Guppedanta Manasu, August 16th episode: దేవయానికి కండిషన్ పెట్టిన మను.. కోలుకోలేని షాక్ లో శైలేంద్ర!

మీ ఫ్రెండ్ ని చంపిన వాళ్లని మీ ముందు నిలబెడతాను అని అనుపమకి మాట ఇస్తాడు రిషి. మరోవైపు సిటీకి వచ్చిన సరోజ ధనరాజ్ ద్వారా రిషి ఆచూకీ తెలుసుకోవాలనుకుంటుంది. మరోవైపు శైలేంద్ర కిడ్నాప్ కి గురవుతాడు. ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియక కంగారు పడతాడు శైలేంద్ర. తనని మనం కిడ్నాప్ చేశాడని తెలుసుకొని షాక్ అవుతాడు. మను తన తండ్రి ఎవరో చెప్పమనడంతో మహేంద్ర నీ తండ్రి అని చెప్తాడు శైలేంద్ర. కానీ మను ఆ మాటలు నమ్మడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 16వ తేదీ ఎపిసోడ్ 1,156 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఫణీంద్ర కి ఫోన్ చేసిన దేవయాని భర్త మాటలలో శైలేంద్ర అక్కడ లేడని తెలుసుకుంటుంది. కొడుకు ప్రమాదంలో ఉన్నాడని అర్థం చేసుకొని అతను చెప్పినట్లు చేయాలని కంగారుగా తన రూమ్ కి వెళ్తుంది దేవయాని. అత్తగారు ఎందుకంత కంగారు పడుతున్నారో అర్థం కాక ఆమె వెనుకనే వెళ్తుంది ధరణి. వసుధార రాసిన లెటర్ ఫోటో తీసి పంపిస్తుంది దేవయాని. అది గమనించిన ధరణి ఏదో జరుగుతుంది, అందుకే అత్తయ్య అంత కంగారు పడుతున్నారు అనుకుంటూ మళ్లీ కామ్ గా కిందికి వెళ్ళిపోతుంది. మరోవైపు మీటింగ్ లో అందరూ రిషి ఎండి కావాలని అనుకుంటూ ఉంటారు.

Guppedanta Manasu August 16th 2024 Episode number 1156 Here is the Full story

అంతలోనే రిషి,వసుధార మళ్లీ మీటింగ్ లో జాయిన్ అవుతారు. మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ మీరే కాలేజీకి ఎండి అయితే బాగుంటుంది అని చెప్పి రిషి ని ఒప్పిస్తారు. ఆఖరికి రిషి ఎండి గా ఉండటానికి ఒప్పుకుంటాడు. అందరూ ఆనందంగా రిషికి కంగ్రాట్స్ చెప్తారు. మరోవైపు దేవయాని పంపించిన లెటర్ ని చదివి షాక్ అవుతాడు మను. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా మా బాబాయే నీ కన్న తండ్రి అని, వసుధారే స్వయంగా ఆ లెటర్ లో రాసి క్యాబిన్లో పెట్టింది, అది నాకు దొరికింది అంటూ ఆరోజు జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర.

అప్పుడే దేవయాని ఫోన్ చేసి మను నువ్వే నా కొడుకుని కిడ్నాప్ చేసావని నాకు తెలుసు, దయచేసి నా కొడుకుని వదిలేయ్ ఈ సమయం మాకు చాలా విలువైనది అంటుంది. నా తండ్రి అంటూ మధ్యలోనే మాట ఆపేస్తాడు మను. ఆ లెటర్ చూసిన నీకు అంతా అర్థమయ్యే ఉంటుంది వసుధార లెటర్ చూసాకే మహేంద్ర నీ తండ్రి అని మాకు తెలిసింది. మాకు తెలిసిన విషయాన్ని నీతో చెప్పాము, అది నిజమో కాదో నువ్వే నిర్ధారించుకో, ఇప్పుడు నువ్వు తేల్చుకోవాల్సింది మాతో కాదు మహేంద్ర తో మీ అమ్మతో అని చెప్తుంది దేవయాని. తన కొడుకుని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది.

Guppedanta Manasu August 16th 2024 Episode number 1156 Here is the Full story

వదిలేస్తాను కానీ నా కన్నతండ్రి గురించి నాకు నిజం తెలిసిందనే విషయం మన ముగ్గురు మధ్యనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు అని దేవయానికి కండిషన్ పెడతాడు మను. నువ్వు చెప్పినట్లే చేస్తాం అని దేవయాని మాట ఇవ్వడంతో శైలేంద్ర ని రిలీజ్ చేస్తాడు మను. ఈసారి కూడా నీ కలలు నిజం అవ్వవు అంటాడు మను. ఖచ్చితంగా నేను కాలేజీకి ఎండి అవుతాను ఈసారి నిన్ను కలిసేటప్పుడు సాధారణ శైలేంద్ర గా కాదు డిబిఎస్టి కాలేజీ ఎండిగా కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర.

మరోవైపు మీటింగ్లో ఉన్నవాళ్లందరూ ఫైల్స్ మీద సంతకాలు పెడతారు. ఇక ఆఖరుగా రిషి సంతకం పెట్టడంతో అందరూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన శైలేంద్ర లేటుగా వచ్చినందుకు క్షమించండి, ఇప్పుడు ఎండిని ప్రకటించండి అంటాడు. మీటింగ్ పూర్తి అయిపోయిందని రిషి ఎండి అయిపోయాడు అని ఫణీంద్ర చెప్పటంతో షాక్ అవుతాడు శైలేంద్ర. అలా కుదరదు మొదటి నుంచి మళ్లీ మీటింగ్ స్టార్ట్ చేయండి, అయినా వసుధార ఎండిని ప్రకటించడం ఏమిటి అంటూ ఫ్రస్టేట్ అవుతాడు.

Guppedanta Manasu August 16th 2024 Episode number 1156 Here is the Full story

మాజీ ఎండిగా వసుధారకి ఆ హక్కు ఉంది, పిచ్చిగా మాట్లాడకు అంటూ ఫణీంద్ర కొడుకుని మందలించి మీటింగ్ ముగిసింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రిషి కోసం వెయిట్ చేస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర. అక్కడికి వచ్చిన రిషిని నిలదీసే లోపు రిషి శైలేంద్ర కాలర్ పట్టుకొని నన్ను ఏం చేద్దామనుకున్నారు సార్, అసలు ఎందుకు మీరు మీటింగ్ కి రాలేదు, నిజం చెప్పండి నన్ను ఎండిని చేసి ఏదైనా కుట్రలో భాగం చేయాలని ప్లాన్ చేశారా చెప్పండి అని ఆవేశంగా అడుగుతాడు. నేను కేవలం కాలేజీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X