Gundeninda Gudigantalu: ఎవ్వరూ ఊహించని పని చేసిన బాలు.. అర్థరాత్రి రోడ్లపై అలా..

Gundeninda Gudigantalu Balu: స్టార్ మా చానెల్‌లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న సీరియల్స్‌లో 'గుండె నిండా గుడి గంటలు' ఒకటి. ఈ సీరియల్‌కు వస్తున్న క్రేజ్‌కు ప్రధాన కారణం మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నబాలు. ఈ పాత్ర ద్వారా బాలు తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేకంగా స్థానాన్ని సంపాదించకున్నారు. నిజానికి బాలు అసలు పేరు విష్ణుకాంత్. తమిళనాడు నటుడు అయినప్పటికీ, తెలుగులో అడుగుపెట్టిన ఇతడు తొలి సీరియల్‌తోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

విష్ణుకాంత్ తన సహజ నటన, ఎమోషనల్ సీన్స్‌లో చూపించే డెప్త్ , ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే నటన, పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్‌తో బాలు రోజురోజుకీ అభిమానులకు దగ్గర చేస్తుంది. స్టార్ హీరోలకు ఉండేంత క్రేజ్ ఒక సీరియల్ నటుడికి రావడం మామూలు విషయం కాదు. బాలు విషయంలో మాత్రం అది నిజంగా సాధ్యమైంది. ఇటీవల బుల్లితెర ఈవెంట్లు, పబ్లిక్ ప్రోగ్రామ్‌లలోనూ బాలు సందడి చేస్తున్నారు. తన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

Gundeninda Gudigantalu Actor Balu Wins Hearts With His Real-Life Kind Gesture

ఇదిలా ఉండగా... తాజాగా బాలు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో చూసి అభిమానులు మాత్రమే కాదు, సాధారణ నెటిజన్లు కూడా ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'బాలు ఇలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు', 'రీల్‌లో కాదు రియల్‌లో కూడా హీరోనే' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అసలు ఆ వీడియోలో ఏముందంటే... బాలు తన తోడి నటుడు గుండెనిండా గుడి గంటలు మనోజ్‌తో కలిసి రాత్రి సమయంలో బయటకు వచ్చాడు. చలికాలం కావడంతో రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న నిరాశ్రయులను చూసి చలించిపోయాడు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, కెమెరాల కోసం చేయడం కాకుండా... నేరుగా వాళ్ల దగ్గరకు వెళ్లి దుప్పట్లు పంచాడు. చలిలో వణికిపోతున్న వారిని చూసి, తనవంతుగా సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు తెలిపారు.

ఆ వీడియోలో బాలు, మనోజ్ ఇద్దరూ దుప్పట్లు పంచుతూనే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులతో కూడా మాట్లాడటం, వాళ్లతో సెల్ఫీలు దిగడం కనిపిస్తుంది. పోలీసులకూ ఈ ప్రయత్నం నచ్చడంతో వారు కూడా బాలు చేసిన పనిని అభినందించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఏదో ఒక్కరోజు కోసం చేసిన షో కాదు... నిజమైన మనసుతో చేసిన సహాయం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలు వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గుండె నిండా గుడి గంటలే అభిమానులే కాకుండా ఇతర నెట్టిజన్లు కూడా బాలు చేసిన పనికి ఫిదా అయిపోయారు. "సీరియల్‌లో మంచి భర్త, మంచి మనిషి... నిజ జీవితంలో కూడా అంతే" అంటూ ప్రశంసలు చేస్తున్నారు. ముఖ్యంగాబాలు చేసిన పని ఇతరులకు ఇన్‌స్పిరేషన్ అనే చెప్పాలి.

విష్ణుకాంత్ (బాలు) కెరీర్ విషయానికి వస్తే.. తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విష్ణుకాంత్. అయితే తెలుగులో మాత్రం 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్‌తో అతని కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఈ సీరియల్ ప్రారంభమైన కొద్దికాలంలోనే మంచి రేటింగ్ తెచ్చుకుని స్టార్ మా ఛానెల్‌లో టాప్ సీరియల్స్ లిస్ట్‌లో నిలిచింది. దాంతో విష్ణుకాంత్ అనే పేరుకంటే, బాలు అనే క్యారెక్టర్ పేరే తెలుగువాళ్లకు గుర్తుండి పోయింది.

ప్రస్తుతం బాలు తెలుగులో 'మా ఇంటి దేవత'అనే సీరియల్ లో కూడా నటిస్తున్నాడు. కానీ గుండె నిండా గుడిగంటలు స్థాయిలో ఆ సీరియల్‌కు క్రేజ్ రాలేదనే చెప్పాలి. ఇక బాలు సీరియల్స్ లోనే కాదు.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. షూటింగ్ అప్‌డేట్స్, లేటెస్ట్ ఫోటోలు, వ్లాగ్స్ ద్వారా ఎప్పుడూ ఫ్యాన్స్‌ను ఎంగేజ్ చేస్తూ వస్తున్నాడు. ఇలా అప్పుడప్పుడూ ఇతరులకు సేవ చేస్తూ.. రీల్ హీరోగా మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్నాడు బాలు. అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X