Guppedanta Manasu, August 19th episode: భార్యపై రిషి అనుమానం.. ధరణితో వసుధార ఎంక్వయిరీ!
తనని మను కిడ్నాప్ చేశాడని తెలుసుకొని షాక్ అవుతాడు శైలేంద్ర. మను తన తండ్రి ఎవరో చెప్పమనడంతో మహేంద్ర నీ తండ్రి అని చెప్తాడు శైలేంద్ర. కానీ మను ఆ మాటలు నమ్మడు. కానీ తర్వాత దేవయాని సాక్ష్యాలు చూపించడంతో నమ్ముతాడు. మరోవైపు రిషిని ఎండిగా ప్రకటిస్తుంది వసుధార. ఇది తెలుసుకున్న శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతాడు. ఇలా ఎందుకు చేసావంటూ రిషిని నిలదీస్తాడు. మీరు మీటింగ్ కి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అలా చేశానంటూ శైలేంద్రని మానిప్లేట్ చేస్తాడు రిషి.ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 19వ తేదీ ఎపిసోడ్ 1,158ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్న భర్త దగ్గరికి వెళ్లిన వసుధార ఆ సరోజ గురించే ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది. తన గురించి నేనెందుకు ఆలోచిస్తాను, తనని అప్పుడే కన్విన్స్ చేసి పంపించేసాను కదా అంటాడు రిషి. తర్వాత మళ్లీ తనే మాట్లాడుతూ సరోజ గురించి నా కన్నా నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు ఉన్నావు అని భార్యని ఆట పట్టిస్తాడు. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది వసుధార. అన్నయ్య ఎందుకు మీటింగ్ కు రాలేదు, ఏదో జరిగింది దాని గురించే ఆలోచిస్తున్నాను అంటాడు రిషి.

నాకు అదే అర్థం కావటం లేదు అంటుంది వసుధార. అన్నయ్య రాకపోవడానికి కారణం నువ్వు కాదు కదా, అన్నయ్య అంటే మొదటి నుంచి నీకు పడదు కదా, నాకు తెలియకుండా నువ్వు ఏమైనా ప్లాన్ చేసావా అని భార్యని సరదాగా అనుమానిస్తాడు రిషి. నేను పొద్దుటినుంచి మీతోనే ఉన్నాను అని ఎక్స్ప్లనేషన్ ఇస్తుంది వసుధార.
తర్వాత వసుధార చేతిలో ఉన్న స్వీట్ చూసి ఈరోజు ఎందుకు స్వీట్ చేశావు అని అడుగుతాడు రిషి. మీరు మళ్ళీ ఎండి అని సందర్భంగా మావయ్యకి తినాలనిపించింది అంట చేయమన్నారు అంటుంది వసుధార. తర్వాత ఇద్దరూ స్వీట్ తింటారు. మరోవైపు మహేంద్రని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు మను. అతని ఫోటో తీసి షూట్ చేయాలనుకుంటాడు కానీ షూట్ చేయలేక పోతాడు.
తండ్రి ఎవరో తెలియక ముందు కోపంతో రగిలిపోయాను కానీ ఇప్పుడు ఎందుకు ఏమి చేయలేకపోతున్నాను, మామూలుగా అయితే నాకు ఉండే ఫ్రస్టేషన్ కి నా గన్ లో ఉండే బుల్లెట్లన్నీ బయటికి వచ్చేవి కానీ ఎందుకో ఆగిపోతున్నాను, నన్ను ఆపుతున్నది రక్తసంబంధమా అని అనుకుంటాడు. నా మైండ్ నన్ను స్థిరంగా ఉంచడం లేదు ఏదో ఒకటి చేస్తేనే ఇన్నాళ్లు రగిలిన జ్వాలకి అర్థం ఉంటుంది అనుకుంటాడు. మరోవైపు మను కి నిజం తెలియటం మనకి లాభమా, నష్టమా అని తల్లిని అడుగుతాడు శైలేంద్ర.
తెలుసుకొని ఏం చేస్తావు, ఇదంతా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వకముందు ఆలోచించాలి. ఇకమీదటైనా జాగ్రత్తగా ఉండు అని కొడుకుని కోప్పడుతుంది దేవయాని. మను బాబాయ్ దగ్గరికి వెళ్లి నిజం బయట పెట్టేస్తే ఏంటి పరిస్థితి, ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదు అని బాబాయ్ అడిగితే ఏమని చెప్తాము అని తల్లిని అడుగుతాడు శైలేంద్ర. అడిగినప్పుడు తప్పించుకోవడానికి మన దగ్గర బోలెడన్ని మార్గాలు ఉన్నాయి కానీ నువ్వు అనవసరమైన డిస్కషన్స్ చేయకు అని కోప్పడుతుంది దేవయాని.
అదీ నిజమే కానీ మను తండ్రి ప్రేమకి లొంగిపోయి తండ్రికి దగ్గర అయితే మనకే నష్టం. రిషి రంగా అని తెలిసినప్పుడు ఇక మను నే వారసుడిని చేస్తారు అని భయపడతాడు శైలేంద్ర. అలా చేస్తే చూస్తూ ఊరుకుంటామా, మను తండ్రికి దగ్గర అవ్వకుండా మనం చేయాలి. తండ్రి లేనప్పుడు అతను పడిన బాధలన్నీ అతనికి గుర్తు చేసి తండ్రి మీద పగ పెంచుకునే లాగా చేయాలి. అప్పుడు మను మహేంద్రని చంపేస్తే మహేంద్ర పైకి, మను జైలుకి వెళ్తాడు. ముందు ఆ మను ని మహేంద్ర మీదికి ఎలా రెచ్చగొట్టాలో ఆలోచించు అని కొడుక్కి సలహా ఇస్తుంది దేవయాని.
మరోవైపు శైలేంద్ర కాలేజీకి లేటుగా రావడానికి గల కారణం ఎంతకీ అర్థం కాదు వసుధారకి. అందుకే ధరణికి ఫోన్ చేసి ఎంక్వయిరీ చేస్తుంది. ధరణి నాకు అసలు విషయం తెలియదు కానీ అత్తయ్య కంగారుపడుతూ ఏదో లెటర్ ఫోటో తీసి ఎవరికో పంపించారు, మా ఆయన మను అంటూ ఏదో చెప్పబోతే అత్తయ్య ఆపేశారు అంటుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత దేవయాని గారు ఆ లెటర్ ని మనుకి పంపించి ఉంటారా, మను గారు తన తండ్రి ఎవరో తెలుసుకున్నారా లేదా అని అనుమాన పడుతుంది వసుధార.
నెక్స్ట్ సీన్ లో మను గురించి రిషి సార్ కి నిజం తెలిసేలాగా చేయాలి అనుకుంటుంది వసుధార. అప్పుడే రిషి వచ్చి ఏమాలోచిస్తున్నావు అని అడుగుతాడు. మనం ఒకసారి అనుపమ మేడం ఇంటికి వెళ్దాం అంటుంది వసుధార. సరే అంటూ అక్కడి నుంచి బయలుదేరబోతే అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర నేను కూడా వస్తాను అంటాడు. కానీ వసుధార వద్దు అని చెప్పడంతో ఎందుకు అని అడుగుతాడు రిషి. చెప్పింది అర్థం చేసుకోండి మావయ్యని రావద్దు అని చెప్పండి అనడంతో తండ్రిని ఇంట్లోనే ఉండిపోమంటాడు రిషి. సరే అంటాడు మహేంద్ర.


Click it and Unblock the Notifications











