Gundeninda Gudigantalu July 28th Episode: మనోజ్‌ను బకరా చేసిన రోహిణి..చింతామణికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్..!
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్‌లో వినోదం, భావోద్వేగాలు, ఉత్కంఠ అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మీనా ఫ్లవర్ బిజినెస్ కోసం బాలు చేసిన సహాయం నవ్వులు పూయించింది. మనోజ్‌తో పూలు గుచ్చించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. తాయిత్తు పోయిందని మనోజ్ పూలమాలలు చెడగొట్టడంతో బాలు తీవ్రంగా ఆగ్రహించాడు. సత్యం కూడా మనోజ్‌ను గట్టిగా మందలించాడు. మరోవైపు రవి పనిచేస్తున్న రెస్టారెంట్‌కు వెళ్లిన శోభ హోటల్‌ను కొనేస్తానంటూ నీతూకు బ్లాంక్ చెక్ ఇచ్చింది. దీంతో అవమానంగా భావించిన నీతూ ఆ చెక్కును చించి ఆమె ముఖంపై విసిరేసింది. ఇదే విషయాన్ని రవి ప్లాన్‌గా భావించిన నీతూ, అందరి ముందే అతడిని మందలించింది.
రవి తనకు ఏమీ తెలియదని చెప్పినా ఆమె నమ్మలేదు. మరోసారి ఇలా జరిగితే ఉద్యోగం నుంచి తీసేస్తానని హెచ్చరించింది. ఇక మటన్ కొట్టు మాణిక్యం తన మేనల్లుడి పెళ్లి కార్డు ఇవ్వడానికి విద్య ఇంటికి వచ్చాడు. రోహిణికి ప్రత్యేకంగా ఆహ్వానం ఇవ్వాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న రోహిణి తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ పెళ్లికి వెళ్లొద్దని విద్యను హెచ్చరించింది. మరోవైపు బాలు ఒక్కసారిగా తనపై చూపుతున్న ప్రేమ వెనుక అసలు కారణం కారు సర్వీసింగ్ అని మీనా తెలుసుకుని అతడిపై కోపం వ్యక్తం చేసింది. చివర్లో నీతూ చేసిన ఆరోపణలతో రవి తీవ్ర ఆవేదనకు గురవగా, తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తితో ఎపిసోడ్ ముగిసింది.

photo courtesy jiohotstar
గుండె నిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కారు సర్వీసింగ్‌కు వెళ్లడంతో బాలు ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. మీనా ఫ్లవర్ బిజినెస్ పనుల్లో బిజీగా ఉండగా, ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. వంటింట్లోకి వెళ్లి కూరలు తరిగి, చిన్న చిన్న పనులు చేస్తూ మీనాతో సరదాగా గడుపుతాడు. ఇద్దరి మధ్య ప్రేమగా మాటలు సాగుతుండగా బాలు కాస్త రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్తాడు. అదే సమయంలో తలుపు తట్టి అతని స్నేహితుడు రాజేష్ ఇంటికి వస్తాడు. దీంతో బాలు విసుగ్గా, "ప్రతి సారి కరెక్ట్ టైమ్‌కి ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు" అంటూ బయటకు వెళ్తాడు.
రాజేష్ ఒక శుభవార్త చెబుతాడు. ఓ రిచ్ లేడీ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తోందని, ఆమెకు త్వరగా డ్రైవింగ్ నేర్పిస్తే మంచి పారితోషికం ఇస్తానని చెప్పిందని వివరిస్తాడు. అయితే బాలు నవ్వుతూ, "డ్రైవింగ్ అంటే వంట కాదు. రెండు రోజుల్లో నేర్చేసే పని కాదు. అనుభవంతోనే వస్తుంది" అని అంటాడు. బాలు చెప్పిన మాటలు విన్న మీనా వెంటనే స్పందిస్తుంది. "వంట కూడా అంత ఈజీ కాదు. ప్రతి వంటకం శ్రద్ధగా చేయాలి. చిన్న తప్పు జరిగినా ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే వంటను తక్కువ చేసి మాట్లాడొద్దు" అంటూ కాస్త సీరియస్ అవుతుంది. దీంతో బాలు-మీనా మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరుగుతుంది. చివరికి ఇద్దరూ నవ్వుకుంటూ ఆ గొడవను ముగించేస్తారు.
