ఎట్టకేలకు భార్య కొడుకుల నిజస్వరూపం తెలుసుకున్న ఫణీంద్ర..తల్లి, కొడుకుల నిర్వాకం సాక్షాలతో సహా బయటపెట్టిన రిషి!
శైలేంద్ర మహేంద్ర ని చంపే ప్రయత్నం చేశాడని తెలుసుకున్న దేవయాని కొడుకుని మందలిస్తుంది. మీ బావని ఆ వసుధార సొంతం చేసుకుంటుంది వెళ్లి మీ బావని దక్కించుకో అని సరోజని రెచ్చగొట్టి పంపిస్తాడు శైలేంద్ర. రిషి రాధమ్మకి నిజం చెప్పి అసలు రంగాని ఆమెకి అప్పగిస్తాడు. రంగా గా వచ్చింది రిషి అని కన్ఫర్మ్ చేసుకున్న శైలేంద్ర తన గురించి తెలిసిన అందర్నీ లేపేయాలి అనుకుంటాడు. మరోవైపు జగతి రాసిన లెటర్ చదివిన మహేంద్ర కోపంతో రగిలిపోతాడు, శైలేంద్రని చంపేస్తానంటూ బయలుదేరుతాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 30 వ తేదీ ఎపిసోడ్ 1,167ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
శైలేంద్రని చంపేస్తానంటూ బయలుదేరిన మహేంద్ర కి దారిలోనే ఎదురవుతాడు శైలేంద్ర. ఇంత కోపంగా ఎక్కడికి బయలుదేరారు బాబాయ్ అని అడుగుతాడు శైలేంద్ర. నీ గురించిన అన్ని నిజాలు తెలిసిపోయాయి నిన్ను క్షమించను అంటూ అతని కాలర్ పట్టుకుంటాడు మహేంద్ర. అంతలో రౌడీలు మహేంద్ర మీద అటాక్ చేస్తారు, వాళ్లతో ఫైట్ చేసి ఓడిపోతాడు మహేంద్ర. స్పృహ కోల్పోయిన మహేంద్రని కిడ్నాప్ చేస్తాడు శైలేంద్ర. మహేంద్ర ని ఒక కుర్చీకి కట్టేసి నా గురించిన నిజాలన్నీ మీకు ఎలా తెలిసాయి అని అడుగుతాడు.

జగతి మీరు చేసిన అరాచకాలన్నీ ఒక లెటర్ లో రాసింది అంటాడు మహేంద్ర. పిన్ని ఇంకా చాలా విషయాలు రాయలేదు బాబాయ్ అంటూ మను తండ్రి విషయం చెప్పబోతాడు శైలేంద్ర. మనుకు తండ్రి నేనే అని నాకు తెలుసు. నీకు తెలియని ఇంకొక విషయం ఏమిటంటే మను అనుపమ కొడుకు కాదు జగతి కొడుకు అంటాడు మహేంద్ర.
ఆ మాటలకి షాక్ అయినా శైలేంద్ర నేను నీకు షాక్ ఇద్దామంటే నువ్వు నాకు షాక్ ఇస్తున్నావేంటి అయినా నీకు తెలియని చాలా విషయాలు చెప్తాను అంటూ తాను చేసిన అరాచకాలు అన్ని చెప్తాడు శైలేంద్ర. తర్వాత రౌడీలతో మాట్లాడుతూ నేను బయటకు వెళ్లిన తరువాత ఈయనని చంపేయండి, ఈయన నా సొంత బాబాయి నా కళ్ళ ముందే ఆయన ప్రాణం పోతుంటే చూడలేను, చాలా స్మూత్ గా చంపండి అని చెప్పి బయటికి వెళ్లిపోతాడు.

