Guppedanta Manasu, August 26th episode: మహేంద్ర ప్రాణాలు కాపాడిన రిషి.. మనుని అపార్థం చేసుకున్న వసుధార!

మీరు ఎవరిని కలవకండి, ఏమి మాట్లాడకండి. నిజాలన్నీ అనుపమ మేడం గారితోనే బయట పెట్టిస్తాను అని తండ్రికి మాటిస్తాడు రిషి . అసలు మీరు రంగా లా ఎందుకు నటిస్తున్నారు అని అడిగిన వసుధారకి క్లారిటీ ఇవ్వటం కోసం తనతో పాటు తీసుకువెళ్తాడు రిషి. అలాగే బుజ్జిని కూడా ఆ ప్లేస్ కి రమ్మంటాడు. అక్కడ అసలు రంగా ని పరిచయం చేసి ఎందుకు తను రంగ లా నటించాడో క్లారిటీ ఇస్తాడు.ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 26 వ తేదీ ఎపిసోడ్ 1,163ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నన్ను కాపాడిన వ్యక్తిని పరిచయం చేయటానికి వసుధార ని తీసుకువెళ్లాను అని చెప్తాడు రిషి. నన్ను కూడా తీసుకు వెళ్లాల్సింది కదా అని శైలేంద్ర అంటే మిమ్మల్ని కూడా త్వరలోనే తీసుకు వెళ్తాను అంటాడు. కాసేపు మాట్లాడిన తర్వాత మేము వచ్చి చాలా సేపు అయింది కొంచెం కాఫీ ఇస్తావా అని వసుధార ని అడుగుతాడు శైలేంద్ర. మహేంద్ర కూడా కాఫీ తెమ్మని చెప్పటంతో వసుధార లోపలికి వెళ్తుంది. అప్పుడు రిషిని తనతో పాటు బయటికి రమ్మంటాడు శైలేంద్ర. అంత సీక్రెట్స్ ఏముంటాయి ఇక్కడే మాట్లాడుకోండి అంటారు మహేంద్ర, ఫణీంద్ర.

Guppedanta Manasu August 26th 2024 Episode number 1164 Here is the Full story

అయితే శైలేంద్ర సైగ చేయడంతో వాళ్లకి నచ్చజెప్పి బయటికి వస్తాడు రిషి . అక్కడ శైలేంద్ర మాట్లాడుతూ అసలు నువ్వు రిషివా, రంగావా అని అనుమానంగా అడుగుతాడు. ఎందుకలా అంటున్నారు అంటాడు రిషి. నేను సరోజని కలిసాను, నీకు వసుధార ఫోటో చూపించి తెలుసా అని అడిగితే ఎందుకు తెలియదు అని చెప్పావు అని అనుమానంగా అడుగుతాడు శైలేంద్ర. పాండు ఫోటో చూపించి ఇతడు మేడం గారిని చంపబోతే నేనే రక్షించాను, తర్వాత కూడా అతను మా ఊరు వచ్చి మేడం గారి కోసం వెతికాడు, మీరు కూడా వాళ్లకి సంబంధించిన వాళ్ళేమో అనుకోని నిజం చెప్పలేదు.

అయినా మీరు నన్ను అనుమానించడం ఏమీ బాగోలేదు, అలా అయితే నేను మిమ్మల్ని ఎన్నిసార్లు అనుమానించాలి, మీరు నన్ను ఇక్కడికి తీసుకు వచ్చేటప్పుడు ఏమని చెప్పారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మేడం గారు మీ గురించి ఏవేవో చెప్తున్నారు ఎండీ పదవి మీద ఆశ లేదని చెప్పిన మీరు అదే ఎండి పదవి కోసం రిషి వాళ్ళ అమ్మగారిని బెదిరించారంట, రిషి ని కూడా చంపటానికి ప్రయత్నించారంట అయినా కూడా నేను మిమ్మల్ని అనుమానించానా.. లేదు కదా.

