Guppedanta Manasu August 1st episode: గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రిషి.. షాక్ లో స్పృహ కోల్పోయిన శైలేంద్ర!
రిషి గా నటించడానికి ఒప్పుకున్న రంగా శైలేంద్రతో పాటు వెళ్తాడు. రంగా ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసిన వసుధార కి రంగాయే రిషి అన్న క్లారిటీ వస్తుంది. రంగా కి రిషి గా ట్రైనింగ్ ఇస్తాడు శైలంద్ర. రిషి, వసుధార లు మహేంద్ర ఇంట్లో కలుసుకుని ఎమోషనల్ అవుతారు. రిషి కాలేజీ దక్కించుకోవడం కోసం ఏం చేయాలో వసుధారకి చెప్తాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 1వ తేదీ ఎపిసోడ్ 1142ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కాలేజీ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం నాక్కూడా బాధగా ఉంది అంటాడు మినిస్టర్. అంతగా బాధపడటం ఎందుకు శైలేంద్రని ఎండి చేయవచ్చు కదా అంటుంది దేవయాని. తనని ఎండి చేయటానికి నాకేమీ అభ్యంతరం లేదు రిషి గాని వసుధారగాని వచ్చి చెప్తే వెంటనే ఎండిని చేసేస్తాను అంటాడు మినిస్టర్. తర్వాత డాక్యుమెంట్స్ ఒక్కొక్కరికి ఇచ్చి సంతకాలు చేయమంటాడు.

ఫణీంద్ర, మహేంద్ర సంతకాలు పెడుతూ ఉంటారు. అప్పుడు దేవయాని కొడుకుతో మాట్లాడుతూ ఆ రంగా ఏమిటి ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చెయ్యు అంటుంది. శైలేంద్ర రంగా కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీడేమిటి ఇలా హ్యాండ్ ఇచ్చాడు అనుకుంటూ టెన్షన్ పడతాడు శైలేంద్ర. మినిస్టర్ శైలేంద్రని సంతకం పెట్టమనడంతో వేరే దారి లేక సంతకం పెడుతున్న సమయంలో వసుధార ఎంట్రీ ఇస్తుంది.
తనను చూసి మిగిలిన వాళ్ళందరూ షాక్ అయితే శైలేంద్ర మాత్రం భయపడిపోతాడు దయ్యం, దయ్యం అంటూ తల్లి వెనక దాక్కుంటాడు. తను పసుధారనే, చచ్చిపోలేదు బ్రతికే ఉంది నువ్వు ఓవర్ చేయకు అని కొడుకుని మెల్లగా కోప్పడుతుంది దేవయాని. మహేంద్ర కోడల్ని ఆప్యాయంగా పలకరిస్తాడు, నువ్వు వచ్చావు అంటే రిషి కూడా అంటూ ఉండగానే వచ్చారు మామయ్య అంటుంది వసుధార. ఏడమ్మా అని ఆనందంగా అడుగుతాడు మహేంద్ర.
అప్పుడే రిషి క్యాంపస్ లో ఎంట్రీ ఇస్తాడు, స్టూడెంట్స్ అందరూ అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. రిషి వస్తున్నాడని మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి చూస్తారు. మహేంద్ర ఎమోషనల్ అవుతూ కొడుకుని హాగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు తర్వాత ఫణీంద్ర, ధరణి, దేవయాని అందరూ అతడిని పలకరిస్తారు. మినిస్టర్ అయితే నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు కాలేజీని రక్షించడానికి చావుని ఎదిరించి మరీ వచ్చావు నువ్వు మృత్యుంజయుడివి ఇక కాలేజీకి మా అవసరం లేదు.
ఇప్పుడు కాలేజీకి ఎండి ఎవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అంటాడు. జరుగుతున్నదంతా చూసి షాక్ తో స్పృహ కోల్పోతాడు శైలేంద్ర. కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉంటాడు శైలేంద్ర. పక్కన రిషి ఉంటాడు. నువ్వు రిషి కదా అని అడుగుతాడు శైలేంద్ర. లేదు నేను మీ రంగానే, ఆ అమ్మాయి ఎవరు, తెగ ఓవరాక్షన్ చేసింది, తనే ఆ ఎంట్రీ ప్లాన్ చేసింది తను రిషి భార్యనా అని అడుగుతాడు రంగా. అవును రిషి భార్య అంటాడు శైలేంద్ర
మరి నాకెందుకు చూపించలేదు చూపిస్తే జాగ్రత్త పడే వాడిని కదా అంటాడు రిషి. నా ఖర్మ కాలి చూపించలేదు అయినా నువ్వు ఎందుకు ఫోన్ స్విచాఫ్ చేశావు అంటాడు శైలేంద్ర. లేదు, ఆ హడావుడిలో నా ఫోన్ ఎక్కడో పడిపోయింది అంటాడు రిషి. అయినా మినిస్టర్ గారు అసలు ఛాయిస్ ఇవ్వకుండా ఎండి ఎవరో ప్రకటించేశారు అంటాడు రిషి. పోనీలే నువ్వు అధికారంలో ఉన్నా నేను చెప్పిన ఫైల్స్ మీద సంతకాలు చేయి చాలు, నీ అధికారాన్ని నేనేమీ దుర్వినియోగం చేయనులే అంటాడు శైలేంద్ర.
అధికారం వరకు మీరు చెప్పినట్లే చేస్తాను అది మన డీలింగ్, కానీ ఆ పొగరుబోతు అమ్మాయికి భర్తగా నటించమంటే మాత్రం నా వల్ల కాదు అంటాడు రిషి. అలా అంటే ఎలా, కావాలంటే డబల్ అమౌంట్ ఇస్తాను అంటాడు శైలేంద్ర. ఇక్కడ డబ్బులు సమస్య కాదు కానీ కొన్ని పనులు మనసుకు నచ్చకపోతే చేయలేము, ఆ అమ్మాయి ఓవరాక్షన్ నేను భరించలేను అంటాడు రిషి. ఎవరిది ఓవరాక్షన్ అంటున్నారు అంటూ వసుధార అక్కడికి వస్తుంది. నన్నే అంటూ టాపిక్ మార్చేస్తాడు శైలేంద్ర.
అప్పుడే అక్కడికి ఫణీంద్ర వాళ్ళు వస్తారు స్పృహలోకి వచ్చావా, అలా కళ్ళు తిరిగి పడిపోయావ్ ఏంటి అంటాడు ఫణీంద్ర. ఎమోషన్ ఎక్కువైతే అలాగే కళ్ళు తిరిగి పడిపోతున్నాను అంటాడు శైలేంద్ర. అంత ఎక్కువ ఎమోషన్ ఎందుకు వచ్చిందో అని వెటకారంగా అడుగుతాడు మహేంద్ర. అదేంటి బాబాయ్ అలా అంటావు కనిపించరు అనుకున్న రిషి, వసుధార కనిపించేసరికి ఆనందం తట్టుకోలేకపోయాను అంటాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











