Gundeninda Gudigantalu July 23th Episode: రాజేశ్‌ను అవమానించిన మనోజ్.. బాలు, మీనా, శృతి తిరుగుబాటు!

Gundeninda Gudigantalu:'గుండె నిండా గుడి గంటలు' బుధవారం ఎపిసోడ్‌లో మీనాను వేధించిన రూ.9 లక్షల మోసం వ్యవహారానికి ఎట్టకేలకు ముగింపు పలికింది. బాలు వేసిన తెలివైన ప్లాన్‌తో చింతామణి, ఫంక్షన్ హాల్ మేనేజర్ గుడి వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిపడ్డారు. ఫంక్షన్ హాల్ ఓనర్ ఎదుట మేనేజర్ నిజం ఒప్పుకుని, చింతామణితో కలిసి అగ్రిమెంట్ మార్చి రూ.9 లక్షలు కాజేయాలని ప్రయత్నించినట్లు అంగీకరించాడు. దీంతో మీనా చింతామణికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఫంక్షన్ హాల్ ఓనర్ కూడా చింతామణిని తీవ్రంగా మందలించి, ఇకపై తన హాల్‌లోని అన్ని డెకరేషన్ ఆర్డర్లు మీనాకే ఇస్తానని ప్రకటించాడు. బాలు కూడా మరోసారి తన భార్య జోలికి వస్తే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు.

ఇంటికి వచ్చిన తర్వాత బాలు, మీనా సాధించిన విజయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మీనా రూ.10 లక్షల డెకరేషన్ ఆర్డర్‌ను విజయవంతంగా పూర్తి చేసి, తన డబ్బు తిరిగి తెచ్చుకున్నట్లు చెప్పడంతో అందరూ ఆనందించారు. అయితే ప్రభావతి మాత్రం ఈ విజయాన్ని జీర్ణించుకోలేక అసహనంతో కనిపించింది. చివర్లో మీనా ఫైనాన్సర్ సింగరాజుకు అప్పు తీర్చేసింది. ఆమె నిజాయితీని మెచ్చుకున్న సింగరాజు, ఇకపై అవసరమైతే వడ్డీ లేకుండా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. మరోవైపు అవమానంతో రగిలిపోతున్న చింతామణి కొత్త కుట్రకు సిద్ధమవుతుందా? సింగరాజు-చింతామణి మధ్య గతంలో ఏం జరిగింది? అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

Gundeninda Gudigantalu serial episode 733 July 23th 2026 here is full story

photo courtesy jio hotstar

'గుండె నిండా గుడి గంటలు' గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఒకవైపు మీనా జీవితంలో కొత్త ఆశలు చిగురించగా.. మరోవైపు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో జరిగిన పరిణామాలు కొత్త ఉద్రిక్తతలకు దారితీశాయి. చింతామణి చేసిన మోసం మొత్తం బయటపడిన తర్వాత మీనా ఫైనాన్సర్ సింగరాజును కలిసి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తుంది. మీనా నిజాయితీని చూసిన సింగరాజు ఆమెను అభినందిస్తాడు. "ఒక ఆడపిల్ల ధైర్యంగా వ్యాపారం చేస్తుంటే ఆమెకు అండగా నిలబడటం కూడా నా బాధ్యతే" అని సింగరాజు అంటాడు. ఇకపై ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా భయపడొద్దని, ఎంత డబ్బు అవసరమైనా ఎలాంటి మొహమాటం లేకుండా తనను సంప్రదించమని భరోసా ఇస్తాడు.

చింతామణి లాంటి వాళ్లను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలని సింగరాజు సూచిస్తాడు. "చింతామణిని ఢీకొట్టడానికి ఎంత సహాయం కావాలన్నా చేస్తాను. ఇకపై పెద్ద పెద్ద డెకరేషన్ ఆర్డర్లు తీసుకో" అంటూ మీనాలో ధైర్యం నింపుతాడు. సింగరాజు మాటలు విన్న మీనా భావోద్వేగానికి గురవుతుంది. డబ్బు ఆలస్యంగా ఇచ్చినందుకు ఇకపై సహాయం చేయరనుకున్నానని, కానీ మళ్లీ నమ్మకం ఇచ్చారని చెబుతూ జీవితాంతం ఈ సహాయం మర్చిపోలేనని కృతజ్ఞతలు తెలియజేస్తుంది. దానికి స్పందించిన సింగరాజు.. "డబ్బు తీసుకునేవాళ్లు, తిరిగి ఇచ్చేవాళ్లు ఎవరో నాకు బాగా తెలుసు. నీలాంటి నిజాయితీ ఉన్న వాళ్లకు సహాయం చేయడం నాకు సంతోషమే" అని చెప్పడం మీనాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

