Guppedanta Manasu weekly roundup దేవయాని ఎత్తులు పైఎత్తులు..రిషి, వసుధారను విడదీసేందుకు ప్లాన్
తెలుగు బుల్లితెర మీద టాప్ రేటింగ్ సీరియల్స్‌లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ రకరకాల ట్విస్టులతో ముందుకెళ్తున్నది. రిషి, సాక్షి బ్రేకప్ తర్వాత చాలా ట్విస్టులు చోటు చేసుకొంటున్నాయి. దేవయాని, జగతి మధ్య ఆధిపత్య పోరాటం కనిపించింది. రిషిని సాక్షి వదలనంటూ ఛాలెంజ్ చేసింది. ఇలాంటి పరిణామాల మధ్య గత వారం సీరియల్‌లో ఏం జరిగిందంటే..

రకరకాల ట్విస్టులతో గుప్పెడంత మనసు
సాక్షితో బ్రేకప్ తర్వాత వసుధారకు మరింత చేరువ అవుతున్నట్టు కనిపించాడు. అలాగే తన ప్లాన్ బెడిసి కొట్టిందని దేవయాని కుమిలిపోతున్నది. ఇక తన తల్లి జగతితో రిషి రిలేషన్ సానుకూలంగా మారింది. ఫీల్‌గుడ్‌గా సాగుతున్న ఈ సీరియల్ మున్ముందు ట్విస్టులకు తెరలేపే విధంగా వెళ్తున్నది.

ఆగస్టు 17వ తేదీ ఎపిసోడ్‌లో
రిషి, సాక్షి నిశ్చితార్థం ఆగిపోవడంతో జగతి, ధరణి, గౌతమ్ సంతోషంలో మునిగిపోయారు. ఈ శుభ సందర్భంలో స్వీట్లు తినిపించాలని జగతిని గౌతమ్ కోరితే.. సరే అంది. అయితే ఈ విషయాన్ని చూసిన దేవయాని.. ఘాటుగా స్పందించింది.

ఆగస్టు 18వ తేదీ ఎపిసోడ్‌లో
రిషితో సాక్షి పెళ్లికి చేసిన ప్లాన్ దెబ్బ తినడంతో దేవయాని షాక్ గురైంది. అన్నం మానేయడంతో రిషి తినిపించే ప్రయత్నం చేశాడు.

చిన్న డ్రామా ఆడారు
రిషి, వసుధారను కలిపేందుకు జగతి, మహేంద్ర ప్లాన్ చేశారు. తమ కారు టైర్ పంక్చర్ అయిందంటూ రిషి కారులో బయలు దేరిన జగతి, మహేంద్ర.. చిన్న డ్రామా ఆడారు. రిషి, వసుధారను వెనుక సీట్లో కూర్చోపెట్టి వారిద్దరిని చిలిపిగా ఇబ్బందికి గురిచేశారు.

ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్‌లో
బ్రేకప్ తర్వాత రిషి, వసుధార మధ్య దూరం తరిగింది. అయితే రిషి, వసుధారను వేరు చేయడానికి సాక్షితో కలిసి దేవయాని కొత్త నాటకానికి తెర లేపింది.


Click it and Unblock the Notifications











