Gundeninda Gudigantalu June 26th: తాళిబొట్టు లాక్కున్న బాలు.. పెళ్లి చేసి మీనా.. ట్విస్ట్ ఇచ్చిన పంతులు
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
పెళ్లి పనులు చేయొద్దని అనడంతో మీనా బాధగా ఉంటుంది. అంతలోనే బాలు ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆమె మాటలు విని ఏదో బాధలో ఉందని అనుకుంటాడు. తర్వాత రోహిణి అందరి ముందు తండ్రి కోసం ఏడుస్తున్నట్లు నటిస్తుంది. అప్పుడు ప్రభావతి.. పార్వతమ్మను నోటికి వచ్చినట్లు తిడుతుంది. అంతలోనే అక్కడకు మీనా వచ్చి తన తల్లినే తిడుతుంది. తర్వాత సుశీల ఆమెను అక్కడి నుంచి తీసుకు వెళ్లిపోతుంది. ఇక, పీఏ వర్థన్ పెళ్లి ఆపాలని వస్తూ బాలు కారు ఎక్కుతాడు. అతడు మాటలు విన్న తర్వాత బాలు.. వర్థన్‌ను చితక్కొట్టుడు కొడతాడు.

తల్లిపై ఫైర్ అయిన బాలు
మీనాను ప్రభావతి దూరం పెడుతూ తిడుతుండడంతో బాలు తల్లిపై సీరియస్ అవుతాడు. అప్పుడు తండ్రితో 'నీ భార్య ఏమనుకుంటుంది? నా భార్యను నోటికి వచ్చినట్లు ఎందుకు తిడుతుంది' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు సుశీల అతడిని ఆపే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు బాలు 'ఈ పెళ్లి జరగనివ్వను. నేను బతికుండగా నా భార్య మీద మాట పడనివ్వను' అంటాడు. అంతలో మనోజ్ పీటల మీద నుంచి లేచి 'నా పెళ్లి ఆపడానికి నువ్వు ఎవరు' అంటాడు. అప్పుడు బాలు 'ఒరేయ్ దమ్ముంటే వెళ్లి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టరా' అని సవాల్ చేస్తాడు.
తాళిని లాగేసుకున్న బాలు
బాలు సవాల్ చేయగానే ప్రభావతి 'ఒరేయ్ నువ్వు వెళ్లి తాళి కట్టరా. ఎవరు ఆపుతారో చూద్దాం' అంటుంది. అప్పుడు అతడు కట్టబోతుంటే బాలు తాళిబొట్టును లాక్కుంటాడు. దీంతో తండ్రి వచ్చి అతడిని ప్రశ్నిస్తాడు. దీంతో బాలు 'నన్ను చేసుకున్న పాపానికి నా భార్య ఎందుకు మాటలు పడాలి. తను దరిద్రం అంట. నష్టజాతకురాలంట. ఈ పెళ్లిలో ఏమీ చేయకూడదంట' అంటూ తల్లి గురించి బయటపెడతాడు. అంతేకాదు, 'మీనా గురించి కాదు. మీనాను అన్నందుకు ఈ పెళ్లి ఆపుతున్నా' అని బాలు అంటాడు. దీంతో సత్యం భార్యను ప్రశ్నిస్తాడు.
ప్రభావతిపై సత్యం కోపం
సత్యం అడిగిన వెంటనే సుశీల 'అవునురా.. నీ భార్య మీనాను నోటికి వచ్చినట్లు మాట్లాడింది. అంతేకాదు, వాళ్ల అమ్మను తిట్టింది. కుటుంబం గురించి మాట్లాడింది' అని చెప్తుంది. అప్పుడు సత్యం భార్యపై సీరియస్ అవుతాడు. అంతేకాదు, పార్వతమ్మను తానే పెళ్లికి పిలిచినట్లు చెప్తాడు. ఆ తర్వాత బాలు తన తల్లి, మనోజ్‌ను తిడతాడు. అప్పుడు మనోజ్ వచ్చి బాలు కాలర్ పట్టుకుంటాడు. తర్వాత మీనా వచ్చి 'పీటల మీద పెళ్లి ఆగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ ఇప్పుడు మరో అమ్మాయి పడకూడదు' అంటూ భర్తకు నచ్చజెప్తుంది.

