Guppedanta Manasu Aug 28th:రాధమ్మకి నమ్మలేని నిజం చెప్పిన రిషి..స్వయంగా చూసి నిజం నిర్ధారించుకున్న శైలేంద్ర!

బుజ్జి కి, వసుధారకి అసలు రంగా ని పరిచయం చేసి ఎందుకు తను రంగాలా నటించాడో క్లారిటీ ఇస్తాడు. మహేంద్ర ని చంపాలని ప్లాన్ చేస్తాడు శైలేంద్ర. విషయం ముందే గ్రహించిన రిషి తండ్రిని కాపాడుకుంటాడు. ఆ పని శైలేంద్ర చేశాడని తెలుసుకున్న దేవయాని కొడుకుని మందలిస్తుంది. మీ బావని ఆ వసుధార సొంతం చేసుకుంటుంది వెళ్లి మీ బావని దక్కించుకో అని సరోజని రెచ్చగొట్టి పంపిస్తాడు శైలేంద్ర ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 28 వ తేదీ ఎపిసోడ్ 1,165ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

నేను మీ మనవడిని కాదు,ఆయన కొడుకుని అంటూ మహేంద్ర ని చూపిస్తాడు రిషి. ఏం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావటం లేదు నా కాళ్లు చేతులు వణుకుతున్నాయి, ఏంటమ్మా వసుధార, మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను ఎంత బాగా చూసుకున్నాను ఆఖరికి నువ్వు సరోజ చెప్పినట్లే చేశావు, మా రంగా ని రిషిలాగా మార్చేసావు అని కోప్పడుతుంది రాధమ్మ. ఆవేశపడకండి బామ్మ ఒకసారి ఆయన చెప్పేది వినండి అంటుంది సరోజ. అప్పుడు రిషి మాట్లాడుతూ రాధమ్మకి జరిగిందంతా చెప్తాడు.నేను ఇప్పుడే మీ మనవడి దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్తాడు.

Guppedanta Manasu August 28th 2024 Episode number 1166 Here is the Full story

అంతలోనే సరోజ పక్కకి వెళ్లి శైలేంద్ర కి ఫోన్ చేసి అతను రంగా కాదంట రిషి అంట, ఎవరినో రంగా లాగా సెట్ చేసి మీరు మా బావని ఇక్కడే ఉంచేయాలని చూస్తున్నారు ఎంత పెద్ద ప్లాన్ వేశారు అంటుంది సరోజ. ఆ మాటలకి శైలేంద్ర తల తిరిగిపోతుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, సరిగ్గా నే విన్నావా అని కంగారుగా అడుగుతాడు. అతను క్లియర్ గా చెప్తున్నాడు అంతేకాదు అసలు రంగా దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్తానంటున్నాడు అని చెప్తుంది సరోజ. నాకు లొకేషన్ పెట్టు నేను కూడా వస్తాను అంటాడు శైలేంద్ర.

సరే అంటుంది సరోజ. ఇంతలో రాధమ్మ పిలవడంతో అక్కడికి వెళ్తుంది సరోజ. వసుధార వాళ్లకి చెప్పి రాధమ్మని, సరోజని తీసుకొని రంగా దగ్గరికి వెళ్తాడు రిషి. అక్కడ జరిగింది అర్థం కాకపోవటంతో కన్ఫ్యూజ్ అవుతాడు మహేంద్ర. అదే విషయం కోడల్ని అడుగుతాడు. అప్పుడు వసుధార జరిగిందంతా మహేంద్ర కి చెప్తుంది. నా కొడుకు ఇన్ని కష్టాలు పడ్డాడా అని బాధపడతాడు మహేంద్ర. ఇంతకీ ఆ లెటర్ ఎవరు రాశారు అని అడుగుతాడు. అత్తయ్య రాశారు అని వసుధర చెప్పటంతో షాక్ అవుతాడు మహేంద్ర.

