Guppedanta Manasu, August 27th episode: మను తల్లి అనుపమ కాదా? రిషి మాటలకి షాక్ లో రాధమ్మ!

అసలు మీరు రంగా లా ఎందుకు నటిస్తున్నారు అని అడిగిన వసుధారకి క్లారిటీ ఇవ్వటం కోసం తనతో పాటు తీసుకువెళ్తాడు రిషి. అలాగే బుజ్జిని కూడా ఆ ప్లేస్ కి రమ్మంటాడు. అక్కడ అసలు రంగా ని పరిచయం చేసి ఎందుకు తను రంగ లా నటించాడో క్లారిటీ ఇస్తాడు. మహేంద్ర ని చంపాలని ప్లాన్ చేస్తాడు శైలేంద్ర. విషయం ముందే గ్రహించిన రిషి తండ్రిని కాపాడుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 27 వ తేదీ ఎపిసోడ్ 1,164ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నేనెందుకు మహేంద్ర సార్ మీద అటాక్ చేస్తాను, ఆయన నాకు ఏమైనా శత్రువా, బంధువా అని అడుగుతాడు మను. నిజం చెప్పలేక ఇబ్బంది పడుతుంది వసుధార. తర్వాత తనే మాట్లాడుతూ మీరు మీ తండ్రి గురించి శైలేంద్ర ద్వారా తెలుసుకున్నారని నాకు తెలుసు, మహేంద్ర మీ తండ్రి అన్న విషయం మీకు తెలుసు అని కూడా నాకు తెలుసు, అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మీ తల్లి గురించి అంటుంది వసుధార. ఏం మాట్లాడుతున్నారు అంటాడు మను.

Guppedanta Manasu August 27th 2024 Episode number 1165 Here is the Full story

నిజం మాట్లాడుతున్నాను, అనుపమ మేడం మిమ్మల్ని కేవలం పెంచిన తల్లి మాత్రమే మీరు మీ తల్లి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటుంది వసుధార. మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు కానీ మహేంద్ర సార్ మీద అటాక్ చేసింది నేను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మను. మరి మావయ్య మీద అటాక్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది అనుకుంటుంది వసుధార. మరోవైపు శైలేంద్ర మీద తన కొడుకే అటాక్ చేయించాడని తెలిసి కొడుకుని చివాట్లు పెడుతుంది దేవయాని.

బాబాయిని పైకి పంపించేసి నేరం మను మీదకి నెట్టేద్దాం, తర్వాత రిషి దగ్గర ఎండి పదవి తీసుకుని అతడిని కూడా పైకి పంపించేయొచ్చు అనుకున్నాను కానీ ఇలా ప్లాన్ ఫెయిల్ అవుతుంది అనుకోలేదు అంటాడు శైలేంద్ర. ఇకపై ఇలాంటి పిచ్చి పనులు పెట్టుకోవద్దు అంటుంది దేవయాని, అంతలోనే భర్త రావడం గమనించి కొడుకుని హెచ్చరిస్తుంది. ఫణీంద్ర దేవయాని వాళ్ళ దగ్గర కూర్చుంటే మహేంద్ర మీద అటాచ్ చేసింది ఎవరు అంటారు అంటూ ఏమీ తెలియని దానిలాగా అడుగుతుంది. అదే నాకు అర్థం కావడం లేదు, నా తమ్ముడికి ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది లేదంటే నా ప్రాణం పోయేది.

Guppedanta Manasu August 27th 2024 Episode number 1165 Here is the Full story

అన్ని పనులు మానుకొని ఎవరు అటాక్ చేశారో తెలుసుకోవడమే పనిగా పెట్టుకుంటాను, ఒకవేళ నేను ఊరుకున్నా రిషి ఊరుకోడు, వాడి కళ్ళల్లో క్రోధం చూస్తే నాకే భయం వేసింది, ఎవరు మహేంద్ర మీద అటాక్ చేశారో కానీ వాడికి చివరి రోజులు ఆరంభమైనట్లే అంటాడు ఫణీంద్ర. ఆ మాటలకి భయపడుతూ ఉంటాడు శైలేంద్ర. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు ఎందుకింత కూల్ వెదర్ లో చెమటలు పడుతున్నాయి అని భర్తని అనుమానంగా అడుగుతుంది ధరణి.

ఏమీ లేదు బాబాయ్ పై జరిగిన ఎటాక్ దగ్గర నుంచి చూసాను కదా అది ఇంకా మర్చిపోలేక పోతున్నాను అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. మరోవైపు వసుధార మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ వస్తువులను నేలకేసి కొడతాడు మను. ఆ శబ్దానికి మను దగ్గరికి వచ్చిన అనుపమ ఏం జరిగింది అని అడుగుతుంది. చెప్తే నువ్వు ఏమైనా తీరుస్తావా, సమాధానం తెలిసినా నువ్వు ఏమీ చెప్పవు కదా మరి ఎందుకు కారణాలు అడుగుతావు అని అనుపమ మీద కోప్పడతాడు మను. తరువాత నా కన్నతల్లి నువ్వేనా అని అడుగుతాడు.

Guppedanta Manasu August 27th 2024 Episode number 1165 Here is the Full story

మౌనంగా ఉన్నా అనుపమతో ఇన్నాళ్లు నేను అనుభవించిన నరకయాతన చాలు ఇకమీదట నేను భరించలేను ఈరోజు ఎట్టి పరిస్థితులలోనూ నాకు నిజం తెలిసి తీరాలి అని పట్టు పట్టి కూర్చుంటాడు మను. మరోవైపు నిజం తెలుసుకుంటానని వెళ్ళావు కదా తెలిసిందా అని వసుధారని అడుగుతాడు రిషి. నేను పొరపాటు పడ్డాను, మను అటాచ్ చేసాడేమో అనుకున్నాను కానీ అతని మాటలని బట్టి అతను అటాచ్ చేయలేదనిపిస్తుంది అంటుంది వసుధార. అనిపించడం కాదు అదే నిజం డాడ్ పై అటాక్ చేసింది మను కాదు అన్నయ్య అంటాడు రిషి. ఆ మాటలకి షాక్ అవుతుంది వసుధార.

నిజం తెలిసి కూడా ఎందుకు ఊరుకుంటున్నారు అంటుంది. శిక్ష పడాల్సిన వాళ్ళకి పడేటట్లు చేస్తాను కాకపోతే కాస్త ఓపిక పట్టు అన్నయ్య చేసిన పాపాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను అంటాడు రిషి. అంతలోనే అక్కడికి రాధమ్మని తీసుకొని వస్తుంది సరోజ. రిషి ని చూసిన రాధమ్మ ఎమోషనల్ అవుతుంది. మనవడు లేకపోవడం వలన తను పడిన బాధ గురించి చెప్పుకొని ఇకనైనా తనతో పాటు వచ్చేయమని అడుగుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మహేంద్ర రంగా ఎవరు అని అడుగుతాడు.

Guppedanta Manasu August 27th 2024 Episode number 1165 Here is the Full story

మనిషిని ఎదురుగా పెట్టుకుని ఎవరు అంటారేంటి అంటూ రిషి ని చూపిస్తుంది రాధమ్మ. మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు తను నా కొడుకు రిషి అంటాడు మహేంద్ర. నువ్వు రిషి కాదని రంగా అని ఆయనతో చెప్పు అని రిషితో అంటుంది రాధమ్మ. చెప్పలేను ఎందుకంటే నేను రంగా ని కాదు రిషి ని ఆయన కొడుకుని అంటూ మహేంద్రని చూపిస్తాడు రిషి. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతారు రాధమ్మ, సరోజ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X