Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు బాలు రెమ్యూనరేషన్.. రోజుకి ఇంత పేమెంట్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను గత కొంతకాలంగా విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో 'గుండెనిండా గుడిగంటలు'(Gundeninda Gudigantalu) ఒకటి. ప్రముఖ ఛానెల్ స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కుటుంబ కథాంశం, భావోద్వేగ సన్నివేశాలు, సహజమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. టీఆర్‌పీ పరంగా కూడా 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ దూసుకుపోతోంది. ఇటీవల విడుదలైన రేటింగ్స్ ప్రకారం ఈ సీరియల్ టాప్ సీరియల్స్ జాబితాలో స్థానం సంపాదించింది. ముఖ్యంగా అర్బన్ ప్రేక్షకుల్లో ఈ సీరియల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కథలో వచ్చే ట్విస్టులు, బాలు-మీనా పాత్రల మధ్య భావోద్వేగాలు, కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణలు ప్రేక్షకులను ఎపిసోడ్‌కు ఎపిసోడ్ కట్టిపడేస్తున్నాయి.

అయితే.. ఈ సీరియల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన పాత్ర 'బాలు'. కుటుంబం కోసం త్యాగం చేసే మనస్తత్వం, అవసరమైనప్పుడు ధైర్యంగా నిలబడే స్వభావం.. ఇవన్నీ కలగలిపిన పాత్రగా బాలు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ పాత్రలో తమిళ నటుడు విష్ణుకాంత్ అద్భుతంగా ఒదిగిపోయాడు. ప్రస్తుతం చాలామందికి విష్ణుకాంత్ అసలు పేరు కంటే 'బాలు'గానే ఎక్కువగా గుర్తింపు ఉంది. విష్ణుకాంత్ నటనలోని సహజత్వమే ఈ పాత్రకు బలమని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్‌లో చూపించే హావభావాలు, కుటుంబ సభ్యులతో జరిగే సంభాషణలు, భార్యకు అండగా నిలిచే భర్త పాత్రలో ఆయన ప్రదర్శన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అందుకే 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ విజయానికి బాలు పాత్ర కీలక కారణంగా నిలిచిందని బుల్లితెర విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Gundeninda Gudigantalu Balu Vishnu Kanth s Per Day Remuneration and Real Life Struggles

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం విష్ణుకాంత్ రెమ్యూనరేషన్. బుల్లితెర హీరోల్లో ఆయన కూడా మంచి పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఒకరిగా చెప్పబడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ సీరియల్ కోసం విష్ణుకాంత్ రోజుకు దాదాపు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. కొన్ని వర్గాలు ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉండొచ్చని కూడా చెబుతున్నాయి. నెలలో సగటున 10 నుంచి 15 రోజుల షూటింగ్ ఉంటే, ఆయనకు దాదాపు రూ. 10 లక్షల వరకు ఆదాయం వస్తుందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.

విష్ణుకాంత్ గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆయన రూపురేఖలు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌ను పోలి ఉంటాయని చాలామంది అభిమానులు అభిప్రాయపడుతుంటారు. సోషల్ మీడియాలో కూడా ఈ పోలికలపై తరచూ చర్చ జరుగుతుంది. అయితే, ఈ విషయంపై స్పందించిన విష్ణుకాంత్ ఎప్పుడూ వినయంగానే మాట్లాడుతుంటాడు. "శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోతో పోల్చడం ఆనందమే. కానీ, నేను ఇంకా నేర్చుకునే దశలో ఉన్న నటుడిని" అని ఆయన పలుమార్లు చెప్పారు.

అయితే స్క్రీన్‌పై కనిపించే విజయం వెనుక విష్ణుకాంత్ జీవితంలో ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. తమిళ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆయన మొదట్లో అవకాశాల కోసం చాలా కష్టపడ్డారు. ఒక దశలో కెరీర్‌లో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలోనూ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. వివాహం జరిగిన కొద్ది కాలానికే భార్యతో విభేదాలు రావడం, తర్వాత విడాకులు తీసుకోవడం ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఆ వ్యక్తిగత కష్టాల మధ్య కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. నటుడిగా తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో కొత్త అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ క్రమంలోనే తెలుగు బుల్లితెరలో అడుగుపెట్టి 'గుండెనిండా గుడిగంటలు' ద్వారా భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్‌తో పాటు మరికొన్ని తెలుగు ప్రాజెక్టులపై కూడా ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X