Guppedanta Manasu, August 31st episode: ఆఫీస్ బాయ్ గా శైలేంద్ర.. గుప్పెడంత మనసుకు హ్యాపీ ఎండింగ్!
రిషి రాధమ్మకి నిజం చెప్పి అసలు రంగాని ఆమెకి అప్పగిస్తాడు. రంగాగా వచ్చింది రిషి అని కన్ఫర్మ్ చేసుకున్న శైలేంద్ర తన గురించి తెలిసిన అందర్నీ లేపేయాలి అనుకుంటాడు. మరోవైపు జగతి రాసిన లెటర్ చదివిన మహేంద్ర కోపంతో రగిలిపోతాడు, శైలేంద్రని చంపేస్తానంటూ బయలుదేరుతాడు. తర్వాత వసుధార శైలేంద్ర ఇంటికి వచ్చి జరిగిందంతా ఫణింద్రకీ చెప్తుంది. అంతలోనే మహేంద్ర రిషి అక్కడికి రావడం చూసి షాక్ అవుతాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 31 వ తేదీ ఎపిసోడ్ 1,168ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
ఇదంతా ఎలా జరిగిందని ఆశ్చర్య పడుతున్నావు కదా అంటూ జరిగింది చెప్పడం ప్రారంభిస్తాడు రిషి. మహేంద్ర ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత కంగారు పడుతున్న వసుధార వాళ్ళకి మను ఫోన్ చేస్తాడు. మహేంద్ర సార్ ని శైలేంద్ర కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు నేను వాళ్లని ఫాలో అవుతున్నాను, లొకేషన్ షేర్ చేస్తాను మీరు కూడా అక్కడికి వచ్చేయండి అని చెప్తాడు. మేము వచ్చే పరిస్థితులలో లేము అంటూ జరిగింది చెప్తుంది వసుధార.

మీరేమీ కంగారు పడకండి అని చెప్పి తాను మహేంద్ర దగ్గరికి బయలుదేరి రిషి వాళ్ళ విషయం అనుపమ కి ఫోన్ చేసి చెప్తాడు మను. రిషి ఇంటికి వచ్చిన అనుపమ తాళం విరగొట్టడంతో రిషి వాళ్ళు బయటికి వస్తారు. మరోవైపు మహేంద్రని ఫాలో అయిన మను శైలేంద్ర మహేంద్రతో మాట్లాడటం మొత్తాన్ని వీడియో తీస్తాడు. శైలేంద్ర బయటికి వెళ్లిపోయిన తర్వాత తండ్రి ని రౌడీల బారి నుంచి రక్షిస్తాడు. ఒకానొక సమయంలో రౌడీలకి పట్టుబడిపోయిన మను ని రిషి వచ్చి రక్షిస్తాడు.
ముగ్గురు కలిసి అక్కడ నుంచి బయటపడతారు. ఇది విషయం అంటూ జరిగిందంతా చెప్పిన రిషి దేవయాని తో మాట్లాడుతూ నన్ను పెంచి పెద్ద చేసిన నువ్వు ఇలా చేయటం ఏంటి పెద్దమ్మ, అసలు నేను భరించలేక పోతున్నాను నాకోసం మా అమ్మని చంపేయటం ఏమిటి, ఏ రోజూ నీ మాటని నేను కాదనలేదు, ఒక్క మాట నాతో చెప్పి ఉంటే నేను ఇచ్చేసేవాడిని కదా, ఇప్పుడైనా మీకు కావాల్సింది మీకు ఇచ్చేస్తాను అయితే మా అమ్మను తెచ్చి నాకు ఇస్తారా అంటూ కన్నీరు పెట్టుకుంటాడు రిషి.
ఆ మాటలకి కరిగిపోయి కన్నీరు పెట్టుకుంటుంది దేవయాని. నేను తప్పు చేశాను అంటూ రిషి కాళ్లు పట్టుకోబోతుంది. ఆమె ని వారించి, మిమ్మల్ని ఇలా చూడాలని ఎప్పుడూ అనుకోలేదు మీరు ఎప్పటికీ నా దృష్టిలో ఉన్నతంగానే ఉండాలి అంటూ తండ్రి దగ్గర ఆస్తి పత్రాలు తీసుకొని దేవయాని చేతిలో పెడుతూ ఇవి అన్ని మా ఆస్తి పత్రాలు మీకు ఇచ్చేస్తున్నాను కానీ డిబిఎస్డి కాలేజీ మాత్రం ఇవ్వడం కుదరదు.
