నేనూ నీ బిడ్డనే.. నన్నెందుకు వేరుగా చూస్తున్నావ్.. బాలు మాటలకు ప్రభావతి కంటతడి

Photo Courtesy: JioHotstar

తెలుగు బుల్లితెరపై ఎన్ని కామెడీ షోలు, రియాలిటీ షోలు వచ్చినప్పటికీ సీరియల్స్‌దే హవా. కుటుంబ ప్రేక్షకులు ముఖ్యంగా మహిళల్ని గంటల తరబడి టీవీల ముందు కూర్చోబెట్టడంలో సీరియల్స్‌ది ప్రధాన పాత్ర. కేవలం సీరియల్స్‌తోనే కొన్ని ఛానెల్స్‌ టీఆర్పీ రేటింగ్స్‌లో దూసుకెళ్తున్నాయి. తెలుగు నాట ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో స్టార్ మా టాప్‌లో ఉండటానికి సీరియల్సే కారణమని విశ్లేషకులు అంటూ ఉంటారు. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‌లో టాప్‌ టీఆర్పీ రేటింగ్ ఉన్న సీరియల్స్‌లో గుండె నిండా గుడి గంటలు ధారావాహిక కూడా ఒకటి.

గుండెనిండా గుడిగంటలకు టాప్ రేటింగ్
ప్రతి వారం ఈ సీరియల్‌కు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబం, ముగ్గురు కొడుకులు, కోడళ్లు.. ఇద్దరు కొడుకులు, కూతుళ్లని బాగా చూసే తల్లి.. కుటుంబం కోసం కష్టపడే కొడుకు, కోడలి చుట్టూ ఈ సీరియల్ నడుస్తుంది. ఇందులో బాలు, మీనా అనే పాత్రలది లీడ్ రోల్స్. బాలుగా విష్ణుకాంత్ నటించారు. ఈ పాత్రలో ఒదిగిపోయిన ఆయనను అందరూ అసలు పేరు పక్కనపెట్టి బాలు అనే పిలుస్తారు. మాస్ లుక్‌తో, చదువులేని కుర్రాడిగా, ఆవేశంతో ఊగిపోతూ, నాన్నంటే పంచ ప్రాణాలు పెట్టుకునే కొడుకుగా అద్భుతంగా జీవించారు విష్ణుకాంత్. అతని భార్య మీనాగా బుల్లితెర నటి అమూల్య గౌడ చక్కని పాత్ర పోషిస్తున్నారు.

Gundeninda Gudigantalu Fame Prabhavathi and Balu got emotional at Aadivaram With Star Maa Parivaaram show

Photo Courtesy: JioHotstar

గయ్యాళి అత్తగా ప్రభావతి
ఇక ఈ సీరియల్‌లో సూర్యకాంతం లాంటి అత్తగారి పాత్ర పోషించారు మలయాళ నటి అనిలా శ్రీకుమార్. ముగ్గురు కొడుకుల్లో మనోజ్, రవి.. వారి భార్యలు రోహిణి, శృతిలను బాగా చూసుకుంటూ బాలు, మీనాలను మాత్రం రాచి రంపాన పెట్టే ప్రభావతి పాత్రలో అద్భుతంగా నటించారు అనిలా. తల్లి చేసే పనుల్ని తప్పుపడుతూ ఆమెపై సెటైర్లు వేస్తుంటాడు బాలు. బాలు ఎన్ని మంచి పనులు చేసినా తప్పుపడుతుంది ప్రభావతి. ఈ రెండు పాత్రలు ఢీ అంటే ఢీ అంటూ, కామెడీతో అలరిస్తుంటాయి. దాంతో ప్రభావతి ఎప్పుడు మారుతుంది? బాలుని ఎప్పుడు బాగా చూసుకుంటుంది? మీనాని ఎప్పుడు ఆదరిస్తుంది అని ఎదురు చూస్తున్నారు గుండెనిండా గుడిగంటలు సీరియల్ అభిమానులు. వారి కోరిక తీర్చింది స్టార్ మా.

స్టార్ మా పరివారంలో ప్రభావతి, బాలు సందడి
స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమానికి అనీలా శ్రీకుమార్, విష్ణుకాంత్‌లు.. అదేనండి మన బాలు, ప్రభావతిలు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఓ అవార్డ్‌ను అనీలాకు స్వయంగా అందజేశారు విష్ణుకాంత్. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ.. నా కొడుకు చేతుల మీదుగా అవార్డ్ తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఇంతలో శ్రీముఖి వచ్చి.. పిల్లలకి మాయమాటలు చెప్పి గోరుముద్దలు తినిపిస్తారు.. మీకు అలాంటి అవకాశం బాలుతో కలగలేదని అంటుంది. దాంతో అనిలా చేతిలో భోజనం ప్లేట్ పెట్టి తినిపించమని చెబుతుంది శ్రీముఖి. బాలు, ప్రభావతి కలిసిపోతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో స్కిట్ చేయమన్నట్లుగా ప్రోమోను బట్టి తెలుస్తోంది.

ఎందుకమ్మా నేనంటే అంత పగ
దాంతో శ్రీముఖి చెప్పినట్లుగానే అనీలా, బాలులు ఓ సీన్ చేస్తారు. నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మా.. నీ ప్రేమ మనోజ్, రవి అందరిపై చూపిస్తున్నావ్. కానీ నువ్వు నా మీద ఎప్పుడూ చూపించలేదు అని తల్లిని అడుగుతూ ఎమోషనల్ అవుతాడు బాలు. దానికి ప్రభావతి బదులిస్తూ.. నాకు నీ మీద ప్రేమ లేదని అనిపిస్తుందా? నువ్వంటే నాకు ప్రాణం అంటూ గోరుముద్దలు తినిపిస్తూ ఏడుస్తుంది ప్రభావతి. ఆ సీన్‌కు యాంకర్ శ్రీముఖితో పాటు కంటెస్టెంట్స్ అంతా కంటతడి పెడతారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. నిజంగా గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో బాలు, ప్రభావతి కలిసిపోతే ఎంత బాగుండు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X