Guppedanta Manasu, August 24th episode: అసలు రంగాను పరిచయం చేసిన రిషి.. తీసుకొన్న గోతిలో అంటూ దేవయాని!

మను తోను, అనుపమతోను మహేంద్ర మాట్లాడాలని ఫోన్ చేస్తే వాళ్ళిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. రిషి మీరు ఎవరిని కలవకండి, ఏమి మాట్లాడకండి. నిజాలన్నీ అనుపమ మేడం గారితోనే బయట పెట్టిస్తాను అని తండ్రికి మాటిస్తాడు. అసలు మీరు రంగా లా ఎందుకు నటిస్తున్నారు అని అడిగిన వసుధారకి క్లారిటీ ఇవ్వటం కోసం తనతో పాటు తీసుకువెళ్తాడు రిషి. అలాగే బుజ్జిని కూడా ఆ ప్లేస్ కి రమ్మంటాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 24 వ తేదీ ఎపిసోడ్ 1163 ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

సరోజ చెప్పింది నమ్మలేక పోతాడు శైలేంద్ర. అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి అని నిలదీస్తుంది సరోజ. మీ బావని నీతో పాటు పంపిస్తాను నీ నెంబర్ నాకు ఇవ్వు అతను బయలుదేరిన వెంటనే నీకు ఇంఫాం చేస్తాను అని చెప్పి సరోజ ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇదంతా చూస్తున్న ధనరాజ్ మన పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పి మళ్ళీ మీ బావ గురించే మాట్లాడావ్ ఏంటి అని అడుగుతాడు.

Guppedanta Manasu August 24th 2024 Episode number 1163 Here is the Full story

మా బావ గురించి ఒక క్లారిటీ వస్తేనే మన పెళ్లి గురించి క్లారిటీ వస్తుంది అంటుంది సరోజ. మరోవైపు ఒక ఇంటిదగ్గర వెయిట్ చేస్తున్న బుజ్జి ఈ ఇల్లు ఎవరిది, అన్న ఎందుకు నన్ను ఇక్కడ వెయిట్ చేయమన్నాడు అనుకుంటాడు. అప్పుడే వసుధార, రిషి అక్కడికి వస్తారు. ఇదేంటి సార్ మా ఇంటికి తీసుకువచ్చారు అని అడుగుతుంది వసుధార. లోపలికి రా అంటూ బుజ్జిని, వసుధారని లోపలికి తీసుకువస్తాడు రిషి. లోపల చక్రపాణి కూతుర్ని రిసీవ్ చేసుకుంటాడు.

రిషి, చక్రపాణి మాటల్లో వాళ్ళిద్దరూ రోజూ మాట్లాడుకుంటున్నారని తెలిసి ఆశ్చర్య పోతుంది వసుధార. తర్వాత అక్కడికి ఒక వ్యక్తి మానుతున్న గాయాలతో మెల్లిగా నడుస్తూ అక్కడికి వస్తాడు. ఎవరు సార్ ఇతను అని అడుగుతుంది వసుధార. ఇన్నాళ్లు నేను ఎవరి పేరుతో అయితే బయట తిరుగుతున్నానో ఆ వ్యక్తి ఇతనే అంటాడు రిషి. అంటే అని అనుమానంగా అడుగుతున్న బుజ్జిని ఒరేయ్ ఆఫ్ నిక్కర్ గా అని పిలుస్తాడు ఆ వ్యక్తి.

Guppedanta Manasu August 24th 2024 Episode number 1163 Here is the Full story

నన్ను అలా పిలిచేది రంగా ఒక్కడే అని అతడిని పట్టుకొని ఎమోషనల్ అవుతాడు బుజ్జి. అది సరే కానీ అతని ప్లేస్ లో మీరు ఎందుకు వెళ్లారు అంటుంది వసుధార. మన వలన ఎవరికైనా నష్టం జరిగినప్పుడు వాళ్ల కష్టసుఖాలలో మనకి బాధ్యత ఉంటుంది. ఈ రంగా చిన్నప్పుడే ఊరు వదిలేసి సిటీకి వచ్చి మెకానిక్గా పనిచేస్తున్నాడు, ఇప్పుడు వాళ్ళ బామ్మకి బాగోలేదని, అప్పుల లో ఉన్నారని తెలిసి వాళ్ళ ఊరు వెళ్ళాలి ఆఖరు రోజుల్లో బామ్మ ని బాగా చూసుకోవాలి అనుకున్నాడు.

