Gundeninda Gudigantalu Balu: బాలు క్రేజ్ మామూలుగా లేదుగా... విష్ణుకాంత్ ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే?

తెలుగు బుల్లితెరపై బెస్ట్ సీరియల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది స్టార్ మా (Star Maa). ఈ ఛానెల్ లో ప్రస్తుతం టాప్ టీఆర్‌పీతో దూసుకుపోతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు (Gundeninda Gudigantalu). కుటుంబ భావోద్వేగాలు, మధ్యతరగతి జీవిత పోరాటాలు, భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని హృద్యంగా చూపిస్తూ ఈ సీరియల్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. ఈ సీరియల్‌కు హైలైట్ మాత్రం బాలు పాత్రే. అమాయకంగా కనిపిస్తూ అవసరమైతే తెలివిగా నిర్ణయాలు తీసుకునే యువకుడిగా, కుటుంబ బాధ్యతలు మోస్తూ భార్య గౌరవాన్ని కాపాడే భర్తగా బాలు క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు తమిళ నటుడు విష్ణు కాంత్(Vishnu Kanth). తెలుగులో ఇదే అతడికి బిగ్ బ్రేక్ అని చెప్పాలి. అసలు పేరు కంటే 'బాలు'గానే ఎక్కువగా పాపులర్ అయ్యాడు.

రెమ్యూనరేషన్ ఎంతంటే?
గుండెనిండా గుడి గంటలు సీరియల్ సక్సెస్‌ పుల్ గా సాగుతుంది. ఈ సీరియల్ బెస్ట్ టీఆర్పీతో దూసుకెళ్తుంది. అలాగే.. విష్ణుకాంత్ క్రేజ్ కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..బాలు పాత్రకు విష్ణుకాంత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ రోజుకు దాదాపు రూ.40,000 నుంచి రూ. 50,000 వరకు ఉంటుందట. నెలలో సగటున 10-15 రోజుల షూటింగ్ ఉంటే.. మంచి మొత్తమే చేతికొస్తున్నట్టు టాక్. మిగతా క్యారెక్టర్లతో పోలిస్తే బాలు పాత్రకు ఎక్కువ స్క్రీన్ టైమ్, ప్రాధాన్యత ఉండటంతో ఆయన రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Gundeninda Gudigantalu Balu Remuneration Vishnu Kanth Per Day Salary amp amp Star Maa Serial Success

విష్ణుకాంత్ లుక్స్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అతడు చూడ్డానికి అచ్చం తమిళ స్టార్ శివకార్తికేయన్ లాగే ఉంటాడని అభిమానులు కామెంట్స్ చేస్తుంటారు. దీనిపై స్పందించిన విష్ణుకాంత్... 'ఆయన లాంటి పెద్ద స్టార్‌తో పోల్చడం ఆనందమే. కానీ నేను ఇంకా చిన్న ఆర్టిస్ట్‌నే, నేర్చుకోవాల్సింది చాలా ఉంది'అంటూ వినయంగా చెబుతుంటాడు.

టీఆర్‌పీలో టాప్... బాలు మ్యాజిక్!
లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ 12.86 రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. అర్బన్ ఏరియా రేటింగ్స్‌లో అయితే స్టార్ మా సీరియల్స్‌లో ఇదే టాప్‌లో ఉండటం విశేషం. ఈ సక్సెస్‌లో బాలు క్యారెక్టర్ కీలక పాత్ర పోషిస్తోందన్నది నిర్వివాదం. సహజమైన నటన, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్‌లో విష్ణుకాంత్ చూపిస్తున్న ఇంపాక్ట్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తోంది.

రియల్ లైఫ్ స్ట్రగుల్
స్క్రీన్‌పై సక్సెస్ కనిపిస్తున్నా... విష్ణుకాంత్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తమిళ సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన అతడికి ఒక దశలో అవకాశాలు తగ్గాయి. పెళ్లి తర్వాత విడాకులు తీసుకోవడం కూడా అతడి జీవితాన్ని కుదిపేసింది. అయినా వెనకడుగు వేయకుండా తెలుగులో ప్రయత్నించి, గుండె నిండా గుడి గంటలుతో మళ్లీ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ సీరియల్‌తో పాటు పలు తెలుగు ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ దక్కించుకుంటూ బిజీగా ఉన్నాడు విష్ణుకాంత్. ఇలా.. బాలు పాత్రతో ఇంటింటా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు, కష్టకాలాన్ని దాటుకుని ఇప్పుడు బుల్లితెరపై సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X