మరోవైపు ఆవేశంగా శైలేంద్ర ఇంటికి వచ్చిన వసుధార కోపంగా అతడిని పిలుస్తుంది. అక్కడే ఉన్న ఫణీంద్ర ఏం జరిగిందమ్మ ఎందుకంత ఆవేశంగా ఉన్నావు అని అడుగుతాడు. మావయ్య కనిపించడం లేదు సార్ అంటుంది వసుధార. అప్పుడే అక్కడికి దేవయాని, ధరణి, శైలేంద్ర వస్తారు. బాబాయి కనిపించడం లేదా అని అమాయకంగా అడుగుతాడు శైలేంద్ర నాటకాలు ఆడొద్దు మా మామయ్య ని ఏం చేశావు అని అడుగుతుంది వసుధార.
మహేంద్ర కనిపించకపోవడానికి శైలేంద్ర కి ఏంటి సంబంధం అని అడుగుతాడు ఫణీంద్ర. సంబంధం ఉంది మావయ్య అంటూ లెటర్ అతని చేతిలో పెడుతుంది వసుధార. ఏంటిది అంటాడు ఫణీంద్ర. ముందు చదవండి సార్ అన్ని విషయాలు మీకే తెలుస్తాయి అనటంతో లెటర్ ని చదివిన ఫణీంద్ర గుండె పట్టుకొని కుప్పకూలిపోతాడు. అందరూ కంగారు పడతారు. దేవయాని ఆ లెటర్ లో ఏముంది, ఎందుకు ఆయన అలా పడిపోయారు అని అడుగుతుంది.

మీ భాగోతం అంతా అందులో ఉంది, జగతి మేడం రాశారు అంటుంది వసుధార. అబద్ధం లెటర్ తను రాసి ఉండదు నువ్వే రాసి ఉంటావు అంటుంది దేవయాని. అప్పటికే కోపంగా ఉన్న ఫణీంద్ర దేవయానిని కోప్పడి ఆ అవసరం వసుధారకి ఏమిటి అంటాడు. తనకి ముందు నుంచి మేమంటే పడదు అంటూ ఏవేవో చెప్పటానికి ప్రయత్నిస్తారు తల్లి కొడుకులు కానీ ధరణి మాట్లాడుతూ వసుధార చెప్పింది నిజం అంటూ తల్లి కొడుకులు చేసిన అరాచకాలని చెప్తుంది.
ఇవన్నీ నీకు ముందే తెలుసా అని అడుగుతాడు ఫణీంద్ర. తెలుసు అంటుంది ధరణి. మరి నాకెందుకు చెప్పలేదు అంటాడు ఫణీంద్ర. తెలిస్తే మీరు తట్టుకోలేరని, మీకు చెప్పొద్దని చిన్న అత్తయ్య నా దగ్గర మాట తీసుకుంది ధరణి. వాళ్ల మాటలు నమ్మొద్దు డాడీ ధరణి కూడా వసుధారతో కలిసిపోయింది అంటాడు శైలేంద్ర అంతలోనే ఇంక చాలు ఆపు అంటూ మహేంద్ర అనటంతో షాక్ అయి అందరూ అటువైపు చూస్తారు.

అక్కడ మహేంద్ర, రిషి ఉండటం చూసి బాబాయ్ బ్రతికే ఉన్నాడా అనుకుంటాడు శైలేంద్ర. తమ్ముడు దగ్గరికి వచ్చిన ఫణీంద్ర నా ప్రాణాల కోసం మీరు ఇన్ని బాధలు పడ్డారా నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అంటూ ఎమోషనల్ అవుతాడు. వాళ్లు చేసిన తప్పులకి మీరేం చేస్తారు అంటాడు మహేంద్ర. అయినా కూడా దేవయాని, శైలేంద్ర అబద్ధం చెప్పాలని చూస్తారు. అప్పుడు రిషి ఒక వీడియో ఫణింద్రకీ చూపిస్తాడు.
ఆ వీడియో చూసిన ఫణీంద్ర కొడుకుని కూడా చూడమని ఫోన్ శైలేంద్రకి ఇస్తాడు. ఇందాక మహేంద్ర తో తను చేసిన అరాచకాలు గురించి చెబుతున్నప్పటికీ వీడియో అది. ఇది కూడా అబద్ధమేనా అన్నయ్య అంటాడు రిషి. ఏమి మాట్లాడలేక పోతాడు శైలేంద్ర. నాన్న ఎలా తప్పించుకున్నారు, అసలు ఈ వీడియో ఎవరు తీశారు అని నీకు అర్థం కావడం లేదు కదా అన్నయ్య అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