Guppedanta Manasu August 28th 2024 Episode number 1166 Here is the Full story

లెటర్ లో ఏం రాసి ఉంది, ఇప్పుడు ఆ లెటర్ ఎక్కడ ఉంది నేను కూడా ఆ లెటర్ ని చదువుతాను అంటాడు మహేంద్ర. రిషి సార్ దగ్గర ఉంది వచ్చాక అడిగి తీసుకుందాం అంటుంది వసుధార. మరోవైపు చక్రపాణి ఇంటికి రాధమ్మని సరోజ ని తీసుకువెళ్తాడురిషి. శైలేంద్ర కూడా దొంగ చాటుగా ఆ ఇంటికి వస్తాడు అప్పుడు రాధమ్మకి రంగా ని పరిచయం చేసి తాను రంగా గా ఆ ఇంట్లోకి ఎందుకు వచ్చాడో చెప్తాడు. మనవడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది రాధమ్మ. సరోజ మాత్రం అతను రంగా అవునో కాదో అని అనుమాన పడుతుంది.

ఆమె అనుమానం తీరుస్తాడు రంగా. నాకోసం నా ఆరోగ్యం కోసం ఇంత కష్టపడ్డావా అని రిషి పై ఆప్యాయత చూపిస్తుంది రాదమ్మ, ఇంటికి రమ్మని కూడా ఆహ్వానిస్తుంది. సరోజ మీరే మా బావ అనుకుని పొరపాటు పడ్డాను క్షమించండి అని చెప్తుంది. పర్వాలేదు మీకు తెలియకే చేశారు కదా అంటాడు రిషి. తర్వాత రాధమ్మ తో ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి అవి చూసుకొని వస్తాను అని చెప్పి రాధమ్మని ఆరోగ్యం బాగా చూసుకోమని చెప్తాడు రిషి. రాధమ్మ వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతారు.

Guppedanta Manasu August 28th 2024 Episode number 1166 Here is the Full story

అక్కడ శైలేంద్ర వాళ్లకి ఎదురుపడి అదేంటి అలా వెళ్ళిపోతున్నారు అంటాడు. అవును ఇన్నాళ్లు మా బావ అతను అనుకున్నాము కానీ కాదు ఇతనే మా బావ అని తెలిసింది, మీకు కూడా థాంక్స్ అంటుంది సరోజ. ఇతను పెళ్లి చూపుల్లో వచ్చిన వ్యక్తి కదా అంటుంది రాధమ్మ. అవును అయినా ఇప్పుడు ఆ గొడవ అంత ఎందుకు మా బావ నా దగ్గర ఉన్నాడు పదా అంటూ రాధమ్మని రంగా ని తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతుంది సరోజ. చాలా పెద్ద తప్పు చేశాను, ఇక నేను మిగలాలంటే మిగిలిన వాళ్ళని ఉంచకూడదు అనుకుంటాడు శైలేంద్ర.

మరోవైపు ఇంటికి వచ్చిన రిషితో జరిగిందంతా వసుధార చెప్పింది ఆ పెద్ద ఆవిడ ప్రాణాలు కోసం అంత ఆస్తిని వదిలేసి ఆటో నడిపావా అని బాధగా ఉంటాడు మహేంద్ర. ఆటో నడపడంలో తప్పేముంది, నా ప్రాణాలు కాపాడబోయి తను ప్రాణాలు మీదికి తెచ్చుకున్నాడు అలాంటిది తన వాళ్ళని అలాగే వదిలేస్తామా, పైగా తన మనవడు వస్తాడని ఎదురు చూస్తున్న ఆ పెద్దావిడ కి మనవడికి ఇలా జరిగిందని చెప్తే ఆమె తట్టుకుంటుందా అందుకే రంగా లా నటించవలసి వచ్చింది అంటాడు రిషి.

నీకు అమ్మ ఏదో లెటర్ రాసిందంట కదా ఏం రాసింది అని అడుగుతాడు మహేంద్ర. చాలా రాసింది డాడ్ మన వెనక జరిగిన కుట్రల గురించి, జరిగిన అరాచకాల గురించి ఇంకా మీ గురించి, అనుపమ మేడం గురించి అందరి గురించి రాసింది అని చెప్తాడు. ఆ లెటర్ నేను కూడా చదువుతాను అంటాడు మహేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X