Guppedanta Manasu, August 21st: ‘శైలేంద్ర నువ్వు వెధవవు.. రిషిని హత్య చేయించేందుకు కుట్ర’!

నన్ను ఎండిగా ఎందుకు ప్రకటించలేదని రిషిని నిలదీస్తాడు శైలేంద్ర. మీరు మీటింగ్ కి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అలా చేశానంటూ శైలేంద్రని మానిప్లేట్ చేస్తాడు రిషి. శైలేంద్ర మీటింగ్ కి రాలేకపోవడానికి కారణం మను అని ధరణి ద్వారా తెలుకుంటుంది వసుధార. మనుకి తండ్రి మహేంద్ర అని అనుపమ సమక్షంలో భర్తకి చెప్తుంది వసుధార. ఆ మాటలకి రిషి తో పాటు చాటు నుంచి విన్న మహేంద్ర కూడా షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 21వ తేదీ ఎపిసోడ్ 1,160ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నేను మను ని బాబాయ్ మీదికి రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నించాను కానీ ఆ మను ఏ మాత్రం రియాక్ట్ అవలేదు పైగా నాకే వార్నింగ్ ఇచ్చాడు అని తల్లితో చెప్తాడు శైలేంద్ర. ఏమని వార్నింగ్ ఇచ్చాడు అంటుంది దేవయాని. ఆగస్టు అయ్యేలోగా ఏం చేస్తానో చూస్తూ ఉండు అన్నాడు అంటాడు శైలేంద్ర. అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్నావా, ఏ బిడ్డకి తండ్రి మీద కోపం ఉండదు నిజం తెలియక ముందు ఆవేశపడిన మను తన తండ్రి మహేంద్ర అని తెలిసి ఏం చేయలేకపోతున్నాడు.

Guppedanta Manasu August 21st 2024 Episode number 1160 Here is the Full story

అందులోనూ మహేంద్ర అంటే మను కి అభిమానం కూడాను అంటుంది దేవయాని. వాళ్ళిద్దరూ కలిసి పోతే నా పరిస్థితి ఏంటి అని కంగారు పడతాడు శైలేంద్ర. నువ్వు ఎక్కువగా ఊహించకు అలా ఎప్పటికీ జరగదు, అసలు మహేంద్రకి ఈ విషయం తెలుసా, తెలిస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ టాపిక్ డిస్కషన్ అవుతున్నప్పుడు వాళ్ళ మధ్య ఏమైనా జరగొచ్చు ఎందుకంటే మనుకి ఆవేశం ఎక్కువ అంటుంది దేవయాని. మరోవైపు మను కి తనే తండ్రి అని తెలుసుకున్న మహేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు.

నేను మనుకి తండ్రి ఏమిటి అనుపమని బెస్ట్ ఫ్రెండ్ గా చూశాను, నా మనసులో నీకు తప్ప ఇంకొకరికి చోటు ఇవ్వలేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని జగతితో చెప్పుకుంటాడు. అనుపమ చెప్పకుండా వసుధార ఇంత గట్టిగా మాట్లాడదు అనుకుంటాడు. వసుధార ఈ విషయం గురించే ఇన్ డైరెక్ట్ గా చాలాసార్లు హెచ్చరించింది, నేనే గ్రహించలేకపోయాను. అసలు ఈ విషయం మను కి తెలుసా అనుకుంటూ మనుకి ఫోన్ చేస్తాడు మహేంద్ర. కానీ మను ఫోన్ లిఫ్ట్ చేయడు.

Guppedanta Manasu August 21st 2024 Episode number 1160 Here is the Full story

రింగ్ అవుతున్న ఫోన్ చూస్తూ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం జరుగుతుందో నాకే తెలియదు అసలు ఎలా రియాక్ట్ కావాలో నాకు తెలియటం లేదు, ఇది ప్రేమ, కోపమా, పంతమా ఈ గుప్పెడంత మనసులో ఇంత అలజడి ఏమిటి అనుకుంటాడు మను. మహేంద్ర అనుపమ కి కూడా ఫోన్ చేస్తాడు కానీ తను కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. కొడుకు పరిస్థితిని చూసిన అనుపమ వీడికి నిజం తెలిసిపోయింది అని గ్రహిస్తుంది. వీడిని ఫేస్ చేయలేకపోతున్నాను ఇప్పటికే వీడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను అని బాధపడుతుంది.

