Guppedanta Manasu, August 13th episode:రిషి ని ఫాలో అవుతున్న సరోజ.. నిజం చెప్పేస్తానంటూ శైలేంద్ర కి షాకిచ్చిన

నిజం తెలుసుకున్న తండ్రి తనని ఇంటి నుంచి బయటికి గెంటేసినట్లు కలకంటాడు శైలేంద్ర. మహేంద్ర వాళ్ళని వాళ్లతో పాటే ఉండిపోమని రిక్వెస్ట్ చేస్తాడు ఫణీంద్ర. కానీ వసుధార కి ఇష్టం లేకపోవడంతో అన్నగారి మాట కాదంటాడు మహేంద్ర. వాళ్ల పని పూర్తయిన వెంటనే రంగా ని పై లోకాలకు పంపించేయాలి అనుకుంటారు దేవయాని, శైలేంద్ర. మీ ఫ్రెండ్ ని చంపిన వాళ్లని మీ ముందు నిలబెడతాను అని అనుపమకి మాట ఇస్తాడు రిషి. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 13వ తేదీ ఎపిసోడ్ 1,153ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఈరోజు కాలేజీలో మీటింగ్ ఉంది, అంతా నేను అనుకున్నట్లే నేను అనుకున్నట్లే జరిగేలా దీవించమని, ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు శైలేంద్ర. అప్పుడే ధనరాజ్ సరోజని తీసుకొని అక్కడికి వస్తాడు. శైలేంద్ర కంగారుగా తనని ఎందుకు తీసుకొని వచ్చావు అని అడుగుతాడు. తనే నన్ను తీసుకువచ్చింది అంటాడు ధనరాజ్. సరే త్వరగా తీసుకొని వెళ్ళిపో అంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu August 13th 2024 Episode number 1153 Here is the Full story

ఎందుకు వెళ్లిపోవాలి, నేను మా బావ కోసం వచ్చాను అంటూ బావ అని పిలుస్తుంది సరోజ. ఆ పిలుపుకి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. ఎవరు నువ్వు, మీ బావ ఇక్కడ ఎందుకు ఉంటాడు అని అడుగుతాడు ఫణీంద్ర. ఇతను ఇక్కడే ఉన్నాడు కాబట్టి మా బావ కూడా ఇక్కడే ఉంటాడు పిలవండి అని శైలేంద్రని చూపిస్తుంది సరోజ. మీ బావ ఫోటో ఏదైనా ఉందా అని అడుగుతుంది ధరణి. ఉంది అని సరోజ ఫోటో చూపించే లోపు శైలేంద్ర మాట్లాడుతూ మీ బావ మీ ఊరు వెళ్ళిపోయాడు కావాలంటే ఫోన్ చెయ్యు అంటాడు.

ధనరాజ్ కూడా అదే చెప్తాడు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు పద అని చెప్పడంతో చేసేదిలేక అక్కడి నుంచి బయలుదేరుతుంది సరోజ. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లిపోయిన తర్వాత నువ్వు ఎండి అవటానికి కొద్ది గంటలు మాత్రమే ఉంది జాగ్రత్తని కొడుకుని హెచ్చరిస్తుంది దేవయాని. అవును మమ్మీ అందుకే కాలేజీకి వెళ్తున్నాను అంటూ బయలుదేరుతాడు శైలేంద్ర. మరోవైపు కారులో వెళ్తున్న రిషి ని ఎండి గారు ఎవరిని ప్రకటించబోతున్నారు అని అడుగుతుంది వసుధార.

Guppedanta Manasu August 13th 2024 Episode number 1153 Here is the Full story

అన్ని అర్హతలు ఉన్న నువ్వు ఎండిగా చేయమంటే ఒప్పుకోవటం లేదు, నాకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు నీ దృష్టిలో ఎవరైనా ఫలానా వాళ్లు ఎండి అయితే బాగుంటుందని అనుకుంటున్నావా అంటాడు రిషి. మీరు నన్ను కావాలనే ఆట పట్టిస్తున్నారు నేను హర్ట్ అయ్యాను కాలేజీకి రాను అని కారు దిగబోతుంది వసుధార. సరే అయితే నేను కూడా కాలేజీకి వెళ్లను, మా ఊరు వెళ్ళిపోతాను అంటాడు రిషి. అలా అనొద్దు అని అతని నోరు మూసేస్తుంది వసుధార.