అది పదవి మీద వ్యామోహమో, ఆస్తి కోసమో కాదు కొన్ని వందల మంది స్టూడెంట్స్ భవిష్యత్తు దానిమీద ఆధారపడి ఉంది దానిని తీసుకువచ్చి మీ చేతుల్లో పెట్టలేను అంటాడు రిషి. కోపంతో రగిలిపోయిన శైలేంద్ర ఎండి పదవి కోసం ఎదురుచూసి చూసి విసిగిపోయాను ఇక ఓపిక పట్టలేను, చెప్పు ఎండి పదవి నాకు ఇస్తావా లేదా లేదంటే నిన్ను చంపేస్తాను అంటూ రిషికి గన్ గురిపెడతాడు శైలేంద్ర. అందరూ అతడిని వారిస్తారు.
అయినా వినక పోవడంతో దేవయాని రిషి వాళ్లకి అడ్డుగా వెళ్ళి వాళ్ళని చంపాలంటే ముందు నన్ను చంపు అనటంతో గన్ కిందికి దించేస్తాడు శైలేంద్ర. ఎందుకన్నయ్య గన్ దించేసావ్, చంపేయి నన్ను, వసుధారని పెద్దమ్మ ని ఆఖరికి నిన్ను కట్టుకున్న భార్యని కూడా చంపేయి. ఆ తర్వాత ఏం డి సీట్లో కూర్చొని నువ్వు ఏం సాధిస్తావ్ మన సంతోషానికి మన దుఃఖానికి పక్కన మనవారు అంటూ లేకపోతే ఇంకెందుకు ఈ ఆస్తులు, అంతస్తులు అంటాడు రిషి. లేదు నువ్వు ఎన్ని చెప్పినా నా తప్పు ఒప్పుకోవడానికి నా అహం అడ్డువస్తుంది.
అయితే నేను ఎండీ అవ్వాలి, లేదంటే నేను చచ్చిపోవాలి అంటూ తన తలకి గన్ గురి పెట్టుకుంటాడు శైలేంద్ర. అందరూ కంగారు పడి అతడిని వారిస్తారు, నువ్వు చచ్చి పోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, పదవి కావాలంటే ముందు అర్హత సంపాదించాలి అని చెప్తాడు రిషి. నేను చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి, నేను చచ్చిపోవాలి అని తనని తాను కాల్చుకుంటాడు శైలేంద్ర . అతడిని రక్షించి శిక్ష కావాలంటే నేను వేస్తాను అంటాడు రిషి. ఏంటది అంటాడు శైలేంద్ర.
సీన్ కట్ చేస్తే అందరూ ఆఫీస్ మీటింగ్ లో ఉంటారు, అక్కడికి ఆఫీస్ బాయ్ అవతారంలో అందరికీ టీలు, కాఫీలు సర్వ్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. పని బాగా చేయమంటూ అతడిని ఒక ఆట ఆడుకుంటారు మహేంద్ర వాళ్లు. నేను పని బాగా నేర్చుకుంటాను, ఎప్పటికైనా ఎండిని అవుతాను అంటాడు శైలేంద్ర. మాకు కావలసింది కూడా అదే అంటాడు రిషి. ఇంతలో మను మహేంద్ర కి ఫోన్ చేసి నేను ఫారిన్ కి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు.
నువ్వు ఫారిన్ వెళ్ళిపోతే ఇక్కడ ఏంజెల్ ఏమైపోవాలి, ఆల్రెడీ నేను విశ్వనాథం గారితో మాట్లాడాను అర్జెంటుగా ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని ఇంటి దగ్గర ఉండు మేము వస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర. ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు అన్నయ్య అని గర్వంగా ఫణీంద్ర కి చెప్తాడు మహేంద్ర. ఆ తర్వాత వసుధార రిషికి కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడూతూఉంటే అందులో శైలేంద్ర ఇన్వాల్వ్ అవ్వబోతాడు. ఫణీంద్ర మందలించడంతో అందరూ నవ్వుతారు. ఇక్కడితో ఎన్నో రోజులుగా ప్రేక్షకులని అలరించి టాప్ సీరియల్ గా పేరు తెచ్చుకున్న గుప్పెడంత మనసు సీరియల్ కి శుభం కార్డు పడింది.


Click it and Unblock the Notifications











