Guppedanta Manasu, August 14th episode: కిడ్నాప్ కి గురైన శైలేంద్ర.. మరో ఎండిని ప్రకటించబోతున్న వసుధార!

మహేంద్ర వాళ్ళని తమతో పాటే ఉండిపోమని రిక్వెస్ట్ చేస్తాడు ఫణీంద్ర. కానీ వసుధార కి ఇష్టం లేకపోవడంతో అన్నగారి మాట కాదంటాడు మహేంద్ర. వాళ్ల పని పూర్తయిన వెంటనే రంగా ని పై లోకాలకు పంపించేయాలి అనుకుంటారు దేవయాని, శైలేంద్ర. మీ ఫ్రెండ్ ని చంపిన వాళ్లని మీ ముందు నిలబెడతాను అని అనుపమకి మాట ఇస్తాడు రిషి. మరోవైపు సిటీకి వచ్చిన సరోజ ధనరాజ్ ద్వారా రిషి ఆచూకీ తెలుసుకోవాలనుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 14వ తేదీ ఎపిసోడ్ 1,154ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

మా సరోజ అంటున్నారు ఏమిటి తను మీ సరోజ ఎప్పుడు అయింది అని కోపంగా అంటుంది వసుధార. సరేలే వదిలేయ్ ఏదో ఫ్లోలో అని ఉంటాను అంటాడు రిషి. ఫ్లోలో కాదు మీరు ఫీలింగ్ తో అన్నట్లు ఉన్నారు అంటుంది వసుధార. తన మీద నాకు ఫీలింగ్స్ ఏంటి అంటాడు రిషి. నా ఫీలింగ్స్ పక్కన పెట్టు నువ్వెందుకు అంత జలస్ ఫీల్ అవుతున్నావు అని తిరిగి వసుధారని ప్రశ్నిస్తాడు. మీ విషయంలో నేను ఎప్పుడూ జలస్ గానే ఫీలవుతాను,ఒక భార్య తన భర్త వేరే అమ్మాయిని చూసినా, వేరే అమ్మాయి గురించి మాట్లాడినా తట్టుకోలేదు మరెప్పుడు మా సరోజ అనొద్దు అని గట్టిగా చెప్తుంది వసుధార.

Guppedanta Manasu August 14th 2024 Episode number 1150 Here is the Full story

సరే అంటాడు రిషి. మరోవైపు పాండు దగ్గరికి వస్తాడు శైలేంద్ర. అతని కోసమే వెయిట్ చేస్తున్న పాండు పదండి సార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగి పోదాం అంటాడు. నీకేమైనా మతి పోయిందా అలా మాట్లాడుతున్నావ్, అయినా నాకు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇన్నాళ్లుగా నేను కంటున్న కల ఈరోజు నిజం కాబోతుంది, నువ్వు దాన్ని చెడదొబ్బకు అంటూ పాండు పై ఫైర్ అవుతాడు శైలేంద్ర. అతను అలా మాట్లాడుతూ ఉండగానే అతడి మొఖానికి ముసుగు వేసి కిడ్నాప్ చేస్తారు పాండు మనుషులు. మరోవైపు కాలేజీకి టైం అవుతుంది మన పుత్ర రత్నం ఏడి అని భార్యని అడుగుతాడు ఫణీంద్ర.

తను పొద్దున్నే కాలేజీకి వెళ్లిపోయాడు అంటుంది దేవయాని. అంత పొద్దున్నే వెళ్లిపోవడం ఏమిటి కొంపతీసి తనే కాబోయే యండి అనుకుంటున్నాడా ఏంటి, కాలేజీ ఎండి సీట్ మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోకండి అని హెచ్చరిస్తాడు ఫణీంద్ర. తర్వాత తనతో పాటు కాలేజీకి వస్తానన్న భార్యని నువ్వు కాలేజీకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతుంది అందుకే కాలేజీకి రావద్దు అంటాడు ఫణీంద్ర.అయినా దేవయాని వినిపించుకోకుండా వస్తాను అంటుంది.

సరే అయితే నువ్వు వెళ్ళు నేను ఇంట్లోనే ఉండిపోతాను అంటాడు ఫణీంద్ర. అదేంటి అలా అంటారు మీరు మీటింగ్లో కచ్చితంగా ఉండాలి కదా అంటుంది దేవయాని. అందుకే నేను వెళ్తాను నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్ళిన తర్వాత నువ్వు కాలేజీకి వస్తే ఊరుకునేది లేదు, నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండు అని భార్యని హెచ్చరించి కాలేజీకి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. మరోవైపు వసుధార రిషితో మాట్లాడుతూ ఈ ఎండి సీటు వల్ల మన జీవితాలు తారుమారైపోతున్నాయి.

