Guppedanta Manasu, August 23rd episode: రిషిని నిలదీసిన బుజ్జి.. సరోజను నమ్మలేకపోతున్న శైలేంద్ర!
మనుకి తండ్రి మహేంద్ర అని అనుపమ సమక్షంలో భర్తకి చెప్తుంది వసుధార. ఆ మాటలకి రిషి తో పాటు చాటు నుంచి విన్న మహేంద్ర కూడా షాక్ అవుతాడు. దాని గురించే మను తోను, అనుపమతోను మాట్లాడాలి అనుకుంటే వాళ్ళిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. మహేంద్ర తో మాట్లాడుతూ మీరు ఎవరిని కలవకండి, ఏమి మాట్లాడకండి. నిజాలన్నీ అనుపమ మేడం గారితోనే బయట పెట్టిస్తాను అని మాటిస్తాడు రిషి.ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 23 వ తేదీ ఎపిసోడ్ 1,162ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
రిషి గా నాకు ఏ విషయాలు తెలియదు కానీ రంగా గా నాకు అన్ని విషయాలు తెలుసు, రిషి గా చేయలేని పనులు రంగాగా చేయాలి అందుకే ఇంకా ఆ పాత్రలో జీవిస్తున్నాను అంటాడు రిషి. ఇంకా ఎన్నాళ్ళు ఇలా అంటుంది వసుధార. కధ ముగింపుకు వచ్చే సమయానికి క్యారెక్టర్లు బయటపడతాయి, ఆ సమయం దగ్గరలోనే ఉంది చూస్తూ ఉండు అంటాడు రిషి. మరోవైపు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది సరోజ. బావ ఇంకా ఇంటికి రాలేదంటే ఏదో జరుగుతుంది, ఎలా తెలుసుకోవడం అనుకుంటూ అక్కడే ఉన్న బుజ్జిని చూస్తుంది.

వీడికి అన్నీ తెలుసు కానీ చెప్పడు, తనతో నిజం చెప్పించడం ఎలా అని ఆలోచిస్తున్న సరోజికి ఒక ఐడియా వస్తుంది, నేరుగా బుజ్జి దగ్గరికి వెళ్లి నాకు నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది బుజ్జి అంటుంది. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది అనుకుంటాడు బుజ్జి. అతడిని మాటలలో పెట్టిన సరోజ బావని వసుధార తీసుకెళ్లలేదు ఆ వసుధారే బావని తీసుకు వెళ్ళింది అని గ్రహించి ఇందులో ఏదో మతలబు ఉంది అదేంటో నేను కనుక్కోవాలి అలా చేయాలంటే ముందు శైలేంద్ర ని కలవాలి అని బుజ్జి తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరోజ. నెక్స్ట్ సీన్ లో రిషి ని కలుస్తాడు బుజ్జి. సరోజ విషయం చెప్తాడు.
సరోజ శైలేంద్రని కలిసే ఏర్పాట్లు నువ్వే చెయ్యు అని బుజ్జి కి చెప్తాడు రిషి. సరే అంటూ తననే చూస్తున్న బుజ్జి ని ఏంటలా చూస్తున్నావు అని అడుగుతాడు రిషి. అన్న.. నిజం చెప్పు, నువ్వురంగా కాదు కదా,నువ్వు ముసలిదాని దగ్గరికి వచ్చి సంవత్సరం అయింది, మా రంగా చిన్నప్పుడు ఊరు ఒదిలి వెళ్లిపోయాడు తిరిగి వచ్చిన నువ్వు అందర్నీ తెలిసినట్లు పలకరిస్తుంటే నువ్వే రంగా అని అందరూ అనుకున్నారు కానీ నువ్వు ఎప్పుడైతే మేడం గారికి ఉంగరం ఇచ్చావో అప్పుడే నాకు పక్కాగా అర్థమైంది నువ్వు రిషి అని, అలా అయితే మా రంగా అన్న ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు బుజ్జి.

నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు ప్రశాంతంగా ఉండు అని చెప్పి అతడిని పంపించేస్తాడు రిషి. ఈ మాటలు అన్ని పక్కనుంచి వింటున్న వసుధార ఎందుకు సరోజ శైలేంద్రని కలిసేలాగా చేయమంటున్నారు, అసలు రిషి సార్ ఏం చేయబోతున్నారు అనుకుంటుంది. మరోవైపు ధనరాజ్ తో మాట్లాడి అతడిని మభ్యపెట్టి మళ్లీ అతని ద్వారానే శైలేంద్రని కలిసేలా ధనరాజ్ ని ఒప్పిస్తుంది సరోజ. మరోవైపు తన అనుమానాన్ని భర్త దగ్గర వ్యక్తం చేస్తుంది వసుధార.
బామ్మ గారు మీకోసం ఎంత బాధ పడుతున్నారో ఆవిడకి మీరంటే చాలా ఇష్టం, నిజం బయట పెట్టొచ్చు కదా అంటుంది. సమయం వచ్చినప్పుడు నిజం దానంతట అదే బయటపడుతుంది, కొన్నిసార్లు ఎదుట వాళ్ళని సంతోష పెట్టటానికి కూడా అబద్ధం చెప్పాల్సి వస్తుంది అంటాడు రిషి. అదేంటో తెలిస్తే బాగుంటుంది అంటుంది వసుధార. అయితే నాతో పదా అంటాడు రిషి. ఎక్కడికి అంటుంది వసుధార. తినబోతూ రుచి ఎందుకు అంటాడు రిషి.

మీరు ఏం చేసినా దాని వెనుక బలమైన కారణం ఉంటుంది, కాకపోతే అదేంటో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో అడిగాను అంతే అంటుంది వసుధార. నా మీద నమ్మకం ఉంచినందుకు థాంక్స్ అని చెప్పి వసుధార తీసుకొని వెళ్తాడు రిషి. మరోవైపు ధనరాజ్ దగ్గరికి వచ్చిన శైలేంద్ర ఎందుకు నన్ను రమ్మన్నావు అని అడుగుతాడు, నేనే రమ్మన్నాను అంటుంది సరోజ. ఎందుకు అంటాడు శైలేంద్ర. నిజం చెప్పు నువ్వే కదా మా బావని తీసుకొచ్చావు, ఎందుకు తీసుకువచ్చావు, ఎవరైనా తీసుకురమ్మంటే తీసుకోవచ్చావా అని అడుగుతుంది.
నేనే తీసుకు వచ్చాను అంటాడు శైలేంద్ర. నీ కన్నా ముందే ఆ వసుధార వచ్చింది, రిషి సార్ అంటూ అతని వెనకాతలే తిరుగుతూ ఉండేది, కానీ మా బావ నేను రిషి కాదు రంగా అంటూ ఉండేవాడు. అలాంటివాడు సిటీకి వచ్చాడు, ఆ వసుధారతో తిరుగుతున్నాడు. తనే మా బావని రంగా లాగా మార్చేసింది, తను పిలిస్తే రాలేదని మీ ద్వారా మా బావని రప్పించింది, మీ ఇద్దరూ ఒకటే కదా అంటుంది సరోజ. ఆ మాటలకి షాక్ అవుతాడు శైలేంద్ర, వసుధార ఫోటో చూపిస్తాడు.

వసుధార ఫోటో చూపిస్తున్నావ్ ఏంటి, ఒకసారి చూస్తేనే మరిచిపోలేము అలాంటిది నెల రోజులు మా బావ ఇంట్లోనే తిష్ట వేసింది అంటుంది సరోజ. మరింత షాక్ కి గురైన శైలేంద్ర వాడు నిజంగా రంగాయేనా నేనే బ్రమపడ్డానా అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతున్న శైలేంద్రని నాకు సమాధానం చెప్పకుండా వెళ్లడానికి వీల్లేదు అంటుంది సరోజ. మీ బావని నీతో పంపిస్తాను నా మాట నమ్ము అని సరోజకి మాటిస్తాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