అదే సమయంలో నా కారు బాగు చేయమని అతనికి ఇచ్చాను. అయితే కారులో ఉన్న లెటర్స్ నాకు ఇవ్వటం కోసం వస్తూ ఉంటే నేను అనుకొని అతని మీద దుండగులు దాడి చేశారు. ఆఖరి నిమిషంలో తన గురించిన వివరాలు చెప్పి స్పృహ కోల్పోయాడు రంగా. అప్పుడు అతని దగ్గర మావయ్యని పెట్టి నేను అతని ప్లేస్ లో వాళ్ళ బొమ్మ దగ్గరికి వెళ్లాను అంటాడు రిషి. నేను బామ్మ దగ్గరికి వెళ్లడానికి రెడీగా ఉన్నాను అన్నయ్య అంటాడు రంగా. తప్పకుండా నిన్ను మీ బామ్మ దగ్గరికి పంపిస్తాను కాస్త ఓపిక పట్టు అని రంగాకి చెప్తాడు రిషి.

Guppedanta Manasu August 24th 2024 Episode number 1163 Here is the Full story

తర్వాత బుజ్జి తో కూడా అప్పుడే ఈ విషయం బామ్మతో చెప్పొద్దు అని చెప్తాడు. రిషి మాటలలో ఆ లెటర్ జగతి మేడం రాశారని తెలుసుకొని ఆశ్చర్య పోతుంది వసుధార. మరోవైపు సరోజ చెప్పిన విషయం శైలేంద్ర తల్లికి చెప్పడంతో షాక్ అవుతుంది దేవయాని. ఏ పని సరిగ్గా చేయవు, అసలు ముందు వచ్చినవాడు రిషియా, రంగావా అని క్లారిటీ తెచ్చుకో. వచ్చినవాడు రిషి అయితే మాత్రం మన గొయ్యి మనమే తీసుకున్న వాళ్ళం అవుతాము అని కొడుక్కి చివాట్లు పెడుతుంది దేవయాని.

మరోవైపు వసుధార ఫోన్ తీసుకొని సరోజకి ఫోన్ చేసి వసుధారని మాట్లాడమంటాడు రిషి. ఎందుకు అంటుంది వసుధార నాకు కొన్ని క్లారిటీలు కావాలి అంటాడు రిషి. సరే అని వసుధార సరోజతో మాట్లాడుతుంది. వాళ్ళ మాటలలో శైలేంద్రని సరోజ కలిసి నట్లు తెలుసుకున్న రిషి ఫోన్ కట్ చేసేస్తాడు. ఎందుకు సార్ ఫోన్ కట్ చేసేసారు అని అడుగుతుంది వసుధార. నాకు రావలసిన క్లారిటీ వచ్చేసింది అంటాడు రిషి. ఆ లెటర్లో అన్ని ఉన్నాయి అన్నారు కదా, మరి మీ అన్నయ్య వాళ్ల గురించి నిజం తెలిసినా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అని రిషి ని అడుగుతుంది వసుధార.

వాళ్లు ఎక్కడా తప్పుకి దొరకకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు, ఇప్పుడు ఈ లెటర్ అబద్ధం అని చెప్పటానికి కూడా వెనుకాడరు. అందుకే వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను అంటాడు రిషి. మరోవైపు మహేంద్ర ఇంటికి వస్తారు ఫణీంద్ర, శైలేంద్ర. మాటల్లో రిషి వాళ్ళ గురించి ఎంక్వయిరీ చేసిన తర్వాత మను ఇక్కడికి వచ్చాడా అని అడుగుతాడు శైలేంద్ర. ఎందుకు అంత గుచ్చి గుచ్చి అడుగుతున్నావు నా గురించి ఏమైనా చెప్పావా అంటాడు మహేంద్ర.

Guppedanta Manasu August 24th 2024 Episode number 1163 Here is the Full story

నేను ఏమని చెప్తాను, ఎందుకు చెప్తాను. మీరు ఏమైనా అతని కన్న తండ్రా అంటాడు శైలేంద్ర. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ కొడుకుని కోప్పడతాడు ఫణీంద్ర. అప్పుడే రిషి వాళ్ళు రావడంతో పలకరింపులు అయిన తరువాత ఇలా వచ్చారేంటి అని అడుగుతాడు రిషి. ఏమీ లేదు బాబాయ్ ని చూసి చాలా రోజులైంది కదా ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో చూద్దామని వచ్చాము అంటాడు శైలేంద్ర. ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X