Guppedanta Manasu, August 10th episode: ధన్‌రాజ్‌ను లాగితే అంతా బయటకు.. సరోజ్ ప్లాన్
లెటర్ మనుకి చూపిస్తే బాబాయ్ ని మను చంపేస్తాడు తెలుసా అంటాడు శైలేంద్ర. మీరు అలా అనుకుంటున్నారు కానీ నిజం తెలిసిన తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకటైపోతారు, అప్పుడు నష్టపోయేది మీరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. అదీ నిజమే అనుకుంటాడు శైలేంద్ర. మరోవైపు రంగా కోసం బెంగపడుతుంది రాధమ్మ, నాతో చెప్పమని ఏమైనా చెప్పాడా అని బుజ్జిని అడుగుతుంది. త్వరలోనే వస్తానన్నాడు అంటాడు బుజ్జి. ఇంకెప్పుడు వస్తాడు, నా ప్రాణం పోయాకా అంటుంది రాధమ్మ.
అలా మాట్లాడతావేంటి నువ్వేమీ బెంగ పెట్టుకోకు నేను ఇప్పుడే బావకి ఫోన్ చేస్తాను అని చెప్పి రిషి కి ఫోన్ చేస్తుంది సరోజ. వసుధార ఫోన్ లిఫ్ట్ చేయటంతో షాక్ అవుతుంది. మా బావ నీ దగ్గర ఎందుకు ఉన్నాడు ఫోన్లో కాదు నీ సంగతి డైరెక్ట్ గా తేల్చుకుంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది సరోజ. తర్వాత విషయం రాధమ్మతో చెప్పి నాకెందుకో భయంగా ఉంది అమ్మమ్మ నేను వెళ్లి అసలు సంగతి కనుక్కుంటాను అంటుంది. ఎలా వెళ్తావు అంటుంది రాధమ్మ. బుజ్జి కి తెలిసే ఉంటుంది అంటుంది సరోజ.

అన్న ఇక్కడి నుంచి వెళ్లడం వరకే తెలుసు అడ్రస్ తెలియదు అంటాడు బుజ్జి. ధనరాజ్ ఉన్నాడు కదా వాడిని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అనుకుంటుంది సరోజ. మరోవైపు అనుపమ ఇంటికి వచ్చిన వసుధార మీరు మావయ్య ను వదిలేసి రావడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. అనుపమ మాట్లాడుతూ మను తండ్రి మహేంద్ర అని దేవయానికి తెలిసింది అని చెప్తుంది.


Click it and Unblock the Notifications











