Guppedanta Manasu, August 6th episode: నీ బావ కాదు..నా కొడుకు రిషి.. సరోజకు మహేంద్ర షాక్

కాలేజీకి తనని ఎండిగా ప్రకటించకపోవడంతో షాక్ లో కళ్ళు తిరిగి పడిపోతాడు. అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర వాళ్ళని తమతోనే ఉండిపోమంటాడు ఫణీంద్ర. కానీ అందుకు వసుధార వాళ్ళు అంగీకరించరు. మాటల్లో తన లెటర్ మనుకి చేరలేదని తెలుసుకుంటుంది వసుధార. తమ ప్లాన్ వర్కౌట్ కాలేదని కొడుకు పై కోప్పడుతుంది దేవయాని. మరెప్పుడు తనని వదిలి వెళ్ళొద్దని రిషి దగ్గర ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. రిషి ని వెతుక్కుంటూ శైలేంద్ర ఇంటికి వస్తుంది సరోజ. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 6వ తేదీ ఎపిసోడ్ 1,146ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఇతను రిషి కాదు మా బావ రంగా అంటుంది సరోజ, నువ్వు పొరబడుతున్నావు వాడు నా కొడుకు రిషి అంటాడు మహేంద్ర. కాదు అతను పది లక్షలు ఇచ్చి మా బావని తీసుకొచ్చాడు కావాలంటే అతన్నే అడగండి అంటు శైలేంద్రని చూపిస్తుంది సరోజ. తర్వాత రిషి చెయ్యి పట్టుకొని రా బావ మన ఇంటికి వెళ్లి పోదాము అక్కడ అమ్మమ్మ నీకోసం ఎదురు చూస్తుంది అంటుంది.

Guppedanta Manasu August 6th 2024 Episode number 1146 Here is the Full story

ఆమె చేయి విదిలించుకుంటాడు రిషి. ఎందుకు బావ రానంటున్నావు,ఈ విలాసాలకి అలవాటు పడిపోయావా, నువ్వు నాతో రాకపోతే ఇక్కడే చచ్చిపోతాను అంటుంది సరోజ. నువ్వు చచ్చిపోవద్దు, ఇప్పుడే అసలు విషయం తేలుస్తాను, అతను రంగా అయితే నేనే నీతో పంపిస్తాను అని చెప్పి శైలేంద్ర దగ్గరికి వెళ్లి ఆమె చెబుతున్నది నిజమేనా అని అడుగుతాడు ఫణీంద్ర. శైలేంద్ర తెగించి జరిగిందంతా చెప్తాడు.

ఇప్పటికైనా తెలిసింది కదా తను మా బావ రంగా అని అంటూ మళ్ళీ రిషి ని తనతో రమ్మంటుంది సరోజ. నేను మీ బావ రంగాని కాదు రిషిని, నేను తర్వాత మీ ఊరు వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతాను అంటాడు రిషి. ఇదంతా చూస్తున్న ఫణీంద్ర ఎంత పని చేశావు, పదవి కోసం ఇంత నీచానికి దిగజారుతావా, నువ్వు మారతావని ఎదురు చూశాను ఇంక నువ్వు మారవు అంటూ కొడుక్కి నాలుగు తగిలించి ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు.

తుళ్లిపడి లేచిన శైలేంద్ర జరిగిందంతా కల అని తెలుసుకుంటాడు. ఆ శబ్దానికి ధరణి భర్త దగ్గరికి వచ్చి ఏం జరిగింది, ఎందుకు ఆ కంగారు అని అడుగుతుంది. నాకు ఒక పీడకల వచ్చింది అంటాడు శైలేంద్ర పగటిపూట వచ్చిన కలలు నిజమవుతాయట అంటుంది ధరణి. నువ్వు అస్సలు పాజిటివ్ గా మాట్లాడవా, ఎందుకు నా ఎమోషన్స్ తో ఆడుకుంటావు అని భార్యపై చిరాకుపడతాడు శైలేంద్ర.

కంగారుపడుతూ రంగా ఏడి అని అడుగుతాడు తర్వాత తమాయించుకొని రిషి ఏడి అనుకుంటూ కిందికి వెళ్తాడు. భర్త ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది ధరణి. కిందన వసుధార, మహేంద్ర మాట్లాడుకోవడం చూసిన శైలేంద్ర ఆ మాటలు వినాలి అనుకుంటాడు. అది గమనించిన వసుధార శైలేంద్రని కంగారు పెట్టాలని రిషి గురించి అనుమానంగా మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న శైలేంద్ర నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు అతను రిషియే అంటాడు.

అంతలోనే వేప పుల్ల చేస్తూ ఇంట్లోకి వస్తున్న రిషి ని చూసి అనుమానపడతాడు మహేంద్ర. నన్ను ఇరికించేసాడు అనుకుంటూ శైలేంద్ర మళ్ళీ రిషి ని వెనకేసుకుని వస్తాడు. మరోవైపు మనవడు కోసం ఎదురుచూస్తూ రాధమ్మ భోజనం మానేస్తుంది. మంచి మాటలు చెప్పి ఆమెతో జావ తాగించే ప్రయత్నం చేస్తుంది సరోజ. అప్పుడే సంజీవయ్య వచ్చి నీ మనవడు బాగా సంపాదిస్తున్నట్లు ఉన్నాడు నీకు ఫోన్ చేశాడా అని అడుగుతాడు. లేదు అంటుంది రాధమ్మ.

అందరూ నన్ను డబ్బు మనిషి అంటారు కానీ చూసావా నీ మనవడు కూడా డబ్బు మనిషే, గట్టిగా డబ్బు సంపాదించే సరికి నీకు ఫోన్ చేయడం కూడా మానేశాడు అంటాడు సంజీవయ్య. బావ అలాంటివాడు కాదు అయినా అందరూ డబ్బు కోసం బ్రతకరు అంటుంది సరోజ. మరి దేనికోసం బ్రతుకుతారు అంటాడు సంజీవయ్య. ప్రేమ కోసం అంటుంది సరోజ. మరోవైపు స్నానం చేసి తల తుడుచుకుంటున్న వసుధారని చూస్తూ ఉండిపోతాడు రిషి. నిన్ను చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది అంటాడు.

అలాంటి నన్ను ఎలా వదిలేసి ఇన్నాళ్లు ఉన్నారు అంటుంది వసుధార. కొన్ని సమయాల్లో తప్పదు ఇప్పుడు వచ్చేసాను కదా ఇకమీదట కలిసే ఉందాం అంటాడు రిషి. కాలేజీ సమస్య ఒక్కటీ తీరిపోతే ఇక మన సమస్యలన్నీ తీరిపోయినట్లే దాని గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా అంటుంది వసుధార. ఇంకా లేదు నాకు ఇప్పుడిప్పుడే చాలా విషయాలు తెలుస్తున్నాయి, ఆఖరిలో గాని ఎలాంటి నిర్ణయం తీసుకోలేను అంటాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X