమని అంటుంది. ఇక రోహిణి తన పాత నెంబర్ కే ఫోన్ చేసి స్విచ్ఛాఫ్ వస్తుందని చెబుతుంది. సరే త్వరగా వచ్చేలా చూడమని చెప్పి వెళ్లిపోతుంది. ఇక మరోవైపు బాలుతో ఫంక్షన్ లో గొడవ చేయాలని అటు శృతి వాళ్ల అమ్మానాన్నలు, ఇటు రోహిణి ప్రయత్నిస్తారు. అందుకు మనుషులను ఏర్పాటు చేస్తారు. శృతి వాళ్ల అమ్మానాన్నలు ఇద్దరు మనుషులతో బాలుతో గొడవ పడమని పంపిస్తే.. ఇక రోహిణి ఏర్పాటు చేసిన మనిషికి బాలుతో తాగించమని చెబుతారు. ముందుగా బాలు దగ్గరికి శృతి వాళ్ల అమ్మ ఏర్పాటు చేసిన మనుషులు వెళ్లి గొడవ చేస్తారు.
జూలై 2న తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ఓవైపు ఫంక్షన్ గ్రాండ్ గా జరుగుతూ ఉంటే.. మరోవైపు ఎలా గొడవ చేయించాలా అని శృతి వాళ్ల అమ్మానాన్న చూస్తారు. అప్పటికే సత్యంను శృతి వాళ్ల నాన్న సురేంద్ర అవమానిస్తాడు. సూటిపోటి మాటలతో కోసం వచ్చేలా చేస్తాడు. అయినా కూడా సత్యం మౌనంగా ఉంటాడు. బాలుకు సురేంద్ర అనే మాటలు వినపడకుండా జాగ్రత్త పడుతాడు. ఇక శృతి వాళ్ల అమ్మనాన్న ఏర్పాటు చేసిన మనుషులు ఇద్దరు బాలు దగ్గరకు వెళ్లి గొడవకు దిగుతారు. ముందుగా ఒక వ్యక్తి బాలు కాలును తొక్కి గొడవ చేయాలని ప్రయత్నిస్తాడు. కాలు బలంగా తొక్కినా కూడా బాలు ఏమనడు. సైలెంట్ గా ఉంటాడు. పక్కనే ఉన్న మీనా ఆ ఇద్దరిని మందలించి పంపిస్తుంది. ఇక మరోసారి వాళ్లు బాలు కాలును ఇద్దరు కలిసి తొక్కడానికి ప్రయత్నిస్తారు. కానీ బాలు తన తండ్రి సత్యం అటువైపుగా వెళ్తుండగా పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకొని వారిద్దరి నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు రోహిణిని ప్రభావతి ఒత్తిడి చేస్తూనే ఉంటుంది. మీ నాన్న ఇంకెప్పుడు వస్తాడని పదేపదే అడుగుతుంది. ముందుగా నీకు తాళి మార్చే కార్యక్రమం చేయాల్సి ఉందని, మీ నాన్నను త్వరగా రమ్మనమని చెప్పు అని అంటుంది. అందుకు రోహిణి మా నాన్న ఫోన్ కలవడం లేదని బదులిస్తుంది. దాంతో ప్రభావతి మండిపడుతుంది.