మను దగ్గరనుంచి, అనుపమ దగ్గర నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో స్వయంగా వెళ్లి మాట్లాడాలి అనుకుంటాడు మహేంద్ర. అప్పుడే రిషి ఫోన్ చేసి నేను మీతో మాట్లాడాలి, నేను వచ్చేవరకు మీరు ఇల్లు కదలొద్దు అంటాడు. ఎందుకు అంటాడు మహేంద్ర. కారణాలు అడగద్దు చెప్పింది వినండి అంటాడు రిషి. సరే అంటాడు మహేంద్ర. అదే సమయంలో కూల్ గా ఉన్న భర్త ని చూసి ఇంత పెద్ద విషయం తెలిసాక కూడా ఇంత కూల్ గా ఎలా ఉన్నారు అని భర్తని అడుగుతుంది వసుధార.

Guppedanta Manasu August 21st 2024 Episode number 1160 Here is the Full story

అప్పుడే క్యాబిల్లోకి వచ్చిన శైలేంద్ర ఏ విషయం అని అడుగుతాడు. నీకెందుకు చెప్పాలి, అయినా కేబిన్ లోకి వచ్చేముందు పర్మిషన్ అడిగి రావాలన్న కామన్ సెన్స్ లేదా అని శైలేంద్రని కోప్పడుతుంది వసుధార. ఏం మాట్లాడుతున్నావు మా అన్నయ్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా ముందు అతనికి సారీ చెప్పు అని భార్యని కోప్పడతాడు రిషి. వసుధార శైలేంద్రకీ క్షమాపణ చెప్తుంది. మా అన్నదమ్ముల అనుబంధం గురించి ఇప్పటికైనా తెలిసిందా అని గర్వంగా అంటాడు శైలేంద్ర. తర్వాత రిషి ని తనతో పాటు రమ్మంటాడు.

శైలేంద్ర వెనక వెళ్తున్న రిషి వసుధార దగ్గర ఆగి సారీ కొంచెం ఓవరాక్షన్ చేశాను అని మెల్లిగా అంటాడు. ఆ మాటలకి నవ్వుకుంటుంది వసుధార. తర్వాత వసుధార నీతో ఏ విషయం గురించి మాట్లాడుతుంది అని రిషి ని అడుగుతాడు శైలేంద్ర. మను అని ఎవరో ఉన్నారు అంట కదా అతని గురించి మాట్లాడుతుంది అంటాడు రిషి. ఏమైంది తను వచ్చి మీ డాడీ ని ఏమైనా అన్నాడా అంటాడు శైలేంద్ర. తనేందుకు డాడ్ ని అంటాడు అని అడుగుతాడు రిషి.

Guppedanta Manasu August 21st 2024 Episode number 1160 Here is the Full story

అవన్నీ నీకెందుకు చెప్పాలి అంటాడు మహేంద్ర. అంటే నా ముందు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియాలి కదా అంటాడు రిషి. నువ్వేమీ రియాక్ట్ అవ్వద్దు జరిగింది చూస్తూ ఉండు, ఒకవేళ ఏమైనా జరిగితే మాత్రం మా బాబాయికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు అంటాడు శైలేంద్ర. అదేంటి ఎవరైనా బాబాయికి సపోర్ట్ చేయమని అడుగుతారు కానీ మీరు ఇలా అంటున్నారు ఏమిటి అని వెటకారంగా అంటాడు రిషి. దానికి సమాధానం చెప్పకుండా అసలు వసుధార నీతో ఇంకా నా గురించి ఏం చెప్పింది అని అడుగుతాడు శైలేంద్ర.

నువ్వు వెధవని, అర్హత లేకపోయినా ఎండి సీటు కోసం ఏవేవో చేస్తున్నావని, ఆఖరికి రిషి ని హత్య కూడా చేయించబోయావని చెప్తుంది అంటాడు రిషి. రంగా తన భర్త అనుకొని నా గురించి చెప్తున్నట్లుంది అనుకుంటాడు శైలేంద్ర. అయినా అవన్నీ నాకెందుకు సార్ ఎంత త్వరగా మీకు ఎండి సీట్ అప్పగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నాను అని శైలేంద్రతో చెప్తాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X