రోడ్డుమీద వెళ్తున్న సరోజ రిషి వాళ్ళని చూసి ధనరాజ్ తో వాళ్ళని ఫాలో చేయమని చెప్తుంది. సరే వాళ్లని ఫాలో అవుతాడు ధనరాజ్. మీ బావ ఏమిటి ఎక్కడ ఉన్నాడు, రూపం కూడా మార్చేసినట్లు ఉన్నాడు అంటాడు ధనరాజ్. అంతా వసుధార వల్లే అని జరిగిందంతా చెప్తుంది సరోజ. ధనరాజ్ బండిని స్లోగా తీస్తున్నాడని అతడి ని కోప్పడి బండి తన్నే డ్రైవ్ చేస్తుంది సరోజ, ధనరాజ్ బైక్ ఎక్కలేదు అనే విషయం కూడా గమనించకుండా వెళ్ళిపోతుంది.

Guppedanta Manasu August 13th 2024 Episode number 1153 Here is the Full story

అసలు సరోజ నాకోసం వచ్చిందా వాళ్ళ బావ కోసం వచ్చిందా అని అనుమాన పడతాడు ధనరాజ్. మరోవైపు పాండు శైలేంద్ర కి ఫోన్ చేసి నేను మారిపోయాను మీ గురించిన నిజాలన్నీ పోలీసులకి చెప్పేసి లొంగిపోదాం అనుకుంటున్నాను అంటాడు. ఇదేంటి దరిద్రాలన్నీ ఈరోజే పట్టుకున్నాయి అనుకుంటాడు శైలేంద్ర. పోలీసులకు లొంగిపోవడం ఏమిటి అని కంగారుగా అడుగుతాడు. అవును సార్ ఇన్నాళ్లు చేసిన పాపాలు కడిగేసుకుందామనుకుంటున్నాను అందుకే ఆఖరి సారిగా మీతో మాట్లాడాలి అని ఫోన్ చేశాను అంటాడు పాండు.

Guppedanta Manasu August 13th 2024 Episode number 1153 Here is the Full story

సరే లొకేషన్ పంపించు నేను వస్తాను ఇద్దరం కలిసి పోలీసులకు లొంగిపోదాం అంటాడు శైలేంద్ర. సరే అని ఫోన్ పెట్టేస్తాడు పాండు. పాండుని తిట్టుకుంటూ రిషి ఎక్కడ ఉన్నాడో ఏంటో అని రిషికి ఫోన్ చేసి మీటింగ్ లో ఏం మాట్లాడాలో గుర్తుంది కదా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర. మరోవైపు బండి మీద వస్తున్న సరోజ రిషి వాళ్ళ కారుని మిస్ అవుతుంది. వాళ్ల కోసం వెతుకుతూ ఉంటే ధనరాజ్ వచ్చి నన్ను వదిలేసి వచ్చేయడం ఏమీ బాగోలేదు. అసలు నువ్వు నా కోసమే వచ్చావా అని అడుగుతాడు. నీకోసమే వచ్చాను మా అమ్మమ్మ బావ కోసం కంగారు పడుతుంటే వెతుకుతున్నాను అంతే అంటుంది సరోజ. సరే అయితే పదా ఇద్దరం కలిపి ఐస్ క్రీమ్ తిందాం అంటూ సరోజ ని తనతో తీసుకు వెళ్లిపోతాడు ధనరాజ్. మరోవైపు సరోజ హైదరాబాద్ వచ్చిన విషయం రిషి కి ఫో ఫోన్ చేసి చెప్తాడు బుజ్జి. ఫోన్ పెట్టేసిన తర్వాత విషయం ఏమిటి అని రిషిని అడుగుతుంది వసుధార. మా సరోజ హైదరాబాద్ వచ్చిందంట అంటాడు రిషి. మా సరోజ ఏంటి తను మీ సరోజ ఎప్పుడు అయింది అని రిషితో గొడవకు దిగుతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X