మనం ఎందుకు ఈ కాలేజీని వదులుకోకూడదు అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార అంటాడు రిషి. నిజమే సార్ ఈ ఎండి పదవి కోసం మీకేమైనా ప్రమాదం జరుగుతుందేమో అని నాకు భయంగా ఉంది, మన మధ్య ఏడబాటు రావడానికి, మీ మీద నేను అభియోగం మోపటానికి, అత్తయ్యకి అలా కావడానికి కారణం కూడా ఈ ఎండీ పదవే కారణం, ఇవన్నీ మీ అన్నయ్య ఫారెన్ నుంచి వచ్చిన తర్వాతే జరుగుతున్నాయి అంటుంది వసుధార. నాకు అన్నీ తెలుసు వసుధార అయినా నేను బంధాలకి బందీ అయిపోయాను ఏమీ చేయలేను.

అందుకే నేను రంగా లాగా మారిపోయాను, ఎందుకంటే రిషికి రక్త సంబంధం ఉంటుంది కానీ రంగాకి రక్తసంబంధం ఉండదు అంటూ మీటింగ్ కి టైం అయిందని వసుధార ని తీసుకొని మీటింగ్ కి వెళ్తాడు రిషి. మరోవైపు కిడ్నాప్ కి గురైన శైలేంద్ర తనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని,తనని విడిచిపెట్టమని గోల చేస్తూ ఉంటాడు. మరోవైపు మీటింగ్ లో కూర్చున్న మహేంద్ర రిషి వాళ్ళు రాలేదేంటి అని వేరే డైరెక్టర్ని అడుగుతాడు. వాళ్ళు వస్తున్నారు అని చెప్తాడు డైరెక్టర్. శైలేంద్ర రాలేదేంటి అని అన్నగారిని అడుగుతాడు మహేంద్ర.

ఏమో వాడు కాలేజీకి పొద్దున్నే బయలుదేరాడంట ఏం పెత్తనాలు చేస్తున్నాడు ఏంటో అంటాడు ఫణీంద్ర. అంతలోనే రిషి వాళ్ళు వస్తే వాళ్ళని శైలేంద్ర గురించి అడుగుతాడు ఫణీంద్ర. తనకేమీ తెలియదని తనని త్వరగా రమ్మని ఫోన్ చేశాడని చెప్తాడు రిషి. మరోవైపు శైలేంద్రని కిడ్నాప్ చేయించిన వ్యక్తి పాండు కి డబ్బులు ఇస్తాడు. శైలేంద్ర చాలాసార్లు మాకు పని అప్పగించాడు కానీ ఏ పని సరిగ్గా చేయలేదు మొదటిసారిగా మీరు చెప్పిన పని మేము సక్సెస్ఫుల్గా చేసాము అందుకే మాకు ఈ డబ్బు వద్దు మీరే ఉంచుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు పాండు.

మరోవైపు కాలేజీలో సిచువేషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం శైలేంద్ర కి ఫోన్ చేస్తుంది దేవయాని. కిడ్నాప్ చేయించిన వ్యక్తి ఆ ఫోన్ కట్ చేస్తాడు, రిషి కూడా శైలేంద్ర కి ఫోన్ చేస్తాడు కానీ ఆ ఫోన్ కూడా కట్ చేస్తాడు ఆ వ్యక్తి. నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు, అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావు అసలు ఎవరు నువ్వు నీ మొహం చూపించు అంటాడు శైలేంద్ర. మొహం మీద ఉన్న మూసుకొని తీస్తాడు కిడ్నాప్ చేసిన వ్యక్తి. శైలేంద్ర ఆ వ్యక్తి ఎవరో అని చూసేసరికి అక్కడ మను ఉంటాడు. అతడిని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర.

మరోవైపు మీటింగ్ కి అందరూ అటెండ్ అవుతారు. శైలేంద్ర రాలేదు అంటాడు ఒక వ్యక్తి. పర్వాలేదు మధ్యలో జాయిన్ అవుతాడు అతని కోసం వెయిట్ చేయొద్దు అంటాడు ఫణీంద్ర. తర్వాత అందరూ ఎండిగా ఎవరిని నిర్ణయించబోతున్నారు అని రిషి ని అడుగుతారు. ఆయన ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు, ఈ కాలేజీ మాజీ ఎండిగా నేను నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు నేను కొత్త ఎండిని ప్రకటించబోతున్నాను అంటుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X