మరోవైపు రోహిణి మాత్రం మనోజ్‌పై తన ప్రేమను చూపించడానికి ఓ కొత్త నిర్ణయం తీసుకుంటుంది. అతని పేరుతో టాటూ వేయించుకోవాలని అనుకుంటుంది. అందుకోసం తన తల్లి ఇంటికి వెళ్తుంది. అక్కడ పచ్చబొట్టు వేయించుకునేందుకు సిద్ధమవుతుంది. అయితే ఆమె తల్లి సుగుణమ్మ మాత్రం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. "శరీరంపై టాటూ వేయించుకున్నంత మాత్రాన ప్రేమ నిరూపితం కాదు. నువ్వు చేస్తున్న అబద్ధాలు ఎప్పటికైనా బయటపడతాయి. ఆ రోజు ఈ టాటూ కూడా నిన్ను కాపాడదు" అంటూ కూతురిని హెచ్చరిస్తుంది. కానీ రోహిణి మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గదు. "నా గురించి నిజం బయటపడే ఛాన్స్ లేదు. మనోజ్ ఎప్పుడూ నా వైపే ఉంటాడు" అంటూ ధైర్యంగా చెబుతుంది.
పక్కనే ఉన్న విద్య కూడా రోహిణికి హితవు చెబుతుంది. "ప్రతి అబద్ధానికి ఒక ముగింపు ఉంటుంది. నిజం ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది. ఆ రోజును కూడా ఆలోచించు" అని సూచిస్తుంది. అయినప్పటికీ రోహిణి తన నిర్ణయాన్ని మార్చుకోదు. అదే సమయంలో మనోజ్ ఫోన్ చేస్తాడు. మొదట రోహిణి కాల్ ఎత్తదు. ఫోన్ ఎత్తమని విద్య చెప్పడంతో మాట్లాడుతుంది. మనోజ్ "ఎక్కడ ఉన్నావు?" అని అడగగా, "నేను బ్యూటీ పార్లర్‌లో ఉన్నాను" అంటూ అబద్ధం చెబుతుంది. కానీ టాటూ వేస్తుండగా నొప్పితో ఒక్కసారిగా అరవడంతో మనోజ్ కంగారుపడతాడు. "ఏమైంది?" అని ఆందోళనగా అడుగుతాడు. వెంటనే రోహిణి, "ఏమీ కాదు... అంతా బాగానే ఉంది" అంటూ మళ్లీ అబద్ధంతో పరిస్థితిని కప్పిపుచ్చుతుంది.
ఇదే సమయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మనోజ్ అసిస్టెంట్ బాలాజీ ఫోన్ చేసి, "సార్... మీరు చెప్పిన బ్లాక్ బుక్స్ మేడమ్‌కి ఇవ్వడానికి పార్లర్‌కి వెళ్లాను. కానీ మేడమ్ అక్కడ లేరు" అని చెబుతాడు. ఆ మాటలు విన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కాసేపటి క్రితమే పార్లర్‌లో ఉన్నానని చెప్పిన రోహిణి, అక్కడ లేకపోవడం అతనిలో అనుమానాలను పెంచుతుంది. వెంటనే "అయితే ఎక్కడ కనిపించింది?" అని బాలాజీని ప్రశ్నిస్తాడు. దానికి బాలాజీ, "గంట క్రితం ఒక వీధిలోని ఇంట్లోకి మేడమ్ వెళ్లడం నేను చూశాను" అంటూ పూర్తి వివరాలు చెబుతాడు. దీంతో మనోజ్ మనసులో సందేహాలు మరింత పెరుగుతాయి. "నాకు ఎందుకు అబద్ధం చెప్పింది? ఎక్కడికి వెళ్లింది? ఏం దాచిపెడుతోంది?" అంటూ ఆలోచనల్లో పడిపోతాడు.