జూలై 3న తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ముందుగా రోహిణికే తాళి మార్చే ఫంక్షన్ ఉండటంతో ఫంక్షన్ లో అందరూ ఆమె తండ్రి మలేషియా నుంచి ఎప్పుడు వస్తారోనని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రోహిణి మాత్రం బాలుకు త్వరగా తను ఏర్పాటు చేసిన మనిషి తాగించి గొడవ చేయించాలని చూస్తుంది. ఈ క్రమంలో తను ఏర్పాటు చేసిన వ్యక్తితో బాలుతో మందు తాగించమని చెప్పి పంపిస్తుంది. అతను బాలు దగ్గరికి వెళ్లి మాటలు కలుపుతాడు. బాలుతో పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడి బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ బాలు మాత్రం అస్సలు అతని మాటలకు పడిపోడు. ఇక అతను మాత్రం బయట మందు సెటప్ ఉందని చెప్పి బలవంతంగా బాలును బయటికి తీసుకెళ్తాడు. మందు చూపించి తాగ అని అంటాడు. మందు కలిపి ఇస్తాడు. మరోవైపు రోహిణి వాళ్ల నాన్న ఇంకెప్పుడు వస్తాడని శృతి వాళ్ల అమ్మ శోభా ప్రభావతిని అడుగుతుంది. వాళ్ల నాన్న వచ్చే వరకు మా అమ్మాయి ఫంక్షన్ ను మేము ఎందుకు ఆపుకోవాలని అంటుంది. ఫంక్షన్ ఉందని తెలిసి ఆయనే ముందుగానే రావాలి కదా అని అంటుంది. మరోవైపు రోహిణి తన తండ్రి ఫోన్ కలవడం లేదని, వస్తూనే ఉంటాడని చెబుతుంది. ఇక చేసేదీ లేక శృతికి కార్యక్రమాన్ని జరిపించేందుకు సిద్దమవుతారు.
జూలై 4న తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రోహిణి వాళ్ల నాన్న మలేషియా నుంచి రావడం లేదని ఎదురు చూసి చూసి శృతికి తాళి మార్చే ఫంక్షన్ ను ఘనంగా జరిపిస్తారు. ఆ తర్వాత రోహిణి వాళ్ల నాన్న కోసం ఇంకా వెయిట్ చేస్తారు. కానీ రోహిణి మాత్రం ఇంకా వస్తున్నాడనే చెబుతుంది. ఉదయం నుంచి ఇదే మాట చెబుతున్నావని, అసలు మీ నాన్న వస్తున్నాడా? లేదా? అని ప్రభావతి గట్టిగా అడుగుతుంది. వస్తే వస్తున్నాడని చెప్పాలి. లేదంటే లేదని చెప్పాలి. ఇలా అందరిలో నవ్వుల పాలు చేస్తున్నావెందుకని మండిపడుతుంది. నాన్న ఎందుకు రావడం లేదో నాకు కూడా అర్థం కావడం లేదని రోహిణి అంటుంది. ఇక రోహిణికి కూడా తాళి మార్చే ఫంక్షన్ ను పూర్తి చేస్తారు. ప్రభావతి, సత్యం రోహిణిని ఆశీర్వదిస్తారు. మరోవైపు బాలుతో తాగించమని చెప్పిన వ్యక్తి తానే ఫుల్ గా తాగేస్తాడు. బాలు జాగ్రత్తగా ఉండి అతనితోనే ఫుల్ గా తాగిస్తాడు. తన భార్య కోసం తాగనని అతనితో చెబుతాడు. ఇక ఫంక్షన్ పూర్తి అవ్వడంతో శృతి, రవి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేద్దామని అనుకుంటారు. ఈ సందర్భంగా శృతి మెడలో ఉన్న పూల దండను తన గదిలో వేసి వేస్తుంది. ఆ దండకు బంగారు గొలుసు ఉంటుంది. ఆ గొలుసు మీనా గమనించి భద్రపరచడానికి తీస్తుంది. అదే సమయంలో శృతి వాళ్ల నాన్న చూసి మీనాను నిందిస్తాడు. శృతి చైన్ ను దొంగలిస్తున్నావా? అని అవమానిస్తాడు. మరోవైపు శృతి వాళ్ల అమ్మ శోభ కూడా వచ్చి మీనాను దొంగ అని ముద్ర వేస్తుంది. దీంతో పెద్ద ఘర్షణ అవుతుంది. మీనాను సురేంద్ర నానా మాటలు అనడంతో బాలు ఆయన చెంప వాయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే భారీ సప్పెన్స్ తో ఈ వారం చివరి ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications











