Guppedanta Manasu, August 17th episode: వింతగా ప్రవర్తిస్తున్న మను.. గుక్కపట్టి ఏడుస్తున్న శైలేంద్ర!

సిటీకి వచ్చిన సరోజ ధనరాజ్ ద్వారా రిషి ఆచూకీ తెలుసుకోవాలనుకుంటుంది. మరోవైపు శైలేంద్ర కిడ్నాప్ కి గురవుతాడు. ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియక కంగారు పడతాడు శైలేంద్ర. తనని మను కిడ్నాప్ చేశాడని తెలుసుకొని షాక్ అవుతాడు. మను తన తండ్రి ఎవరో చెప్పమనడంతో మహేంద్ర నీ తండ్రి అని చెప్తాడు శైలేంద్ర. కానీ మను ఆ మాటలు నమ్మడు. కానీ తర్వాత దేవయాని సాక్ష్యాలు చూపించడంతో నమ్ముతాడు. మరోవైపు రిషిని ఎండిగా ప్రకటిస్తుంది వసుధార. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 17వ తేదీ ఎపిసోడ్ 1,157ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

తన తండ్రి గురించి ఆలోచిస్తున్న మను అందరూ కలిసి తనని మభ్య పెట్టారని బాధపడతాడు, వసుధార వాళ్ళు నిజం తెలిసిన కూడా చెప్పలేదని ఆవేదన పడతాడు. నేను కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తాను, నిజం తెలిసినా తెలియనట్లే ఉంటాను అనుకుంటాడు. మరోవైపు కారులో వస్తున్న వసుధార మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎండిగా ప్రకటించినందుకు కోపంగా ఉందా అని రిషి ని అడుగుతుంది.

Guppedanta Manasu August 17th 2024 Episode number 1157 Here is the Full story

తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది. జరిగిపోయింది కదా ఇప్పుడు దాని గురించి ఎందుకు అంటాడు రిషి. అలా అంటూనే సడన్ బ్రేక్ వేస్తాడు. ఎందుకు సార్ ఏమైంది అని అడుగుతుంది వసుధార. ఒకసారి అటు చూడు అని ఎదురుగా చూపిస్తాడు రిషి. కారుకి అడ్డంగా ఉన్న సరోజ, ధనరాజ్ లని చూసి షాక్ అవుతుంది వసుధార. కారు దిగి వచ్చిన రిషి తో పద బావ మన ఊరు వెళ్ళిపోదాం అంటుంది సరోజ.

నేను రాలేను, నాకు ఇక్కడ చాలా పనులు, బాధ్యతలు ఉన్నాయి అంటాడు రిషి. ఈ ఊర్లో నీకేం పనులు ఉన్నాయి అంటుంది సరోజ. వసుధార వైపు తిరిగి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ముందు రిషి సార్, రిషి సార్ అంటూ మా బావ పంచన చేరావు, ఇప్పుడు ఏకంగా మనిషినే మార్చేసావు అంటుంది. వసుధారని ఏమి అనొద్దు అని సరోజపై ఫైర్ అవుతాడు రిషి. నీకోసం నేను పిచ్చిదాని లాగా రోడ్ల మీద తిరుగుతున్నాను, అక్కడ అమ్మమ్మ కూడా నీ కోసం బెంగపెట్టుకుంది అంటుంది సరోజ.

అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నందుకు నీ మీద జాలిగా ఉంది, ఊరికి తిరిగి వెళ్ళిపో, నేనయితే ప్రస్తుతం రావడం కుదరదు అని చెప్పి వసుధార ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు ఇంటికి వచ్చిన మను ఆనందంగా తల్లిని, ఓల్డి ని పిలుస్తాడు. అనుపమ ఒకతే బయటకు రావటంతో ఓల్డి లేదా నాకు చాలా ఆనందంగా ఉంది రసగుల్లా తినాలనిపిస్తుంది, నువ్వు చేస్తావా అని అడుగుతాడు మను.

వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎప్పుడూ లేనిది చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు అనుకుంటుంది అనుపమ. నువ్వేం చేస్తావు లే ఇప్పుడే ఆర్డర్ పెడతాను అని స్వీట్ ఆర్డర్ పెడతాడు మను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది అనుపమ. ఏమైంది, నేను మామూలుగానే ఉన్నాను కదా అయినా నేనేమైనా కొత్త విషయాలు తెలుసుకున్నానా అంటాడు మను. అలాగే రాత్రికి పొటాటో కర్రీ చేయమంటాడు. నాన్నగారికి ఏ కూర అంటే ఇష్టం అని అడుగుతాడు మను. పొటాటో అంటుంది అనుపమ.

మహేంద్ర గారికి కూడా పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం కదా అమ్మ, నేను చూశాను మా అభిరుచులు భలే కలిసాయి అంటూ అనుమానాస్పదంగా మాట్లాడుతాడు. అంతలోనే రసగుల్ల రావటంతో తల్లికి బలవంతంగా తినిపిస్తాడు మను. మరోవైపు మహేంద్ర పొలమారటంతో వసుధార మంచినీళ్లు తీసుకొని వస్తుంది. ఎవరో గట్టిగా తలుచుకుంటున్నారు అంటాడు మహేంద్ర. ఇంకెవరు మనుగారే అయ్యుంటుంది అనుకుంటుంది వసుధార.

రసగుల్లా మహేంద్ర కి ఇస్తూ ఏమిట మామయ్య రసగుల్లా చేయమన్నారు అని అడుగుతుంది. ఎందుకో తినాలనిపించిందమ్మ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఏదో తెలియని ఫీలింగ్, ఆనందంతో ఏం చేయాలో కూడా తెలియటం లేదు అంటాడు మహేంద్ర. తెలియాల్సిందే త్వరలోనే తెలుస్తుంది అంటుంది వసుధార. గాలి బుడగ లాంటి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంతా మంచే జరగాలని కోరుకుందాం కానీ ఏం చేయాలి అనేది ఆ భగవంతుడి నిర్ణయం అంటాడు మహేంద్ర.

మరోవైపు తను ఎండి కాలేదని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇకమీదట నేను ఎండిని అవ్వలేనా అంటూ కన్నీటి పర్యంతం అవుతాడు. నా కడుపున చెడపుట్టావు, ఇన్ని సంవత్సరాల మన కల ఒక్క నిమిషంలో బూడిద చేసేసావు అని కొడుకు పై కోప్పడుతుంది దేవయాని. అప్పుడే ధరణి అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడగటంతో ఆమెని పట్టుకొని మరింత ఏడుస్తాడు శైలేంద్ర. తనకి ఎండి పదవి దక్కలేదని, రిషి ఎండి అయ్యాడని చెప్తాడు. రిషి ఎండి అయినందుకు ఆనందపడుతుంది ధరణి.

అదేంటి రిషి మిమ్మల్ని ఎండి చేస్తాడు అని అంత గట్టిగా నమ్మారు అని భర్త ని అడుగుతుంది ధరణి. మను వల్ల ఆ పని జరగలేదు అంటాడు శైలేంద్ర. ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇప్పుడు అవన్నీ దానికి చెప్పడం అవసరమా అంటుంది దేవయాని. ధరణిని అక్కడ నుంచి పంపించేస్తుంది. తర్వాత శైలేంద్ర తల్లి దగ్గరికి వచ్చి నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఇక నేను ఎండిని అవ్వలేనా, జీవితాంతం ఇలా ఏడుస్తూ కూర్చోవలసిందేనా అంటూ మళ్లీ ఏడుస్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X