ఇంటికి వచ్చిన తర్వాత బాలు, మీనా ఇద్దరూ జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటారు. చదువు లేకపోవడం వల్లే అగ్రిమెంట్‌లో జరిగిన మోసాన్ని గుర్తించలేకపోయానని మీనా బాధపడుతుంది. అప్పుడు బాలు ఆమెకు ధైర్యం చెబుతాడు. "జీవితంలో ప్రతి అనుభవం మనకు ఒక పాఠం నేర్పుతుంది. అందరూ మంచివాళ్లే అనుకోవడం తప్పు. కొందరు స్వార్థం కోసం మోసం చేస్తారు. ఇకపై ప్రతి పేపర్, ప్రతి ఒప్పందం జాగ్రత్తగా చూసుకోవాలి" అని సూచిస్తాడు. బాలు మాటలు విన్న మీనా.. "మీరు నా వెంటే ఉన్నంత వరకు నాకు ఎలాంటి భయం లేదు. ఈ సమస్యలో కూడా మీ తెలివితేటల వల్లే మన డబ్బు తిరిగి వచ్చింది" అంటూ భర్తను ప్రశంసిస్తుంది. ఈ విజయాన్ని అందరికీ పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేశావు.. మరి నాకు ఏం ఇస్తావు అని బాలు సరదాగా అడుగుతాడు. వెంటనే మీనా నవ్వుతూ "మల్లెపూలు తెచ్చారా?" అని ప్రశ్నిస్తుంది. బాలు వెంటనే దాచిపెట్టిన మల్లెపూలను తీసి మీనాకు అందిస్తాడు. భర్త ఇచ్చిన ఆ చిన్న సర్‌ప్రైజ్‌కు మీనా ఎంతో సంతోషిస్తుంది. ఇద్దరూ ఆ క్షణాన్ని ఆనందంగా గడుపుతారు.

మరుసటి రోజు మనోజ్ పుట్టినరోజు కావడంతో రోహిణి ఉదయాన్నే అతనికి కొత్త దుస్తులు బహుమతిగా ఇచ్చి శుభాకాంక్షలు చెబుతుంది. అయితే మనోజ్.. "ఇది మాత్రమేనా? ఇంకో సర్‌ప్రైజ్ గిఫ్ట్ లేదా?" అని అడుగుతాడు. దానికి రోహిణి "సర్‌ప్రైజ్ ముందే చెబితే థ్రిల్ ఉండదు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది" అంటూ సస్పెన్స్‌లో పెడుతుంది. మనోజ్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు కుటుంబ సభ్యులంతా హాల్‌లో ఎదురుచూస్తుంటారు. బాలు తనదైన కామెడీ స్టైల్‌లో అన్నయ్యను ఆటపట్టిస్తూ విషెస్ చెబుతాడు. అయితే అందరూ విషెస్ చెబుతున్న సమయంలో మీనా మాత్రం వంటగదిలోకి వెళ్లిపోతుంది. అది చూసిన మనోజ్ అసలు విషయం తెలియక.. "నాలుగు రూపాయలు సంపాదించగానే మర్యాద మర్చిపోయింది. ఇప్పుడు కళ్లన్నీ నెత్తికెక్కాయి" అంటూ అనుచితంగా మాట్లాడతాడు.