Guppedanta Manasu August 26th 2024 Episode number 1164 Here is the Full story

మీరు ఇలా పదేపదే నన్ను అనుమానిస్తుంటే చెప్పా పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని బెదిరిస్తాడు రిషి. ఇంతలో వసుధార కాఫీ కి పిలవడంతో ఇద్దరూ లోపలికి వెళ్లాలనుకుంటారు కానీ అంతలో శైలేంద్రకి ఏదో ఫోన్ రావడం తో రిషి ని పంపించి తాను ఫోన్ మాట్లాడుతాడు శైలేంద్ర. మాటల్లో అంతా రెడీయే కదా అసలు మిస్ అవ్వకూడదు అని శైలేంద్ర మాట్లాడటం చాటుగా వింటాడు రిషి. లోపలికి వెళ్ళాక అందరూ కాఫీలు తాగిన తర్వాత ఫణింద్ర వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు.

ఫణీంద్ర, శైలేంద్ర బయటకి వస్తే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మహేంద్ర కూడా బయటికి వస్తాడు. ఫణీంద్ర వాళ్లు కారులో కూర్చున్న తరువాత గన్ పేల్చిన సౌండ్ వినిపిస్తుంది. పని ఫినిష్ అయింది అనుకుంటాడు శైలేంద్ర. కానీ తన తండ్రిని పక్కకు లాగి కాపాడుకుంటాడు రిషి. ప్లాన్ ఫెయిల్ అయినందుకు తిట్టుకుంటాడు శైలేంద్ర. పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అంటాడు ఫణీంద్ర. కంగారుపడుతూ వద్దు అంటాడు శైలేంద్ర. ఇంత ప్రమాదం జరిగితే పోలీస్ కంప్లైంట్ వద్దంటావేంటి అని కొడుకుని మందలిస్తాడు ఫణీంద్ర.

Guppedanta Manasu August 26th 2024 Episode number 1164 Here is the Full story

వద్దులేండి పెదనాన్న, నేనున్నాను కదా నాన్నని చూసుకుంటాను ఇప్పుడిప్పుడే మేము ప్రశాంతంగా ఉంటున్నాము మళ్లీ పోలీసులు గొడవలు వద్దు అని చెప్పడంతో ఫణీంద్ర వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తరువాత మహేంద్ర నా కొడుకు ఉన్నాడు కాబట్టి రక్షించుకున్నాడు లేదంటే ఏం జరిగేదో అంటాడు. నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది నాకేమీ అర్థం కావడం లేదు అంటాడు. నాకు అర్థమైంది ఇప్పుడే వస్తాను అంటూ రిషి మహేంద్ర పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది వసుధార. తను ఎక్కడికి వెళ్తుంది అంటాడు మహేంద్ర.

తను కన్ఫ్యూజన్లో ఉంది, అక్కడికి వెళ్తే తనకే క్లారిటీ వస్తుంది వెళ్ళనివ్వండి అంటాడు రిషి. మరోవైపు శైలేంద్ర సరోజ కి ఫోన్ చేసి మీ బావని ఆ వసుధార నీకు దక్కనీయకుండా చేస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు మా బావ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతుంది సరోజ. అడ్రస్ పంపిస్తాను వెళ్లి మీ బావని కాపాడుకో అంటాడు శైలేంద్ర. నాకు అడ్రస్ పంపించండి నేను చూసుకుంటాను అంటుంది సరోజ.

Guppedanta Manasu August 26th 2024 Episode number 1164 Here is the Full story

మరోవైపు వసుధార మను దగ్గరికి వెళ్లి తనే అటాక్ చేసాడేమో అనుకొని అతడికి చివాట్లు పెడుతుంది. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అయినా నేను మహేంద్ర సార్ మీద ఎందుకు అటాక్ చేస్తాను, ఆయనకి నాకు ఏమైనా శత్రుత్వం ఉందా లేదంటే బంధుత్వం ఉందా అని అడుగుతాడు మను. సమాధానం చెప్పలేక తడబడుతుంది వసుధార. ఇప్పుడు కూడా మీరు నిజం చెప్పలేకపోతున్నారు అని మనసులో అనుకుంటాడు మను . తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X