Guppedanta Manasu, Aug 2nd episode: భయంతో వణికిపోతున్న దేవయాని.. జగతిని చూపించమంటున్న మహేంద్ర!

రంగా ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసిన వసుధార కి రంగాయే రిషి అన్న క్లారిటీ వస్తుంది. రంగా కి రిషి గా ట్రైనింగ్ ఇస్తాడు శైలంద్ర. రిషి, వసుధార లు మహేంద్ర ఇంట్లో కలుసుకుని ఎమోషనల్ అవుతారు. రిషి కాలేజీ దక్కించుకోవడం కోసం ఏం చేయాలో వసుధారకి చెప్తాడు. కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చిన వసుధార ని చూసి భయంతో వణికి పోతాడు శైలేంద్ర. కాలేజీకి తనని ఎండిగా ప్రకటించకపోవడంతో షాక్ లో కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 2వ తేదీ ఎపిసోడ్ 1,143ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

కొడుకు దగ్గరికి వచ్చిన ఫణీంద్ర అలా కళ్ళు తిరుగుపడిపోయావేంటి అంటాడు. ఎమోషన్ లో అలా పడిపోయాను అంటాడు శైలేంద్ర. అంత ఎక్కువ ఎమోషన్ ఎందుకు వచ్చింది అని వెటకారంగా అంటాడు మహేంద్ర. అదేంటి బాబాయ్ అలా అంటావు, ఎప్పటినుంచో అనిపించకుండా పోయినా రిషి వసుధారలు కనిపించేసరికి ఎమోషనల్ అయిపోయాను అంటాడు శైలేంద్ర. సరేలే కాలేజీ చేయి జారిపోతుంది అనుకునే సమయానికి కనిపించకుండా పోయిన బిడ్డలు తిరిగివచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక మనం అందరం కలిసి ఇక్కడే ఉందాము అంటాడు ఫణీంద్ర. కానీ అందుకు ఒప్పుకోడు మహేంద్ర.

Guppedanta Manasu August 2nd 2024 Episode number 1143 Here is the Full story

సరే అయితే కనీసం ఈ ఒక్క రోజైనా ఇక్కడ ఉండండి అందరం కలిసి భోజనం చేద్దాం అంటాడు ఫణీంద్ర. అందుకు ఒప్పుకుంటాడు రిషి. తరువాత గదిలో మహేంద్ర రిషి తో మాట్లాడుతూ ఇన్నాళ్లు ఏమైపోయావు, నీకోసం మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా,వసుధార నీకోసం ఎంతో తపన పడింది అంటూ జరిగిందంతా చెప్తాడు. అప్పుడే ధరణి వచ్చి నేను చెప్పాను కదా మావయ్య వసుధార తిరిగి వస్తుందని అంటుంది. తర్వాత వసుధారతో మాట్లాడుతూ నీకు రిషి ఎక్కడ కనిపించాడు అని అడుగుతుంది.

వసుధార ఏదో చెప్పబోతుంది కానీ అంతలోనే శైలేంద్ర రావడంతో కాలేజీ గేటు దగ్గర కనిపించారు అని చెప్తుంది. వాళ్ళు చాలా రోజుల తర్వాత కలిసారు వాళ్ళు మాట్లాడుకుంటారు పదండి అని చెప్పి భర్తను తీసుకొని వెళ్ళిపోతుంది ధరణి. నెక్స్ట్ సీన్ లో కొడుకు చెంప పగల కొడుతుంది దేవయాని. ఒక్కపని కూడా సరిగ్గా చేయవా అసలు నువ్వు దేనికి పనికిరావు అని కోప్పడుతుంది. అదేంటి మమ్మీ ఆ రంగా ని నువ్వే కదా రిషి ప్లేస్ లో తీసుకొని రమ్మన్నావు అంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu August 2nd 2024 Episode number 1143 Here is the Full story

నేను వసుధార గురించి మాట్లాడుతున్నాను, తను చనిపోయిందని చెప్పావు నువ్వు, తను చనిపోయింది ఏమో అనుకొని నేను రిషి ప్లేస్ లో రంగా ని తీసుకు రమ్మన్నాను ఇప్పుడు ఆ వసుధార రిషి కాదు రంగా అని పసిగట్టిందంటే జరిగింది మొత్తం మన మెడకి చుట్టుకుంటుంది అని టెన్షన్ పడుతుంది దేవయాని. వసుధార ని చంపేసాను అని చెప్పి నన్ను ఆ పండుగాడు మోసం చేశాడు అని కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర.

ఇప్పటికైనా మించి పోయింది లేదు ఆ రంగాని అడ్డుపెట్టుకొని కాలేజీని సొంతం చేసుకుంటాను. అలా కుదరకపోతే నేను అయినా చస్తాను, లేదంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను అంటాడు శైలేంద్ర. తర్వాత భోజనానికి వెళ్దాం పద అని తల్లితో అంటే ఇలాంటి పరిస్థితులలో నీకు భోజనం ఎలా చేయాలనిపిస్తుంది అని కోప్పడుతుంది దేవయాని. వెళ్లకపోతే డాడీ కి అనుమానం వస్తుంది అని తల్లిని ఒప్పించి భోజనానికి తీసుకువెళ్తాడు శైలేంద్ర.

Guppedanta Manasu August 2nd 2024 Episode number 1143 Here is the Full story

భోజనాల దగ్గర వసుధార రిషితో క్లోజ్ గా ఉండడం చూసిన దేవయాని శైలేంద్ర తో మాట్లాడుతూ వసుధార రంగాని చూసి రిషి కాదు అని గుర్తించలేకపోయింది ఏంటి, నిజంగా వాడు రంగాయేనా లేకపోతే రిషియా అని అనుమానంగా అడుగుతుంది. వాడు నిజంగా రంగాయే రిషి లా నటించడం కాదు జీవించేస్తున్నాడు ఈ విషయంలో నువ్వు ఏమీ కంగారు పడకు అంటాడు శైలేంద్ర. ఏం మాట్లాడుకుంటున్నారు అంటాడు ఫణీంద్ర.

అదేనండి మహేంద్ర వాళ్ళు ఇక్కడే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అదే డిస్కస్ చేస్తున్నాను అంటుంది దేవయాని. అది మహేంద్ర ఇష్టం ఉండాలనుకుంటే ఉంటాడు లేదంటే లేదు అంటాడు ఫణీంద్ర. రిషి చెప్తే ఒప్పుకుంటాడు కదా అంటూ రిషి కి సైగ చేస్తాడు శైలేంద్ర. శైలేంద్ర కి అనుమానం రాకూడదు అని ఇక్కడే ఉందాం అంటాడు రిషి కానీ పక్కనే ఉన్న వసుధార కి సైగ చేస్తాడు. అర్థం చేసుకున్న వసుధార ఇక్కడ ఉండను అంటుంది. నా కోడలి మాట కాదనలేను అంటాడు మహేంద్ర.

సరే మీ ఇష్టం అంటాడు ఫణీంద్ర. తర్వాత రిషి వసుధార ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటారు. నాకు ఇంతకుముందు చందమామలో నువ్వు కనిపించే దానివి కానీ ఇప్పుడు నా పక్కనే ఉన్నావు అంటాడు రిషి. నాకు మాత్రం చందమామలో జగతి మేడం కనిపిస్తున్నారు అంటుంది వసుధార. అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర అయితే నాకు కూడా చూపించవా అని అడుగుతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X