Guppedanta Manasu August 20th episode: మను.. నీ తండ్రి అతడే.. ఏం చేస్తావో చెప్పు అంటూ రెచ్చగొట్టిన శైలేంద్ర

రిషిని ఎండిగా ప్రకటిస్తుంది వసుధార. ఇది తెలుసుకున్న శైలేంద్ర ఫ్రస్టేట్ అవుతాడు. ఇలా ఎందుకు చేసావంటూ రిషిని నిలదీస్తాడు. మీరు మీటింగ్ కి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అలా చేశానంటూ శైలేంద్రని మానిప్లేట్ చేస్తాడు రిషి. శైలేంద్ర మీటింగ్ కి రాలేకపోవడానికి కారణం మను అని ధరణి ద్వారా తెలుకుంటుంది వసుధార. అలాగే మను తండ్రి విషయం రిషి కి తెలియజేయాలి అనుకుంటుంది.ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 20వ తేదీ ఎపిసోడ్ 1,159ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

అనుపమ ఇంటికి బయలుదేరుతారు రిషి,వసుధార. మహేంద్ర వస్తాను అంటే ఈ సారికి మేము వెళ్తాము, మీరు తర్వాత వెల్దురుగాని అని మహేంద్ర కి నచ్చజెప్పి వెళ్ళిపోతారు రిషి వాళ్ళు. వసుధార నన్ను అవాయిడ్ చేసి అనుపమ ఇంటికి వెళ్తుంది, తను నా దగ్గర ఏదో దాస్తుంది, అది ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటాడు మహేంద్ర. మరోవైపు శైలేంద్ర మనుకి ఫోన్ చేసి నువ్వు నాకు తమ్ముడివి, మా బాబాయ్ కొడుకువి అంటాడు. ఆ మాటలకి చిరాకు పడతాడు మను.

Guppedanta Manasu August 20th 2024 Episode number 1159 Here is the Full story

రక్త సంబంధాలను కాదనుకునే హక్కు మనకి లేదు నువ్వు ఎంత కాదనుకున్నా నేను నీకు అన్నని, నువ్వు నాకు తమ్ముడువి అంటాడు శైలేంద్ర. ఫోన్ చేసి చిరాకు పెట్టకు అని కోప్పడతాడు మను. సరే అన్న శైలేంద్ర ఒకసారి తనని కలవమని చెప్తాడు. కుదరదు అంటాడు మను, నువ్వు రాకపోతే నువ్వు నా దగ్గర తీసుకున్న మాట గురించి మీ అమ్మగారితో చెప్తాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ మాటలు విని కోపంతో ఫోన్ పెట్టేసిన మను శైలేంద్ర దగ్గరికి బయలుదేరుతాడు. ఇదంతా అనుపమ చూస్తుంది, తర్వాత కొడుకు ప్రవర్తన గురించి ఆలోచిస్తూ కూర్చున్న అనుపమ దగ్గరికి రిషి దంపతులు వస్తారు.

వాళ్లని ఆహ్వానించి కూర్చో ఉంటుంది అనుపమ. మను కనిపించడం లేదు ఏమిటి అంటుంది వసుధార. తెలియదు, ఎక్కడికో కంగారు గా వెళ్ళాడు అంటుంది అనుపమ. మరి మీరు అడగలేదా అని అనుపమ ని అడుగుతుంది వసుధార. ఈ మధ్య నేను వాడిని ఫేస్ చేయలేకపోతున్నాను, వాడి ప్రవర్తన వింతగా ఉంది అంటుంది అనుపమ. తర్వాత కాఫీ పెట్టి తీసుకు వస్తాను అని వెళ్లబోతుంటే నేను కూడా వస్తాను అని అనుపమ తో కిచెన్ లోకి వెళుతుంది వసుధార.

Guppedanta Manasu August 20th 2024 Episode number 1159 Here is the Full story

అక్కడ అనుపమతో మాట్లాడుతూ మను తండ్రి గురించి చెప్పాలనుకుంటున్నాను ఆయన ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారు అంటుంది వసుధార. వద్దు అంటుంది అనుపమ. ఏం జరుగుతుందో అని భయపడుతూ కూర్చుంటే రేపు జరిగే పరిణామాలకి మనం బాధపడవలసి వస్తుంది, అందుకే రిషి సార్ కి నిజం చెప్పాలనుకుంటున్నాను అంటుంది వసుధార.

ఏం నిజం వసుధార అంటూ అక్కడికి వస్తాడు రిషి. మరోవైపు తన తలపై గన్ గురిపెట్టిన మను తో ఎప్పుడు పడితే అప్పుడు గన్ వాడకూడదు, గతంలో కూడా ఇలాగే రాజీవ్ మీద వాడి కటకటాల పాలైనప్పుడు నేనే నిన్ను బయటకు తీసుకువచ్చాను మర్చిపోయావా అంటాడు శైలేంద్ర. మీ నాన్న ఎలా ఉన్నారు, మీ నాన్న ఎవరో తెలిస్తే అది చేస్తాను ఇది చేస్తాను అన్నావు ఇప్పుడు తండ్రి ఎవరో తెలిసింది కదా ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు శైలేంద్ర.

Guppedanta Manasu August 20th 2024 Episode number 1159 Here is the Full story

ఆ మాటలకి శైలేంద్ర మీద ఆవేశపడతాడు మను. నువ్వు తండ్రి ప్రేమకి లొంగిపోయావా, ఆస్తుల కోసమో పదవుల కోసమో నీ తండ్రిని క్షమించేసావా అని అడుగుతాడు. ఆ మాటలకి కోపంతో రెచ్చిపోయిన మను నేను ఏం చేయాలో నాకు తెలుసు మరొకసారి నన్ను బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకుంటే బాగోదు, నువ్వు నా తల్లికి నిజం చెప్పేస్తాను అంటున్నావు, నా తల్లికే కాదు ఎవరికి నిజం చెప్పుకుంటావో చెప్పుకో నాకు వచ్చిన నష్టం లేదు.

ఈ ఆగస్టు అయ్యేలోగా ఏం చేస్తానో చూస్తూ ఉండు అని శైలేంద్రని హెచ్చరించి వెళ్లిపోతాడు మను. మరోవైపు వసుధార మాట్లాడుతూ మను కి తన తండ్రి ఎవరో తెలియదు, మేడం ని అడిగితే చెప్పటం లేదు అంటుంది వసుధార. ఎందుకు మేడం చెప్పటం లేదు అతను మంచివాడు కాదా, బాధ్యత తెలియనివాడా అని అడుగుతాడు రిషి. అలా మాట్లాడకండి సార్ నాకు బాధగా ఉంది ఎందుకంటే మను తండ్రి మావయ్య అంటుంది వసుధార.

ఆ మాటలకి షాక్ అవుతాడు రిషి. చాటుగా వింటున్న మహేంద్ర కూడా షాక్ అవుతాడు. మన తండ్రి నేనా అని ఆశ్చర్యపోతాడు. వసుధార చెప్తుంది నిజమేనా అని అడుగుతాడు రిషి. నిజమే అంతకుమించి నన్నేమీ అడగద్దు నేను తప్పు చేయలేదు కానీ పాపం చేశాను అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనుపమ. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X