Guppedanta Manasu, August 7th episode: నీ వెంట ఇప్పుడే వచ్చేస్తాను.. వసుధారకు మాటిచ్చిన రిషి!

మహేంద్ర వాళ్ళని తమతోనే ఉండిపోమంటాడు ఫణీంద్ర. కానీ అందుకు వసుధార వాళ్ళు అంగీకరించరు. మాటల్లో తన లెటర్ మనుకి చేరలేదని తెలుసుకుంటుంది వసుధార. తమ ప్లాన్ వర్కౌట్ కాలేదని కొడుకు పై కోప్పడుతుంది దేవయాని. మరెప్పుడు తనని వదిలి వెళ్ళొద్దని రిషి దగ్గర ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. రిషి ని వెతుక్కుంటూ శైలేంద్ర ఇంటికి వస్తుంది సరోజ. నిజం తెలుసుకున్న తండ్రి తనని ఇంటి నుంచి బయటికి గెంటేసినట్లు కలకంటాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 7వ తేదీ ఎపిసోడ్ 1,148ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటాడు మహేంద్ర. ఇక్కడే ఉండిపోండి అంటుంది దేవయాని. అందుకు అంగీకరించడు మహేంద్ర. నీకు కొడుకు కోడలు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చాయి అందుకే నీ ఆనందం నువ్వు చూసుకుంటున్నావు, మా ఆనందం గురించి పట్టించుకోవడం లేదు అంటుంది దేవయాని. భార్యని అలా మాట్లాడొద్దు అని మందలిస్తాడు ఫణీంద్ర.

Guppedanta Manasu August 7th 2024 Episode number 1147 Here is the Full story

తర్వాత తమ్ముడు తో మాట్లాడుతూ రిషి వెళ్ళిపోయిన తర్వాత మా జీవితాలు మోడుబారిపోయాయి, రిషి వచ్చిన తర్వాతే మా జీవితాలకి వెలుగు వచ్చినట్లు అయింది మీరు వెళ్లిపోవటం నాక్కూడా ఇష్టం లేదు మీరు ఇక్కడే ఉండండి అంటాడు ఫణీంద్ర. ధరణి కూడా ఇక్కడే ఉండిపోండి అని మహేంద్రని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే రిషి, వసుధార కిందికి వచ్చి కాలేజీకి వెళ్తాము అని చెప్తారు.

అప్పుడు మహేంద్ర మాట్లాడుతూ అన్నయ్య మనల్ని ఇక్కడే ఉండిపోమంటున్నాడు మీ అభిప్రాయం ఏమిటి అని కోడల్ని అడుగుతాడు. నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం అని మహేంద్ర తో చెప్పి కాలేజీకి బయలుదేరుతుంది వసుధార. అప్పుడు మహేంద్ర అన్నయ్యతో మాట్లాడుతూ క్షమించండి అన్నయ్య ఇక్కడ ఉండలేను, కోడలి ఇష్టం ప్రకారమే నడుచుకుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర.

Guppedanta Manasu August 7th 2024 Episode number 1147 Here is the Full story
మీ తమ్ముడు మీ గురించి ఆలోచించడం లేదు అని భర్తని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది దేవయాని. నా గురించి ఆలోచించడం లేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు, వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంటాడు ఫణీంద్ర. మరోవైపు రిషి వాళ్ళు వచ్చారని తెలుసుకున్న ఏంజెల్ వాళ్ళని కలవడానికి వెళ్దాం రమ్మని అనుపమ వాళ్ళని అడుగుతుంది. మేము రాలేము కావాలంటే నువ్వు వెళ్ళు అంటుంది అనుపమ.

ఎందుకు రావు, అసలు ఎందుకు నీకు అంత కోపం అని అడుగుతుంది ఏంజెల్. అనుపమ ఏమీ మాట్లాడకపోవటంతో నా ప్రశ్నకి సమాధానం లేదా అని అడుగుతుంది ఏంజెల్. సమాధానం లేని ప్రశ్నలు ఉండవు కానీ నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి కట్టుబడి ఉంటాను, మేము కాలేజీకి రాలేము అని చెప్పి వెళ్లిపోతుంది అనుపమ. నేను కాలేజీకి వెళ్తాను నాకు తోడుగా వస్తావా అని మను ని అడుగుతుంది ఏంజెల్.

కాలేజీకి రావడం ఇష్టం లేదు అంటాడు మను, నువ్వు గేటు బయట ఉండు నేను లోపలికి వెళ్లి వస్తాను అని అతడిని తనతో పాటు రావడానికి ఒప్పిస్తుంది ఏంజెల్. కానీ తల్లికి చెప్పవద్దు బాధపడుతుంది అంటాడు మను. అందుకు ఒప్పుకుంటుంది ఏంజెల్. మరోవైపు బీపీ చెక్ చేసుకుంటూ ఉంటాడు శైలేంద్ర. ఏం చేస్తున్నావు అంటుంది దేవయాని నాకు వస్తున్న పీడకలలకి నాకు బీపీ పెరిగిపోతుంది, నాకు పిడకల వచ్చిన ప్రతిసారి నిజమైంది అని కంగారు పడుతూ చెప్తాడు శైలేంద్ర.

Guppedanta Manasu August 7th 2024 Episode number 1147 Here is the Full story

వసుధర లేదేమో అనుకొని మనం ఈ ప్లాన్ వేసాము కానీ ఇప్పుడు ఆ రంగా వసుధార మాటలు నమ్మొ, లేదంటే మన ఆస్తి మీద కన్నుపడో ఇక్కడే ఉండిపోతానంటే వాడు రిషి కాదు రంగా అని మనం చచ్చినా నిరూపించలేము అందుకే మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి వాడితోనే మనం ఎండి సీట్ చేజిక్కించుకోవాలి అంటూ ఒక ప్లాన్ చెప్తుంది. ఇప్పటివరకు చాలా ప్లాన్లు ఫెయిల్ చేశావు ఇదైనా సరిగ్గా చెయ్యు ఇదే మనకి ఆఖరి అవకాశం అంటుంది దేవయాని.నన్ను నమ్ము, నువ్వు అనుకున్నది సాధించి చూపిస్తాను, ఇప్పుడే కాలేజీకి వెళ్లి ప్లాన్ అమలు పరుస్తాను అని చెప్తాడు శైలేంద్ర.

మరోవైపు కాలేజీకి చాలా రోజుల తర్వాత వచ్చిన రిషి పాత జ్ఞాపకాలలోకి వెళతాడు. రిషి, వసుధారలు చాలాసేపు గతంలో జరిగిన సంఘటనలు తలుచుకుంటారు. మధ్యలో వసుధార ఏదో చెప్పబోయి ఆగిపోతుంది. నీ బాధ నాకు అర్థమైంది, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, నువ్వు ఎప్పటికీ నా దానివే అంటాడు రిషి. తర్వాత చాలా రోజులైంది కాలేజీని చూసి, ఒక సారి కాలేజీ అంతా చూస్తాను అని బయటికి వెళ్లిపోతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X