Sreemukhi: ఆ విషయంలో శ్రీముఖిని హార్ట్ చేసిన బాలు.. నిజంగానే ప్రేమలో పడ్డారా?
గుండెనిండా గుడిగంటలు సీరియల్ ద్వారా బాలు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. వాస్తవానికి అతని అసలు పేరు విష్ణుకాంత్ (Vishnukanth). ఈ సీరియల్ ద్వారా బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. సీరియల్ సక్సెస్ తో పాటు 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'షోలో కూడా తన ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖితో కనిపించిన లవ్ ట్రాక్ వల్ల అతని పాపులారిటీ మరింత పెరిగి, బుల్లితెర ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో యాంకర్ శ్రీముఖికి బాలు సారీ చెప్పారు. వాళ్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఇటీవల కాలంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
తాజాగా 'స్టార్ మా పరివారం అవార్డ్స్ 2026' సక్సెస్ మీట్ సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం లో భాగంగా.. పరివారం అవార్డ్స్ సక్సెస్ పార్టీ అనే పేరుతో స్పెషల్ షో నిర్వహించారు ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో.. స్టార్ మా పరివారం అవార్డులో అందుకున్న ఆర్టిస్టులు పాల్గొని.. సందడి చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి మెయిన్ యాంకర్ గా వ్యవహరించగా, ముక్కు అవినాష్, రైటర్ హరి కో యాంకర్ గా వ్యవహరించారు. మొదటి నుంచి చివరి వరకు నవ్వులు పూయించిన ఈ ప్రోమోలో బాలు-శ్రీముఖి ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రోగ్రామ్ ప్రారంభంలోనే 'గుండెనిండా గుడిగంటలు' ఫేమ్ సత్యం స్టేజ్‌పైకి రావడంతో యాంకర్ శ్రీముఖి.. సరదాగా "రావయ్య ముద్దుల మామ" అంటూ పాట పాడుతూ అతని కాళ్లపై పడిపోవడం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేసింది.సత్యం కూడా వెంటనే "దీర్ఘ సుమంగళీభవ" అంటూ ఆశీర్వదించగా, శ్రీముఖి మాత్రం ట్విస్ట్ ఇస్తూ "బాలు సుమంగళీభవ అని చెప్పండి" అంటూ రిక్వెస్ట్ చేయడం హైలైట్‌గా మారింది. ముఖ్యంగా 'గుండెనిండా గుడిగంటలు' టీమ్ ఎంట్రీతో స్టేజ్ మొత్తం ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయింది.
ముందుగా సత్యం స్టేజ్‌పైకి రావడంతో శ్రీముఖి సరదాగా "రావయ్య ముద్దుల మామ" అంటూ పాట పాడుతూ అతని కాళ్లపై పడుతుంది. సత్యం కూడా వెంటనే "దీర్ఘ సుమంగళీభవ" అంటూ ఆశీర్వదించగా, శ్రీముఖి మాత్రం ట్విస్ట్ ఇస్తూ "బాలు సుమంగళీభవ అని చెప్పండి" అంటూ రిక్వెస్ట్ చేయడం హైలైట్‌గా మారింది.
అయితే 'బాలుకు ఇప్పటికే మీనా ఉంది కదా' అని సత్యం అనగానే, శ్రీముఖి 'అయితే మీనాను చంపేద్దాం' అంటూ సరదాగా చెప్పిన డైలాగ్ స్టేజ్‌పై ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఆ తర్వాత బాలు (Vishnukanth) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల జరిగిన అవార్డ్స్‌లో 'పాపులర్ హస్బెండ్' అవార్డు అందుకున్న బాలు, స్టేజ్‌పైకి రాగానే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంటనే శ్రీముఖితో కలిసి చేసిన రొమాంటిక్ డాన్స్ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ముక్కు అవినాష్ అడిగిన ప్రశ్నతో సీన్ మరింత ఆసక్తికరంగా మారింది. 'అవార్డు తీసుకున్నప్పుడు బాగుందా... లేక శ్రీముఖిని ఎత్తుకున్నప్పుడు బాగుందా?'అని అడగగా, బాలు చాలా క్లియర్‌గా 'నా ప్రేక్షకులు ఓటేసి ఇచ్చిన అవార్డు నాకు చాలా ముఖ్యమైనది' అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సమాధానంతో శ్రీముఖి అలిగి అక్కడి నుంచి వెళ్లిపోవడం మరో ఫన్నీ మోమెంట్‌గా మారింది. వెంటనే బాలు ఆమె వెనకాల వెళ్లి సారీ చెప్పడం, ఆమెను కూల్ చేయడానికి ట్రై చేయడం క్యూట్‌గా అనిపించింది.
ఈ సమయంలో బాలు చెప్పిన మాటలు మరింత ఆసక్తికరంగా మారాయి. 'పాపులర్ జోడి అవార్డు బాలు-మీనా కి వచ్చింది... కానీ బాలు-శ్రీముఖి కి రాలేదు' అంటూ తన ఫీలింగ్ వ్యక్తం చేయడం ప్రోమోలో ఎమోషనల్ టచ్ ఇచ్చింది. అయితే శ్రీముఖి మాత్రం 'పర్వాలేదులే' అంటూ నవ్వుతూ అతన్ని తీసుకెళ్లడం ద్వారా సీన్‌ను లైట్‌గా మార్చింది. పక్కనే ఉన్న ముక్కు అవినాష్ మాత్రం 'ఇది ఒక తింగరిది... ఏం చెప్తే అదే నమ్ముతుంది' అంటూ సెటైర్ వేయడం ఫన్నీగా మారింది.
ఇలా ఈ ప్రోమోలో బాలు-శ్రీముఖి మధ్య కనిపించిన ఫన్, రొమాన్స్, ఎమోషన్ అన్ని కలిసి షోను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు. 'ఇద్దరి మధ్య నిజంగానే ఏమైనా ఉందా?', 'ఇది కేవలం షో కోసమేనా లేక నిజంగానే సంథింగ్ ఉందా?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే 'ఈ జోడీ స్క్రీన్‌పై బాగా వర్కౌట్ అవుతోంది'అంటూ ప్రశంసిస్తున్నారు. ఇలా బాలు-శ్రీముఖి కెమిస్ట్రీ మరోసారి బుల్లితెరపై హాట్ టాపిక్‌గా మారింది. ఈ సరదా ట్రాక్ ఎంతవరకు నిజమో తెలియకపోయినా, ప్రేక్షకులకు మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది అనేది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications

















