Guppedanta Manasu, August 22nd episode: మహేంద్ర కి క్షమాపణ చెప్పిన పసుధార.. మను తల్లి అనుపమ కాదా?
మీరు మీటింగ్ కి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక సైన్ చేశానంటూ శైలేంద్రని మానిప్లేట్ చేస్తాడు రిషి. శైలేంద్ర మీటింగ్ కి రాలేకపోవడానికి కారణం మను అని ధరణి ద్వారా తెలుకుంటుంది వసుధార. మనుకి తండ్రి మహేంద్ర అని అనుపమ సమక్షంలో భర్తకి చెప్తుంది వసుధార. ఆ మాటలకి రిషి తో పాటు చాటు నుంచి విన్న మహేంద్ర కూడా షాక్ అవుతాడు. దాని గురించే మను తోను, అనుపమతోను మాట్లాడాలి అనుకుంటే వాళ్ళిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 22 వ తేదీ ఎపిసోడ్ 1,161ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
మీ ఎండి పదవి మీకు ఇచ్చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను ఈ వ్యవహారాలలో కూరుకు పోతున్నాను నాకు ఈ ఫైల్స్ అవి అర్థం కావడం లేదు, ఈ పదవులు ఈ బంధాలు మోయలేక పోతున్నాను, మీరు ఎండి కావటానికి నేనేం చేయాలో చెప్పండి అంటాడు రిషి. ఆ మాటలకి ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటాడు శైలేంద్ర. ఎందుకు కన్నీరు అంటాడు రిషి. నేను తప్పకుండా ఎండిని అవుతాను అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార మీ అన్నయ్యకి ఏం చెప్పారు అంత ఎమోషనల్ అవుతున్నారు అంటుంది.

తనకి కావలసింది దక్కే రోజు తొందరలోనే ఉందని చెప్పాను దానికే ఎమోషనల్ అవుతున్నాడు అంటాడు రిషి. తర్వాత పని ఉంది నేను బయటికి వెళ్తాను అంటాడు వసుధర తను కూడా వస్తాను అంటే వద్దు అంటాడు. ఏం పని అని అడిగినా కూడా చెప్పడు. సార్ నా దగ్గర ఏదో దాస్తున్నారు అనుకుంటుంది వసుధార. మరోవైపు మహేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు మను. అప్పుడే మహేంద్ర దగ్గర నుంచి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని మెసేజ్ వస్తుంది. అది చదివిన మను ఫోన్ విసిరేయాలనుకుంటాడు కానీ అప్పుడే అక్కడికి వచ్చిన అనుపమని చూసి పొద్దున్నే మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు.
రిషి వాళ్ళు వచ్చారు అని చెప్తుంది అనుపమ. రిషి కి నా తండ్రి ఎవరు అనే విషయం చెప్పారా అని అడుగుతాడు మను, నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాను అంటుంది అనుపమ. ఏం చెప్పారు అంటాడు మను నేను ఇప్పటికే చిరాకులో ఉన్నాను నన్ను విసిగించొద్దు అంటుంది అనుపమ. నా ప్రశ్నలు మీకు చిరాకును కలిగిస్తున్నాయి కానీ నా బాధ మీకు కనిపించడం లేదా అంటాడు మను.
మహేంద్ర నీ తండ్రి అనే విషయం రిషికి చెప్పాను అంటుంది అనుపమ. పొద్దున్న మా నాన్న ఇక్కడికి వచ్చారా అని అడుగుతాడు రిషి. లేదు అంటుంది అనుపమ మరి ఆయన ఎందుకు నాకు పదేపదే మెసేజ్లు చేస్తున్నారు అని అడుగుతాడు మను. నాకేం తెలుస్తుంది అంటుంది అనుపమ. చేతిలోకి గన్ తీసుకొని నన్నే వెళ్లి తెలుసుకోమంటారా అంటూ అక్కడ నుంచి వెళ్ళబోతాడు మను, వద్దు మను, ప్లీజ్ అని అతడిని అడ్డుకుంటుంది అనుపమ.

ఆగస్టు అయిపోయేలోపు ఈ గన్ ఖాళీ అవుతుంది ఇది కచ్చితం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మను. మరోవైపు ఆలోచనలో ఉన్న మహేంద్ర దగ్గరికి రిషి, వసుధార వస్తారు. పొద్దున్న అనుపమ వాళ్ళ ఇంటికి వెళ్ళారా, మను తండ్రి గురించి మాట్లాడారా, అనుపమ ఏం సమాధానం చెప్పింది అని అడుగుతాడు మహేంద్ర. ఆ మాటలకి తడబడుతుంది వసుధార. మను తండ్రి గురించి తెలుసుకునే అవకాశం నాకు రాలేదు అంటుంది.
ఎలాంటి అవకాశం రాకుండానే మను తండ్రి గురించి తెలుసుకున్నావా అంటాడు మహేంద్ర. ఆ మాటలకి మరింత షాక్ అవుతుంది వసుధార. డాడ్ కి నిజం తెలిసింది వసుధార,డాడ్ మన వెనకే వచ్చారు, నేనే రమ్మన్నాను అంటాడు రిషి. ఇన్నాళ్లు నాకెందుకు నిజం చెప్పలేదు అంటాడు మహేంద్ర. మహేంద్ర కి క్షమాపణ చెప్పిన వసుధార మేడం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పారు, ఆమె మాట కాదనలేకపోయాను అంటుంది.

మనుకి నేను తండ్రిని అవ్వటం ఏమిటి నాకు ఏమీ అర్థం కావడం లేదు, అనుపమ ని అడుగుదామంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటాడు మహేంద్ర. మీరు ఎక్కడికి వెళ్ళకండి ఎవరితోని ఏమీ మాట్లాడకండి అంటాడు రిషి. నిజం ఏమిటో తెలియకపోతే నేను తప్పుడు మనిషిగా మిగిలిపోతాను అంటాడు మహేంద్ర. అనుపమ మేడం తప్పు చేయలేదు అంటున్నారు అంటే ఆమె మను తల్లి కాదా, అయితే మను తల్లి ఎవరై వుంటారు అంటుంది వసుధార.
ఈ విషయం అనుపమనే వెళ్లి అడుగుదాం అంటాడు మహేంద్ర. మీరు ఏ తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నాను, అన్ని నిజాలు అనుపమ గారితోనే చెప్పిస్తాను అప్పటివరకు మీరు ఈ విషయంలో ఎవరినీ కలవద్దు అంటాడు రిషి. మరోవైపు రిషి, వసుధార మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల మధ్యలో మీరు రిషి కాదు రంగా అని మీ బామ్మ గారికి, ఊర్లో వాళ్ళందరికీ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అంటుంది వసుధార.
నిజం ఏదో ఒక రోజు బయట పడాల్సిందే, దానిని అందరూ అంగీకరించాల్సిందే అంటాడు రిషి. మీ పెద్దమ్మ వాళ్లకి తెలిస్తే అని అనుమానంగా అడుగుతుంది వసుధార. తెలిస్తేనే ఈ నాటకానికి అంతం అంటాడు రిషి. మీ అన్నయ్య గురించి మీకు పూర్తిగా తెలియదు సార్ అంటుంది వసుధార. రిషి కి తెలియదు కానీ రంగాకి అన్ని విషయాలు తెలుసు అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