మరోవైపు.. బాలు స్నేహితుడు రాజేష్ మాత్రం ఉదయం నుంచే డ్రైవింగ్ నేర్చుకునేందుకు వచ్చే రిచ్ లేడీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. "ఉదయాన్నే వస్తానని చెప్పింది. అందుకే వెయిట్ చేస్తున్నా" అని బాలు వద్ద చెబుతాడు. బాలు కూడా, "సరే... నేను లోపల నుంచి కావాల్సినవి తీసుకొస్తాను" అంటూ ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడే అక్కడికి చింతామణి కారులో వస్తుంది. డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఆ రిచ్ లేడీ ఆమెనే అని రాజేష్‌కు తెలియదు. ఎంతో మర్యాదగా మాట్లాడడం మొదలుపెడతాడు. "ఇది ఎవరి డ్రైవింగ్ స్కూల్?" అని చింతామణి అడగగా, "మా ఫ్రెండ్‌ది. నేను కూడా ఇక్కడే పని చేస్తున్నాను" అంటూ గొప్పగా చెప్పుకుంటాడు.
ఇంతలో బాలు, మీనా ఇద్దరూ బయటకు వస్తారు. చింతామణిని చూసిన వెంటనే బాలు నవ్వుతూ, "అరే... డ్రైవింగ్ నేర్చుకునే కస్టమర్ మీరేనా?" అని అడుగుతాడు. ఒక్కసారిగా చింతామణి షాక్‌కు గురవుతుంది. "ఏంటి... ఈ డ్రైవింగ్ స్కూల్ మీదేనా?" అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంది. దానికి బాలు తనదైన స్టైల్‌లో, "అవును... మీరు బిజినెస్‌లో పోటీ తట్టుకోలేక మీనాను తొమ్మిది లక్షల రూపాయలు మోసం చేసిన ఇల్లు ఇదే" అంటూ సెటైర్ వేస్తాడు. మీనా కూడా తగ్గదు. "మీ నాట్య గురువు ప్రభావతి ఇంటి ఇదే. నా గురించి చాడీలు చెప్పడానికి వెళ్లేది కూడా మీరే కదా" అంటూ చింతామణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.
వెంటనే చింతామణి, "ఇలాంటి వాళ్ల దగ్గర నాకు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే మీనా ఆమెను ఆపేస్తుంది. "నేను మిమ్మల్ని ఎప్పుడూ పోటీగా చూడలేదు. కానీ మీరు మాత్రం నన్ను దెబ్బతీయాలని చూశారు. విచిత్రం ఏంటంటే... మీరు చేసిన మోసం వల్లే నాకు ఇంకా ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్‌లో పెద్ద చెట్టులా ఎదిగిపోయాను" అంటూ ధైర్యంగా సమాధానం ఇస్తుంది. అయితే చింతామణి కూడా పొగరుగా, "నువ్వు ఇంకా గడ్డిపరకవే. నా స్థాయికి రావాలంటే చాలా దూరం ఉంది" అంటూ అవమానించేలా మాట్లాడుతుంది. అప్పుడు బాలు రంగంలోకి దిగుతాడు. "మీరు చేసిన మోసం మొత్తం నా దగ్గర, రవి దగ్గర ఫోన్ రికార్డింగ్‌లో ఉంది. ఒకసారి సోషల్ మీడియాలో పెడితే మీ అసలు రంగు అందరికీ తెలుస్తుంది" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.
అయినా చింతామణి తన అహంకారాన్ని తగ్గించదు. "మీ అంతు చూస్తా" అంటూ వెళ్లబోతుంది. వెంటనే మీనా ఆమె దారిని అడ్డుకుంటుంది. "ఇక నుంచి ఇక్కడి నుంచి వెళ్లాలంటే కూడా నా పర్మిషన్ కావాలి. నేను ఇప్పటివరకు నీతో సైలెంట్‌గా ఉన్నాను. కానీ అనవసరంగా నా జోలికి వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే చూసావు. ఇంకోసారి నా జీవితంలో జోక్యం చేసుకుంటే అసలు వదలను" అంటూ మీనా మాస్ వార్నింగ్ ఇస్తుంది. మీనా ఆగ్రహం చూసి చింతామణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదంతా చూసిన రాజేష్ కూడా ఆగ్రహంతో, "ఈమెనేనా మీనాను తొమ్మిది లక్షల రూపాయలు మోసం చేసిన ఫ్రాడ్ లేడీ? ఇలాంటి వాళ్లకు డ్రైవింగ్ నేర్పించాలనుకున్నామా?" అంటూ అసహనం వ్యక్తం చేస్తాడు.