తప్పు చేసి తగ్గడం లేదు
మీనా భర్తతో మాట్లాడుతుండగా ప్రభావతి వచ్చి 'అబ్బా ఏం నంగనాచి కబుర్లు చెప్తున్నావే. మా మీద చెప్పాల్సినవన్నీ చెప్పి. ఇప్పుడు ఏం నటిస్తున్నావు' అని అంటుంది. దీంతో బాలు, సుశీల ఆమెపై సీరియస్ అవుతారు. అనంతరం సత్యం 'ఇప్పటి వరకూ బాలుదే తప్పు అనుకున్నా. కానీ, ఇప్పుడు నీది, నీ ముద్దుల కొడుకుది అని తెలిసింది' అంటాడు. అప్పుడు ప్రభావతి 'తప్పు చేసింది మీరు. ఆరోజు యాక్సిడెంట్ చేయడం వల్లే ఈ జనాలు నా ఇంట్లో చేరారు. నా మాట చెల్లకుండా చేస్తున్నారు' అంటుంది. తర్వాత పెళ్లి పందిరిలో పెద్ద గొడవలే జరుగుతాయి.
పశువులానే ప్రవర్తిస్తావా?
తర్వాత మీనా వచ్చి బ్రతిమాలినా బాలు తాళి ఇవ్వనని అంటాడు. అప్పుడు సుశీల 'లాగి పెట్టి చెంప పగలగొడతాను. మీ అమ్మ మనిషిలా ప్రవర్తించలేదని నువ్వు పశువులా ప్రవర్తిస్తావా' అని తిడుతుంది. తర్వాత మీనా దండం పెట్టి అడగడంతో బాలు తాళి ఇచ్చేస్తాడు. అప్పుడు సత్యం 'నువ్వు ఎవరి పరువు తీయాలని చూశావో.. ఆ అమ్మాయే నీ పరువు నిలబెట్టింది' అంటాడు. అనంతరం బాలు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో సత్యం, సుశీల వచ్చి బ్రతిమాలతారు. కానీ, బాలు వినడు. అనంతరం మీనా గురించి మాట్లాడి అతడిని ఆటపట్టించడంతో కూల్ అవుతాడు.

ఎవరు వద్దంటారో చూస్తా
అందరూ బ్రతిమాలడడంతో బాలు తిరిగి పెళ్లి దగ్గరకు వస్తాడు. అది చూసి ప్రభావతికి కోపం వస్తుంది. అప్పుడు కామాక్షి 'ఇప్పుడు నువ్వు ఏమన్నా అంటే వాడు పెళ్లిని ఆపేస్తాడు' అని బెదిరిస్తుంది. అనంతరం పంతులు 'ఎవరైనా వెళ్లి తాళి బొట్టును పెద్దలకు చూపించండి' అని చెప్తాడు. దీంతో సత్యం.. మీనాకు ఆ పని అప్పగిస్తాడు. అంతేకాదు, ఎవరు వద్దంటారో చూస్తాను అని చెబుతాడు. దీంతో మీనా తాళిబొట్టును తీసుకు వెళ్తుంది. ఆ తర్వాత మనోజ్, రోహిణి మెడలో తాళి కడతాడు. అనంతరం పంతులు గుడిలో పూజి చేసి ఆశీర్వదిస్తాడు.
ట్విస్ట్ ఇచ్చిన పంతులు
పూజ జరిగిన తర్వాత పంతులు రెండు పూల దండలు తీసుకుని వస్తాడు. దీంతో ప్రభావతి వాటిని తీసుకోమని మనోజ్ వాళ్లకు చెప్పగా.. పంతులు అవి బాలు, మీనాకు అని చెప్తాడు. అంతేకాదు, 'మీనా ఈ గుడిలో పెరిగిన పిల్ల. తను పూల దండ తీసుకు రాకపోతే గుడిలో ఏది జరిగేది కాదు' అని ఆమె గొప్పదనం చెబుతూ.. తన పెళ్లిని చూడాలని అనుకుంటాడు. తర్వాత బాలు, మీనా దండలు మార్చుకుంటారు. అనంతరం రోహిణి పీఏ గురించి టెన్షన్ పడుతుండగా మనోజ్ వస్తాడు. కానీ, ఆమె అబద్దం చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