మనోజ్ మాటలు విన్న బాలు వెంటనే స్పందిస్తాడు. "మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అతిగా మాట్లాడితే పళ్లు కూడా రాలిపోతాయి" అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు. అప్పటికే మీనా వంటగదిలో స్వీట్ తయారు చేసి తీసుకొస్తుంది. నిజం తెలిసిన తర్వాత కూడా మనోజ్ తన తప్పు ఒప్పుకోడు. రవి కూడా మనోజ్ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తాడు. శృతి అయితే "ఇలాంటి వాళ్లను రోట్లో వేసి పచ్చడి చేయాలి" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుంది. మనోజ్ కోసం రవి ప్రత్యేకంగా బర్త్‌డే కేక్ తెప్పిస్తాడు. కేక్ చూసి మొదట సంతోషించిన మనోజ్.. వెంటనే "ఇంత చిన్న కేక్ ఎందుకు? పెద్దది తెప్పించలేదా?" అంటూ వెటకారంగా మాట్లాడతాడు. అది విన్న బాలు తీవ్ర అసహనానికి గురవుతాడు. "ప్రేమతో తెచ్చిన బహుమతిని కూడా గౌరవించడం తెలియదా?" అంటూ మనోజ్‌పై మండిపడతాడు. అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా మీనా బాలును ఆపుతుంది. "ఈరోజు ఆయన పుట్టినరోజు. గొడవ వద్దు" అంటూ శాంతింపజేస్తుంది.

కేక్ కట్ చేసిన తర్వాత కూడా మనోజ్ ఎవరికి ఇవ్వకుండా "దాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయండి" అని నిర్లక్ష్యంగా చెప్పడంతో బాలు కోపంతో కేక్‌ను పాడు చేస్తాడు. ప్రేమతో సర్‌ప్రైజ్ చేసిన తమ్ముడినే మనోజ్ అవమానించడంతో ఇంట్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ప్రభావతి, సత్యం మనోజ్ పేరుతో ప్రత్యేక పూజ చేయించేందుకు ఆలయానికి వెళ్తారు. మరోవైపు మనోజ్ మాత్రం ఇంట్లోనే అందరికీ టిఫిన్ త్వరగా సిద్ధం చేయాలని ఆదేశాలు ఇస్తూ తన అహంకారాన్ని మరోసారి రూమ్ లోకి వెళ్లాడు.

ఇక మరోవైపు.. బాలు స్నేహితుడు రాజేష్ తన భార్యతో కలిసి అనుకోకుండా ఇంటికి వస్తాడు. వారిని చూసి బాలు ఆశ్చర్యపోతూ, "ఏంట్రా చెప్పకుండా ఇలా వచ్చావు?" అని అడుగుతాడు. అందుకు రాజేష్.. "మా అమ్మానాన్న కాశీ యాత్ర చేసి వచ్చారు. అక్కడి ప్రసాదం మీకు ఇవ్వాలని వచ్చాం" అని చెబుతాడు. ఆ మాటలు విన్న బాలు తన తల్లిదండ్రులను కూడా ఒకసారి కాశీతో పాటు పుణ్యక్షేత్రాలకు పంపించాలని మనసులో అనుకుంటాడు. అప్పటికే టిఫిన్ సమయం కావడంతో బాలు, మీనా కలిసి రాజేష్ దంపతులను భోజనం చేసి వెళ్లాలని బలవంతం చేస్తారు. మొదట వారు వద్దని చెప్పినా.. ఇంటికి వచ్చిన అతిథిని తినకుండా పంపడం మంచిది కాదని భావించిన మీనా ప్రేమగా కూర్చోబెట్టి టిఫిన్ పెడుతుంది.

అదే సమయంలో అక్కడికి వచ్చిన రోహిణి ఈ దృశ్యం చూసి అసహనం వ్యక్తం చేస్తుంది. "మనోజ్‌కు షోరూమ్‌కు వెళ్లాలి. ఆయనకు ముందుగా టిఫిన్ పెట్టకుండా వీళ్లకు ఎందుకు పెడుతున్నావు?" అని మీనాను ప్రశ్నిస్తుంది. దానికి మీనా ప్రశాంతంగా.. "ఇంటికి వచ్చిన అతిథులను తినకుండా పంపడం మన సంస్కారం కాదు. ఇంకో పది నిమిషాల్లో వాళ్లు వెళ్లిపోతారు. ఆ తర్వాత మనోజ్‌కు పెడతాను" అని సమాధానం చెబుతుంది. అయితే రోహిణి ఆ మాటలను అంగీకరించకుండా నేరుగా మనోజ్ దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని మరింత రెచ్చగొట్టేలా చెబుతుంది. దీంతో మనోజ్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు. "నాకు ముందు టిఫిన్ పెట్టకుండా బయటివాళ్లకు పెడతారా? ఇది నా ఇల్లా... లేక సత్రమా? ఎవరు పడితే వాళ్లు వచ్చి తినడానికి?" అంటూ పెద్దగా అరుస్తాడు. "నాకు పది నిమిషాలు ఆలస్యమైతే లక్షల రూపాయల నష్టం వస్తుంది" అంటూ తన వ్యాపారం గురించి గొప్పలు చెప్పుకుంటాడు.

మొదట బాలు, మీనా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మనోజ్ అరుపులు ఆగకపోవడంతో బాలు అతని గదిలోకి వెళ్లి.. "నా ఫ్రెండ్స్ టిఫిన్ చేస్తున్నారు. ఇంకో ఐదు నిమిషాల్లో వెళ్లిపోతారు. అప్పటి వరకు సైలెంట్‌గా ఉండు" అని కోరుతాడు. అయినా మనోజ్ వినకుండా మరింత గొడవ చేస్తాడు. ఈ మాటలన్నీ విన్న రాజేష్ తీవ్ర అసౌకర్యానికి గురవుతాడు. టిఫిన్ కూడా పూర్తిగా తినకుండా మధ్యలోనే లేచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు. మీనా, రవి, శృతి ఎంతో బతిమాలుతూ.. "కనీసం టీ తాగి వెళ్లండి" అని అడిగినా.. జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక రాజేష్ దంపతులు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు.

తిరిగి వచ్చిన బాలు తన స్నేహితుడు వెళ్లిపోయాడని తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. అదే సమయంలో మనోజ్ కిందికి వచ్చి.. "దరిద్రం పోయింది. ఎవరు పడితే వాళ్లు వచ్చి నా ఇంట్లో తినడానికి ఇది సత్రమా?" అంటూ మరోసారి నోరు జారుతాడు. ఆ మాటలు విన్న శృతి వెంటనే స్పందిస్తూ.. "మీరు ఇన్ని డిగ్రీలు చదివి, పెద్ద బిజినెస్ చేస్తున్నారని చెప్పుకుంటారు. కానీ ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించడం కూడా తెలియదా? ఇదేనా మీ సంస్కారం?" అంటూ ఘాటుగా నిలదీస్తుంది.

అయినా మనోజ్ తగ్గకుండా.. "నేను పెద్ద బిజినెస్‌మ్యాన్‌ని. నాకు ఐదు నిమిషాలు ఆలస్యమైతే లక్షల రూపాయల నష్టం వస్తుంది" అంటూ అహంకారంగా మాట్లాడుతాడు. దీంతో మీనా కూడా సహనం కోల్పోయి.. "నువ్వు చేసిన మోసాలు తెలిసినా ఈ ఇంట్లో ఉండనిచ్చాం. నీ కాపురం నిలబెట్టాలని అందరం ప్రయత్నించాం. దానికి ప్రతిఫలం ఇదా? ఇంటికి వచ్చిన అతిథిని అవమానించడం నీ సంస్కారమా?" అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది.

మనోజ్ ఇంకా అదే తీరు కొనసాగించడంతో బాలు ఆగ్రహంతో అతని దగ్గరకు వెళ్లి.. "టిఫిన్ ఇప్పుడే కావాలన్నావు కదా.. తిను" అంటూ బలవంతంగా నోట్లో టిఫిన్ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. అది చూసిన రోహిణి.. "ఏంటి.. నా భర్తను చంపేస్తారా?" అంటూ అరవగా.. శృతి ఆమెపై కూడా విరుచుకుపడుతుంది. "ఇప్పుడు భర్త గురించి మాట్లాడుతున్నావు. ఇంటికి వచ్చిన అతిథిని అవమానించడం కనిపించలేదా? 40 లక్షల మోసం చేసిన విషయం మర్చిపోయావా? మీ ఇద్దరికీ సిగ్గు, సంస్కారం ఏమైనా ఉన్నాయా?" అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఇక ఈ గొడవ తర్వాత ప్రభావతి ఎలా స్పందిస్తుంది? మనోజ్‌కు మద్దతు ఇస్తుందా.. లేక బాలు, మీనాల పక్షాన నిలుస్తుందా? రోహిణి మరోసారి కొత్త కుట్రకు తెరతీస్తుందా? అనే ఉత్కంఠతో రాబోయే ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X