మరోవైపు రోహిణి టాటూ వేయించుకుని ఇంటికి బయలుదేరుతుంది. కానీ ఆమెపై అనుమానం వచ్చిన మనోజ్, అసిస్టెంట్ చెప్పిన అడ్రస్‌కు నేరుగా వెళ్తాడు. అచ్చం అదే సమయంలో రోహిణి కూడా ఇంటి తలుపు తీసుకుని బయటకు వస్తుంది. ఇద్దరూ ఎదురెదురుగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. రోహిణి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. "ఇక్కడే నిజం బయటపడిపోతుందేమో" అని కంగారుపడుతుంది. వెంటనే తన స్నేహితురాలు విద్యకు సైగ చేస్తుంది. విద్య కూడా పరిస్థితిని అర్థం చేసుకుని సుగుణమ్మను వెంటనే లోపలికి పంపిస్తుంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పుతుంది. మనోజ్ మాత్రం వరుసగా ప్రశ్నలు వేస్తాడు. "నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? పార్లర్‌లో ఉన్నానని ఎందుకు అబద్ధం చెప్పావు? అసలు ఏం దాచిపెడుతున్నావు?" అంటూ నిలదీస్తాడు.
అయితే రోహిణి ఏమాత్రం టెన్షన్ పడదు. "ఇప్పుడు కాదు... ఇంటికి వెళ్లాక అన్నీ చెబుతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం" అంటూ తెలివిగా మనోజ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్తుంది. దీంతో విద్య, సుగుణమ్మ ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. సుగుణమ్మ మాత్రం ఆందోళనగా, "ఒకరోజు ఇలా తప్పించుకోలేవు. నిజం బయటపడితే ఏం చేస్తావో?" అంటూ బాధపడుతుంది. విద్య కూడా రోహిణి భవిష్యత్తు గురించి కంగారు పడుతుంది. ఇంటికి చేరుకున్న తర్వాత మనోజ్ నేరుగా రోహిణిని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి మరోసారి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. "ఎందుకు అబద్ధం చెప్పావు? ఎక్కడికి వెళ్లావు?" అంటూ గట్టిగా అడుగుతాడు. అప్పుడు రోహిణి నెమ్మదిగా తన చేతిపై వేయించుకున్న టాటూను చూపిస్తుంది. ఆ టాటూలో మనోజ్ పేరు ఉండటాన్ని చూసిన అతడు ఒక్కసారిగా షాక్ అవుతాడు.
"మీ పుట్టినరోజున మీరు ఇచ్చిన టాటూ చెరిగిపోయింది. మీ ముఖంలో కనిపించిన బాధను మళ్లీ చూడాలని అనిపించలేదు. అందుకే జీవితాంతం చెరిగిపోని పర్మినెంట్ టాటూ వేయించుకున్నాను. ఇది నా ప్రేమకు గుర్తు" అంటూ రోహిణి భావోద్వేగంగా చెబుతుంది. ఆ మాటలు విన్న మనోజ్ కరిగిపోతాడు. "అనవసరంగా నిన్ను అనుమానించాను. నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా?" అంటూ ఆనందపడిపోతాడు. ఇలా మరోసారి రోహిణి తన అబద్ధంతో మనోజ్‌ను పూర్తిగా నమ్మించేలా చేస్తుంది. ఆ సంతోషాన్ని అందరికీ చెప్పాలని మనోజ్ కుటుంబ సభ్యులందరినీ హాల్‌లోకి పిలుస్తాడు. రోహిణి తనపై ఎంత ప్రేమ చూపిస్తోందో గొప్పగా చెబుతాడు.
అయితే బాలు మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేస్తాడు. "పులిహోర బాగా కలుపుతున్నావ్" అంటూ మనోజ్‌ను ఆటపట్టిస్తాడు. అంతేకాదు, "ప్రేమ అంటే టాటూలు వేయించుకోవడం కాదు. అవసరమైన సమయంలో తోడుగా నిలబడటం, కష్టాల్లో అండగా ఉండటమే నిజమైన ప్రేమ" అంటూ విలువైన మాట చెబుతాడు. బాలు చెప్పిన మాటలు ఒకవైపు ప్రేక్షకులను ఆలోచింపజేయగా, మరోవైపు రోహిణి మోసం ఎప్పుడు బయటపడుతుందో అనే ఉత్కంఠతో నేటి ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications