Gundeninda Gudigantalu Weekly: మనోజ్ పెళ్లైన వెంటనే అతడి చావు.. బాలుకు అసలు నిజం తెలుస్తుందా?
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ జరిగిన 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
24వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
24వ తేదీ సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో.. రోహిణికి గతంలో పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని తెలుసుకున్న వర్ధన్.. ఆమెను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో రోహిణి ఆ విషయాన్ని వర్ధన్ భార్యకు చెబుతుంది. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. తర్వాత అతడి జాబ్ కూడా తీయించేస్తుంది. తర్వాత ఆమె పెళ్లి ఆపేందుకు వర్ధన్ బయలుదేరుతాడు. అప్పుడు బాలు కారు ఎక్కి ఫోన్ మాట్లాడుతుండగా.. అదంతా వింటాడు. తర్వాత వర్ధన్‌ను బాలు ఉరికించి కొడతాడు. అప్పుడు వర్ధన్ అతడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఇక, పెళ్లిలో ప్రభావతి.. మీనాను వాళ్ల ఫ్యామిలీని నోటికి వచ్చినట్లుగా తిడుతూ ఉంటుంది.

25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
25వ తేదీ మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లి పనులు చేయొద్దని అనడంతో మీనా బాధగా ఉంటుంది. అంతలోనే బాలు ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆమె మాటలు విని ఏదో బాధలో ఉందని అనుకుంటాడు. తర్వాత రోహిణి అందరి ముందు తండ్రి కోసం ఏడుస్తున్నట్లు నటిస్తుంది. అప్పుడు ప్రభావతి.. పార్వతమ్మను నోటికి వచ్చినట్లు తిడుతుంది. అంతలోనే అక్కడకు మీనా వచ్చి తన తల్లినే తిడుతుంది. తర్వాత సుశీల ఆమెను అక్కడి నుంచి తీసుకు వెళ్లిపోతుంది. ఇక, పీఏ వర్థన్ పెళ్లి ఆపాలని వస్తూ బాలు కారు ఎక్కుతాడు. అతడు మాటలు విన్న తర్వాత బాలు.. వర్థన్‌ను చితక్కొట్టుడు కొడతాడు.
26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
26వ తేదీ బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లి జరుగుతున్న సమయంలోనే బాలు వచ్చి తన భార్యను ఎందుకు అవమానించారని తల్లితో గొడవ పడతాడు. దీంతో మనోజ్ వచ్చి అతడి కాలర్ పట్టుకోవడంతో తాళిబొట్టును లాక్కుంటాడు. అప్పుడు ఎవరు బ్రతిమాలినా ఇవ్వనని తేల్చేస్తాడు. అప్పుడు బాలు తండ్రి ప్రశ్నించగా జరిగిన విషయం మొత్తం చెప్తారు. దీంతో ఆయన భార్యపై ఫైర్ అవుతాడు. తర్వాత మీనా వచ్చి బాలును బ్రతిమాలడంతో తాళిబొట్టును ఇచ్చేస్తాడు. దీంతో మనోజ్, రోహిణి పెళ్లి జరుగుతుంది. తర్వాత పంతులు వాళ్లకు పూజ చేయడంతో పాటు బాలు, మీనాతో పూల దండలు మార్పిస్తాడు.

27వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
27వ తేదీ గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పెళ్లి అయిపోయిన తర్వాత గుడి దగ్గరకు వచ్చిన వర్ధన్.. రోహిణిని చూసి షాక్ అవుతాడు. పెళ్లి ఆపాలనుకున్న కుదరకపోవడంతో ఫీల్ అవుతాడు. అప్పుడే రోహిణి టెన్షన్ పడుతూ ఉండగా మనోజ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఆమె మాత్రం అబద్దాలు చెప్పి తప్పించుకుంటుంది. తర్వాత వర్ధన్ ఫోన్ చేయగా తన రూమ్‌లోకి రమ్మంటుంది. అప్పుడు వచ్చిన వర్ధన్ ఆమెను బలవంతం చేయబోతే పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్ తలపై కొడుతుంది. దీంతో అతడు పడిపోతాడు. మరోవైపు, అందరూ పెళ్లి తర్వాత గుడి దగ్గరకు వెళ్లాలని చూస్తూ ఉంటారు. అప్పుడే రోహిణి కంగారుగా వస్తుంది.
28వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో
28వ తేదీ శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గుడికి వెళ్లడం కోసం మనోజ్ వాళ్లు ఎక్కేందుకు కారు ఉండదు. అప్పుడు బాలు తన కారులో వాళ్లను ఎక్కించేందుకు ప్లాన్ చేస్తాడు. అప్పుడు వెటకారంగా ఎన్నో మాటలు అంటాడు. దీంతో అక్కడ ఉన్న తండ్రి చెప్పడంతో మనోజ్, రోహిణి తప్పక బాలు కారు ఎక్కుతారు. రోహిణి వాళ్లు దాడి చేయడంతో కళ్లు తిరిగి పడిపోయిన వర్ధన్‌కు స్పృహ వస్తుంది. దీంతో బయటకు పరుగున వచ్చి రోహిణి వాళ్లు ప్రయాణిస్తున్న కారును ఫాలో అవుతుంటాడు. తర్వాత అతడికి యాక్సిడెంట్ అవుతుంది. మరోవైపు, రోహిణికి మనోజ్, మీనాకు బాలు గుడిలో పూజలు చేస్తారు.

ఈ వారంలో హైలైట్ అయింది ఇదే
జూన్ 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ జరిగిన 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్‌లో మనోజ్, రోహిణి పెళ్లిని బాగా హైలైట్ చేశారు. అయితే, ఆ సమయంలో గొడవ జరగడంతో బాలు పెళ్లి జరగకుండా ఆపాలని ప్రయత్నించడంతో కాస్త టెన్షన్ పెట్టారు. కానీ, మీనా కలుగజేసుకోవడంతో పెళ్లి జరిగిపోయింది. కానీ, రోహిణి.. వర్ధన్‌పై దాడి చేయడం కలవరం రేపింది. ఆ తర్వాత అతడికి మరోసారి యాక్సిడెంట్ అవడం.. అతడు చనిపోయినట్లుగా చూపించడంతో సీరియల్‌లో సస్పెన్స్ కనిపించింది. దీంతో వచ్చే వారం ఈ సీరియల్ మరింత రంజుగా సాగబోతుంది.


Click it and Unblock the Notifications











