Gundeninda Gudigantalu Weekly: రోహిణిపై మనోజ్‌కు డౌట్.. తల్లికి దిమ్మతిరిగే షాకివ్వబోతున్న బాలు

చాలా కాలం నుంచే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ జరిగిన 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే లుక్కేయండి మరి!

01వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
01వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. మనోజ్, రోహిణి ఇంటికి రావడంతో వాళ్లకు హారతి ఇచ్చేందుకు ప్రభావతి రెడీ అవుతుంటుంది. అంతలోనే సుశీల చెప్పడంతో మీనా హారతి ఇవ్వబోతుంది. అది చూసిన ప్రభావతి ఆమెను తిట్టబోతుంది. అప్పుడు సుశీల వార్నింగ్ ఇవ్వడంతో ఆగిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వర్ధన్ ఆస్పత్రిలో ఉంటాడు. అతడు కోమాలోకి వెళ్లిపోవడంతో పోలీసులు విచారణ ప్రారంభిస్తారు. వర్ధన్ చివరిగా బాలు కారు ఎక్కాడని చెప్పడంతో అతడి దగ్గరకు వెళ్తారు. అక్కడ బాలు జరిగింది అంతా చెప్తాడు. దీంతో రోహిణి, పూజ తెగ కంగారు పడిపోతుంటారు.

Gundeninda Gudigantalu Last Week roundup story July 1st To 5th Episodes highlights

02వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
02వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వర్ధన్ క్యాబ్ డీటేల్స్ చూసి బాలు కోసం వచ్చిన పోలీసులకు అతడు అసలు నిజం చెప్తాడు. ఒక అమ్మాయిని ఏడిపిస్తుండడం వల్లే కొట్టానని అంటాడు. అప్పుడే పోలీసులకు వర్ధన్ ఎక్కువగా కాల్ చేసిన నెంబర్ దొరుకుతుంది. దానికి కాల్ చేయగా రోహిణి ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు అందరూ ఆమెపై డౌట్ పడతారు. దీంతో వర్ధన్ వాళ్ల భార్య మేకప్ కోసం కాల్ చేసిందని అబద్దం చెప్తుంది. కానీ, బాలు వాళ్లకు డౌట్ వస్తూనే ఉంటుంది. తర్వాత పూజ వెళ్లి వర్ధన్ గురించి ఎంక్వైరీ చేసి రోహిణికి చెప్తుంది. ఇక, బాలు, మీనా మధ్య చిన్నగా రొమాన్స్ ప్రారంభం అవుతుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Gundeninda Gudigantalu Last Week roundup story July 1st To 5th Episodes highlights

03వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

03వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలు చేయాలంటే పుట్టింటి వాళ్లు ఉండాలని సత్యం అనడంతో రోహిణి మా అమ్మ వస్తుంది అని నోరు జారుతుంది. దీంతో అందరూ షాక్ అవుతూ మీ అమ్మ లేదని అన్నావుగా అంటారు. దీంతో ఆమె అత్తగారినే అమ్మ అని కవర్ చేస్తుంది. తర్వాత మనోజ్, రోహిణితో కొన్ని ఆటలు ఆడిస్తారు. అప్పుడు బాలు, ప్రభావతి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. అనంతరం బాలు, మీనా ఏమైనా అంటే చెప్పమని రోహిణితో ప్రభావతి చెబుతుంది. అలాగే, వాళ్ల గురించి చెడుగా చెప్తుంది. ఇక, మీనా, తన భర్తతో ఆటలు ఆడినట్లు ఊహించుకుంటుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

04వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

04వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పువ్వుల దండలు ఆర్డర్ రావడంతో మీనాకు పూలు ఇచ్చేందుకు వాళ్ల బంధువులు వస్తారు. అప్పుడు వాళ్లను ప్రభావతి దారుణంగా అవమానిస్తుంది. అంతేకాదు, మీనాను కూడా తిడుతుంది. తర్వాత ఆమెకు మీనా ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఇక, మనోజ్, రోహిణికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసిన మీనా, బాలుకు కూడా చేద్దామని సత్యం అంటే ప్రభావతి ఒప్పుకోదు. ఇక, శోభనం గదిలోకి వెళ్లిన తర్వాత మనోజ్, రోహిణి మీద డౌట్లు పడతాడు. దీంతో ఆమె అబద్దాలు చెప్పి తప్పించుకుంటుంది. అనంతరం బాలు మందు తాగేందుకు ప్లాన్లు వేయగా.. ప్రభావతి షాక్ ఇస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Gundeninda Gudigantalu Last Week roundup story July 1st To 5th Episodes highlights

28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో

28వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. బాలు మందు తాగుతున్నాడని తెలుసుకున్న సుశీల కోపంతో పైకి వెళ్తుంది. అప్పుడామె అతడి దగ్గర ఉన్న మందు బాటిల్ తీసుకుని గుటగుటా తాగేస్తుంది. అప్పటి నుంచి మత్తులో ఆమె ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అంతేకాదు, ప్రభావతిని గట్టిగా పిలుస్తుంది. దీంతో ఆమె పైకి వస్తుంది. అప్పుడు ప్రభావతితో డ్యాన్స్ చేయిస్తుంది. అలాగే, మనోజ్, రోహిణిని ఫస్ట్ నైట్ గదిలో నుంచి బయటకు పిలిచి బాలు, మీనాను లోపలికి పంపాలని ప్రయత్నిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఉదయాన్నే ప్రభావతి.. అత్త సుశీలపై విరుచుకుపడుతూ గట్టిగా తిట్టేస్తుంది. ఈ ఎపిసోడ్ కోసం కింద లింక్‌పై క్లిక్ చేయండి.

Gundeninda Gudigantalu Last Week roundup story July 1st To 5th Episodes highlights

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే

జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ జరిగిన 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్‌ ఎన్నో ఊహించని సంఘటనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ వారంలో వర్ధన్ కోమాలో ఉండడానికి కారణం రోహిణి అన్న విషయాన్ని బయటపడేలా చూపించారు. కానీ, ఆమె తప్పించుకుంటుంది. ఆ తర్వాత వాళ్ల ఫస్ట్ నైట్, మనోజ్‌కు రోహిణి మీద డౌట్ రావడం ఇంట్రెస్టింగ్‌గా మారితే.. సుశీల మందు తాగడం కాస్త ఎంటర్‌టైనింగ్‌గా అనిపించాయి. ఇక, వచ్చే వారంలో బాలు ఆస్తిలో తన వాటాను అడగడంతో కథ రంజుగా మారబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X