Guppedanta Manasu August 3rd episode: ఎలాగైనా నిజం తెలుసుకుంటానంటున్న సరోజ.. శైలేంద్రని ఓ ఆటాడుకుంటున్న రిషి!
రంగా కి రిషి గా ట్రైనింగ్ ఇస్తాడు శైలంద్ర. రిషి, వసుధార లు మహేంద్ర ఇంట్లో కలుసుకుని ఎమోషనల్ అవుతారు. రిషి కాలేజీ దక్కించుకోవడం కోసం ఏం చేయాలో వసుధారకి చెప్తాడు. కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చిన వసుధార ని చూసి భయంతో వణికి పోతాడు శైలేంద్ర. కాలేజీకి తనని ఎండిగా ప్రకటించకపోవడంతో షాక్ లో కళ్ళు తిరిగి పడిపోతాడు. అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర వాళ్ళని తమతోనే ఉండిపోమంటాడు ఫణీంద్ర. కానీ అందుకు వసుధార వాళ్ళు అంగీకరించరు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 3వ తేదీ ఎపిసోడ్ 1,144ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నాకు కూడా జగతిని చూపిస్తావా అని కోడలిని అడుగుతాడు మహేంద్ర. తప్పకుండా చూపిస్తాను అంటూ చుక్కల్ని చూపించి అందులో పెద్దగా మెరుస్తున్న చుక్క జగతి అత్తయ్య, ఆమె ఆకాశంలో నక్షత్రం లా మారిపోయారు అని చెప్తుంది. మహేంద్ర కూడా జగతిని చూసినట్లే ఫీల్ అయ్యి ఆనందపడతాడు. వసుధార అనుపమ వాళ్ళ గురించి అడుగుతుంది. కారణం తెలియదు వాళ్ళిద్దరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు.కానీ మను ఇంకా తండ్రి కోసం వెతుకుతూనే ఉన్నాడు అంటాడు మహేంద్ర.

అదేమిటి అంటే లెటర్ మను గారికి చేరలేదా, శైలేంద్ర ఏమైనా చేశాడా అని అనుకుంటుంది వసుధార. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అంటాడు మహేంద్ర. మీరు మా ధైర్యం డాడ్ మీరు మాకు ఎప్పుడు డిస్టర్బ్ కాదు అంటాడు రిషి. నవ్వుతూ మీరు మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. మరోవైపు శైలేంద్ర పాండు కి ఫోన్ చేస్తాడు. పాండు మాటల ద్వారా వీడు వసుధారని చంపలేదు నన్ను మోసం చేశారు అనుకుంటాడు. తర్వాత ఊరిలో తనకి కనిపించింది వసుధారేనా, అసలు నిజంగా రంగా రంగాయేనా లేదంటే రిషి వసుధార లు కలిపి నాటకం ఆడుతున్నారా అని కన్ఫ్యూజ్ అవుతాడు శైలేంద్ర.
మరోవైపు రిషి బుజ్జికి ఫోన్ చేస్తాడు. బుజ్జి బామ్మ నీకోసం అడుగుతుంది, నువ్వు ఇచ్చిన డబ్బులు మీ మామయ్య వడ్డీ కింద తీసేసుకున్నాడు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సరోజ ఫోన్ లాక్కొని నువ్వు ఎక్కడికి వెళ్లావు, ఆ వసుధార కూడా కనిపించడం లేదు తను నీతో వుందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. త్వరలోనే అక్కడికి వచ్చేస్తాను అంతవరకు నానమ్మని నువ్వే చూసుకో అంటాడు రంగా. నువ్వు రాకపోతే నేనే వచ్చేస్తాను అంటుంది సరోజ.
రాధమ్మ అక్కడికి వచ్చి నా మనవడు లేకపోతే నాకు ఏదో గా ఉంది వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు నిజం చెప్పు అని బుజ్జిని నిలదీస్తుంది. అప్పుడు బుజ్జి శైలేంద్ర ఫోటో చూపించి రంగన్న ఇతనితోనే వెళ్లాడు, డబ్బిచ్చింది కూడా ఇతనే అని చెప్తాడు. అతను ఎందుకు బావకు డబ్బులు ఇవ్వాలి, అసలు అతనితో ఎందుకు వెళ్లాడు నేను ఎలాగైనా నిజం తెలుసుకుంటాను అనుకుంటుంది సరోజ. మరోవైపు మహేంద్ర అనుపమ కి ఫోన్ చేస్తాడు.

ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మను కి ఫోన్ చేసి వసుధారవాళ్ళు వచ్చిన విషయం చెప్తాడు. ఆనందపడతారు మను, అనుపమ. మరోవైపు వసుధారతో పాటు గదిలోకి వెళ్లబోతున్న రిషిని ఆపి నేను నీతో కాస్త మాట్లాడాలి అంటాడు శైలేంద్ర. ఏం మాట్లాడాలి అంటుంది వసుధార. చాలా రోజుల నుంచి నా తమ్ముడు నాతో లేడు కదా అందుకే కష్టసుఖాలు మాట్లాడుకుంటాం అంటాడు శైలేంద్ర. ఎందుకు లేని ప్రేమని నటిస్తున్నారు అంటుంది వసుధార.
తర్వాత రిషి నచ్చచెప్పటం తో పది నిమిషాలు మాత్రం పర్మిషన్ ఇస్తుంది. మీరు 10 నిమిషాల్లో లోపలికి రావాలి లేదంటే నేనే మీ దగ్గరికి వస్తాను అంటుంది వసుధార. రిషి సరే అనడంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది వసుధార. తర్వాత రిషి ని తీసుకొని బయటికి వచ్చిన శైలేంద్ర తనతో పాటు రూమ్ లోకి వెళ్ళిపోతున్నావేంటి కొంచెం హద్దుల్లో లో ఉండు అంటాడు. నా హద్దులు నాకు తెలుసు అంటాడు రిషి తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నాను అంటాడు. ఎందుకు ఏమైంది ఇక్కడ అంతా బానే ఉంది కదా అని కంగారుగా అంటాడు శైలేంద్ర.
అంతా బానే ఉంది కానీ ఆ వసుధార మేడం ని భరించలేకపోతున్నాను మాట్లాడితే నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం అంటుంది. రేపు నిజం తెలిస్తే నన్ను ఏమంటుందో ఏంటో అందుకే నేను వెళ్ళిపోతాను అంటూ శైలేంద్రని కంగారు పెడుతూ ఒక ఆట ఆడుకుంటాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఏం లేదు మేడం గారు అని కంగారు నటిస్తూ చెప్తాడు రిషి.
మేడం గారు అంటున్నారు ఏంటి అని అనుమానం గా అడుగుతుంది వసుధార. శైలేంద్ర రిషి ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు అప్పుడే వచ్చిన దేవయాని కూడా రంగా మాటలని కవర్ చేస్తుంది. నాకు ఏదో తేడా కొడుతుంది అంటుంది వసుధార. ఏమీ లేదు ముందు మీరు వెళ్లి పడుకోండి అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటుంది దేవయాని. అందుకు శైలేంద్ర అభ్యంతరం చెప్తే అతడిని వారిస్తుంది దేవయాని. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











