Guppedanta Manasu, August 5fh episode: రిషిని అనుమానించిన వసుధార.. శైలేంద్ర కవర్ చేసే ప్రయత్నం
కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చిన వసుధార ని చూసి భయంతో వణికి పోతాడు శైలేంద్ర. కాలేజీకి తనని ఎండిగా ప్రకటించకపోవడంతో షాక్ లో కళ్ళు తిరిగి పడిపోతాడు. అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర వాళ్ళని తమతోనే ఉండిపోమంటాడు ఫణీంద్ర. కానీ అందుకు వసుధార వాళ్ళు అంగీకరించరు. మాటల్లో తన లెటర్ మనుకి చేరలేదని తెలుసుకుంటుంది వసుధార. తమ ప్లాన్ వర్కౌట్ కాలేదని కొడుకు పై కోప్పడుతుంది దేవయాని. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 5వ తేదీ ఎపిసోడ్ 1,145ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే.
తనని వసుధారతో పాటు గదిలోకి పంపిస్తావేంటి అని తల్లిపై కోప్పడతాడు శైలేంద్ర. తను రంగా అవునో,కాదో తెలుసుకోవాలంటే పంపించి తీరాలి, తను రంగా అయితే ఆ గదిలో ఉండడు బయటికి వచ్చేస్తాడు, లేదంటే ఇతను కచ్చితంగా రిషి యే అంటుంది వసుధార. తను కచ్చితంగా బయటికి వచ్చేస్తాడు, క్యారెక్టర్ ఉన్నవాడు. నిజానికి వసుధారకి భర్తగా నటించను అని చెప్పాడు అంటాడు శైలేంద్ర. సరే పద వాడు రూమ్ లో ఉంటాడో, బయటికి వచ్చేస్తాడో చూద్దాం అనుకుంటూ లోపలికి వెళ్తారు తల్లి కొడుకులు. అదే సమయంలో రూమ్ లో ఉన్న రిషి, వసుధార మాట్లాడుకుంటూ ఉంటారు.

వి ఆర్ ఉంగరాన్ని మళ్లీ రిషి చేత తొలగించుకుంటుంది వసుధార. నాకు మీ పక్కనే ఇలా జీవితాంతం ఉండిపోవాలనిపిస్తుంది, ఇంకేమి వద్దు అనిపిస్తుంది అంటుంది వసుధార. వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత నేను బయటకు వెళ్ళిపోతాను అంటాడు రిషి. ఎందుకు అని ఆశ్చర్యంగా అడుగుతుంది వసుధార. నేను మీ అందరి దృష్టిలోని రిషి ని కానీ శైలేంద్ర అన్నయ్య దృష్టిలో మాత్రం రంగానే, నేను ఇదే గదిలో ఉండిపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. నా అంచనా ప్రకారం వాళ్ళు బయటే ఉండి ఉంటారు అని చెప్పి బయటకు వచ్చేస్తాడు రిషి.
అప్పటికే అక్కడ ఉన్న దేవయాని వాళ్ళని చూసి మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి? నేను లోపల ఉండిపోతాను అనుకున్నారా అంటాడు రిషి. వచ్చిన వ్యక్తి రిషి కాదు రంగా అని కన్ఫామ్ చేసుకుని నవ్వుకుంటారు తల్లి కొడుకులు. తరువాత దేవయానిని పంపించేసి రిషితో మాట్లాడుతాడు శైలేంద్ర. మీకు రిషి సార్ అంటే ఇష్టమేనా, మరి ఆయన తప్పిపోతే మీరు ఎందుకు వెతకలేదు అని అడుగుతాడు రిషి.
మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం వాడి కోసం ఎన్నో చోట్ల వెతికాం కానీ దొరకలేదు అంటాడు శైలేంద్ర. నేను ఆమెతోపాటు ఉండలేను నేను మా ఊరు వెళ్ళిపోతాను, కాలేజీ చూసుకోవటానికి ఆ వసుధార మేడం ఉంది కదా అంటాడు రిషి. తన వల్లే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం, అయినా నువ్వు అత్తమానం వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను అనకు నీ అవసరం తీరిపోయినప్పుడు నేనే నిన్ను పంపించేస్తాను అంటాడు శైలేంద్ర.

ఆ మాటలకి అంగీకరించిన రిషి ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి అని అడుగుతాడు. మళ్ళీ తనే డాడ్ రూమ్లో పడుకోనా అంటాడు. అందుకు అంగీకరిస్తాడు శైలేంద్ర. ఇదంతా వసుధార చూస్తుంది తండ్రి ప్రేమ కోసం తపించపోతున్నారు అనుకుంటుంది. మరోవైపు తండ్రి దగ్గరికి వెళ్లిన రిషి తండ్రి ఒడిలో తల పెట్టుకొని తండ్రి యోగక్షేమాలు తెలుసుకుంటాడు. రిషి తిరిగి రావడం పట్ల బాగా ఎమోషనల్ అవుతాడు మహేంద్ర, మళ్ళీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోవద్దు అంటూ కన్నీరు పెట్టుకుంటాడు.
మరోవైపు ఒక కొడుకు తన తండ్రిని చేరుకున్నాడు మరి నేను నా తండ్రిని ఎప్పుడు చేరుకుంటానో అని తల్లితో అంటాడు మను. ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు అని కొడుక్కి నచ్చ చెప్తుంది అనుపమ. సరే వసుధార వాళ్ళని చూడటానికి వెళ్దాం అంటాడు మను. ఇప్పుడు కాదు సమయం చూసుకొని వెళ్దాము అంటుంది అనుపమ. ఎందుకు ప్రతి చిన్న విషయానికి ఏవేవో కారణాలు చెప్పి వాయిదాలు వేస్తావు అంటాడు మను.

ఏవేవో కారణాలు కాదు పెద్ద కారణాలే ఉన్నాయి, వాళ్లని చూడాలని నీ కన్నా ఎక్కువగా నాకే అనిపిస్తుంది కానీ కొద్ది రోజులు ఆగాలి అని కొడుక్కి సర్ది చెప్తుంది అనుపమ. మరోవైపు సరోజ నేరుగా శైలేంద్ర వాళ్ల ఇంటికి వచ్చి రంగా ని పిలుస్తుంది. మీ బావ ఎవరు తను ఇక్కడికి ఎందుకు ఉంటాడు నువ్వు రాంగ్ అడ్రస్ కి వచ్చినట్లు ఉన్నావు అంటారు మహేంద్ర, ఫణింద్ర వాళ్ళు. అంతలోనే అక్కడికి శైలేంద్ర, దేవయాని వస్తారు. శైలేంద్ర కాలర్ పట్టుకుని మా బావ ఏడి, నువ్వే కదా తనని ఇక్కడికి తీసుకువచ్చావు అంటుంది సరోజ.
మీ బావ సంగతి వాడికి ఏం తెలుస్తుంది మీ బావని తీసుకురావాల్సిన అవసరం వాడికి ఏంటి అంటాడు ఫణీంద్ర. మీకు తెలియకపోవచ్చు కానీ వీళ్ళిద్దరికీ మా బావ తెలుసు అంటుంది సరోజ. అంతలోనే రిషి, వసుధార అక్కడికి వస్తారు. సరోజ రిషి దగ్గరికి వెళ్లి అలా వచ్చేసావేంటి బావ, అమ్మమ్మ నీకోసం బెంగపెట్టుకుంది అని చెప్తుంది. అతను మీ బావ ఏంటి? వాడు నా కొడుకు రిషి అంటాడు మహేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











