Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. ఏమిటంటే?
Gundeninda Gudigantalu: తెలుగు బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీరియల్ 'గుండె నిండా గుడి గంటలు'. కుటుంబ కథా నేపథ్యంతో, సహజమైన భావోద్వేగాలతో, ప్రతి ఇంట్లో జరిగే చిన్నచిన్న సంఘటనలను ప్రతిబింబిస్తూ ముందుకు సాగుతున్న ఈ సీరియల్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతూ, జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరియల్ ప్రతిరోజూ మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ సీరియల్ ప్రేక్షకులకు స్టార్ మా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటీ?
సత్యం-ప్రభావతి కుటుంబం చుట్టూ తిరిగే కథ, బాలు-మీనా మధ్య జరిగే భావోద్వేగ సన్నివేశాలు, కోడళ్ళు-కొడుకుల మధ్య అనుబంధాలు, ఇవన్నీ కలిసి 'గుండె నిండా గుడి గంటలు'ను అచ్చ తెలుగు ఇంటి కథగా మార్చాయి. అందుకే ఈ సీరియల్ పాత్రలు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయి. ముఖ్యంగా బాలు పాత్రలో విష్ణుకాంత్, మీనా పాత్రలో అమూల్య గౌడ తమ సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాగే 'గుండె నిండా గుడి గంటలు' ఇప్పుడు మరింత స్పెషల్ అవుతోంది. ఈ గుడ్ న్యూస్‌ను సీరియల్ టీమ్ ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించింది.

ఆ శుభవార్త ఏమిటంటే? గుండె నిండా గుడి గంటలు ఇప్పటికి వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి రాత్రి 9.00 నుంచి 9.30 వరకు ప్రసారం అయ్యేది. ఇక ఇప్పటి నుంచి సోమవారం నుంచి రాత్రి 9.00 నుంచి 9.45 వరకు ప్రసారం కానుంది. ఇప్పటివరకు రోజూ అరగంట మాత్రమే వచ్చే ఈ ఫ్యామిలీ డ్రామా, ఇకపై అదనంగా 15 నిమిషాలు ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ గుడ్ న్యూస్‌ను సీరియల్ టీమ్ ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించింది.
అందులో మీనా, బాలు సహా మనోజ్, రోహిణి, రవి, శృతి, సత్యం, ప్రభావతి పాత్రలు పోషిస్తున్న నటీనటులు డ్యాన్స్ చేస్తూ అభిమానులతో ఈ ఆనందాన్ని పంచుకున్నారు. 'మన ఈవెనింగ్స్ ఇప్పుడు మరింత స్పెషల్... ఈ సోమవారం నుంచి గుండె నిండా గుడి గంటలు 45 నిమిషాల మెగా ఎంటర్‌టైన్‌మెంట్ రైడ్' అంటూ స్టార్ మా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అప్‌డేట్ వైరల్ అయింది.
పొదరిల్లు కూడా 45 నిమిషాలు
ఇటీవలే స్టార్ మా లైనప్‌లో చేరిన పొదరిల్లు కూడా ఇదే బాటలో నడవనుంది. సోమవారం నుంచి ఈ సీరియల్ రాత్రి 9.45 నుంచి 10.30 వరకు ప్రసారం కానుంది. అంటే వరుసగా రెండు సీరియల్స్ కలిపి గంటన్నర పాటు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ను అందించబోతున్నాయి. 'మనందరికీ సూపర్ ఎక్సైటింగ్ న్యూస్... పొదరిల్లును ఇప్పుడు 45 నిమిషాల ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చబోతున్నాం' అంటూ ఛానెల్ మరో వీడియో విడుదల చేసింది.
ఈ సీరియల్ కథ... ఆడదిక్కు లేని ఓ కుటుంబంలోకి ఓ అమ్మాయి కోడలిగా అడుగుపెట్టి ఎదుర్కొనే సవాళ్లు, భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ఇలా స్టార్ మా సీరియల్ అభిమానులకు ఇది నిజంగానే బంపర్ న్యూస్. ఇక ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచే మొదలయ్యే ఈ మెగా టెలివిజన్ రైడ్‌ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే!


Click it and Unblock the Notifications











