Guppedanta Manasu, Aug8th episode:తన క్యాబిన్ సి సి ఫుటేజ్ కావాలంటున్న వసుధార..రంగా ని పైలోకానికి పంపించేద్దాం

తమ ప్లాన్ వర్కౌట్ కాలేదని కొడుకు పై కోప్పడుతుంది దేవయాని. మరెప్పుడు తనని వదిలి వెళ్ళొద్దని రిషి దగ్గర ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. రిషి ని వెతుక్కుంటూ శైలేంద్ర ఇంటికి వస్తుంది సరోజ. నిజం తెలుసుకున్న తండ్రి తనని ఇంటి నుంచి బయటికి గెంటేసినట్లు కలకంటాడు శైలేంద్ర. మహేంద్ర వాళ్ళని వాళ్లతో పాటే ఉండిపోమని రిక్వెస్ట్ చేస్తాడు ఫణీంద్ర. కానీ వసుధార కి ఇష్టం లేకపోవడంతో అన్నగారి మాట కాదంటాడు మహేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 8వ తేదీ ఎపిసోడ్ 1,149ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

ఫైల్స్ ని చెక్ చేస్తున్న వసుధార అవి పెండింగ్లో ఉండటం చూసే స్టాఫ్ ని మందలిస్తుంది. ఇవన్నీ ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, మీ వర్క్ మీరు చేయాలి కదా అంటుంది. మను సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయాక మాకు ఏం చేయాలో అర్థం కాలేదు మేడం అంటుంది ఒక ఎంప్లాయ్. సరే ఇప్పుడు నేను ఫైల్స్ మీద సంతకం పెట్టి పాస్ చేస్తాను వాటిని మీరు కంప్లీట్ చేయండి అని ఫైల్స్ మీద సంతకం పెట్టబోతుంది వసుధార. అంతలోనే శైలేంద్ర అక్కడికి వచ్చి నువ్వు సంతకం పెట్టడానికి వీలు లేదు.

Guppedanta Manasu August 8th 2024 Episode number 1148 Here is the Full story

నువ్వు ఈ కాలేజీకి ఏమవుతావని సంతకం పెడతావు, ఎండి పదవికి రిజైన్ చేసేసిన తర్వాత ఫైల్స్ మీద సంతకం పెట్టే హక్కు నీకు లేదు అని ఆబ్జెక్ట్ చేస్తాడు. కానీ ఎవరో ఒకరైతే ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టాలి కదా అంటుంది ఎంప్లాయ్. అలా అని ఎవరు పడితే వాళ్ళు సంతకం పెట్టడం ఎప్పుడు పడితే కుర్చీ వదిలేసి వెళ్ళిపోవటానికి ఇదేమి బొమ్మలాట కాదు కాలేజ్ అంటాడు శైలేంద్ర. అంతలోనే అక్కడికి రిషి వచ్చి వసుధార కాలేజీ మంచి కోసమే చేస్తుంది కదా అంటాడు.కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా మినిస్టర్ గారు బాధ్యతలు అన్ని నీ మీదే పెట్టారు.

అందుకే నువ్వే ఎండిని ఎంచుకోవాలి అంటాడు శైలేంద్ర. సరే మీటింగ్ ఏర్పాటు చేసి ఎండి ని ఎనౌన్స్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. అతని వెంట వచ్చిన శైలేంద్ర అలా చేసావ్ ఏంటి నన్ను ఎండి గా చెప్పొచ్చు కదా అంటాడు. మీరు కూడా అలాగే అంటారు ఏంటి అన్నయ్య, వాళ్ళకి అనుమానం వస్తుంది. రిషి అయితే వెంటనే మీ పేరు చెప్పడు అందుకే మీటింగ్ లో చెప్తానని చెప్పాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. వీడు బాగా అలర్ట్ గా ఉన్నాడు నాకన్నా బాగా ఆలోచిస్తున్నాడు అనుకుంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu August 8th 2024 Episode number 1148 Here is the Full story

తర్వాత రిషి కి ఏంజెల్ ఎదురవుతుంది వాళ్ళిద్దరూ యోగక్షేమాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది గమనించిన శైలేంద్ర వీడేంటి ఏంజెల్ ఎవరో తెలియకపోయినా మాట్లాడుతున్నాడు నిజంగా వీడు రంగాయేనా అనుకుంటాడు అది గమనించిన రిషి శైలేంద్రని ఎలాగైనా మేనిఫ్యులేట్ చేయాలి అనుకోని ఎవరు అన్నయ్య ఈ క్యారెక్టర్ ఫ్రెండు అంటుంది మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను అని మెసేజ్ పెడతాడు.

వీడు నిజంగానే రంగా, ఏంజెల్ ని మేనేజ్ చేయలేక ఏం కష్టపడుతున్నాడో ఏమో వెళ్లి సేవ్ చేయాలి అనుకుని ఏంజెల్ ని పలకరిస్తాడు, వసుధర క్యాబిన్లో ఉంది వెళ్లి మాట్లాడు అని చెప్తాడు. మాకు తెలుసు నువ్వేమీ చెప్పక్కర్లేదు అని కోపంగా అంటుంది ఏంజెల్. తరువాత రిషి ని తీసుకుని వసుధార దగ్గరికి వెళుతుంది. వసుధార ని కలిసిన ఏంజెల్ ఆమెని అప్రిషియేట్ చేస్తుంది. నిజంగా నువ్వు గ్రేట్ అందరూ హోప్ కోల్పోయిన సమయంలో నీ భర్త ఉన్నాడు అని అతడిని తీసుకువచ్చావు అని మెచ్చుకుంటుంది.

Guppedanta Manasu August 8th 2024 Episode number 1148 Here is the Full story

అదంతా ఏం లేదు ఒక ఉత్తమమైన భర్తకి భార్యగా ఏం చేయాలో అదే చేశాను అంటూ అనుపమ వాళ్ళ గురించి అడుగుతుంది వసుధార. కారణం తెలియదు కానీ వాళ్లు మహేంద్ర గారితో పాటు కాలేజీ కి కూడా దూరంగా ఉంటున్నారు అంటుంది ఏంజెల్. అప్పుడు వసుధార మను తో ఫోన్లో మాట్లాడుతూ అతని తండ్రి గురించి చెప్పాలనుకుంటుంది కానీ మను ఆమె మాటలు వినకుండా ఆ టాపిక్ వదిలేయండి మా అమ్మ ఎవరిని అడగొద్దు అంది.

నేను కూడా తెలుసుకోవాలని అనుకోవడం లేదు మీరు రిషి సార్ వచ్చారు చాలా సంతోషం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మను. ఆయన ఏదో ఆవేశంలో ఉన్నారు నేను అనుపమ మేడం తో మాట్లాడుతాను అని ఫోన్ ఏంజెల్ కి ఇచ్చేసి బయటికి వస్తుంది వసుధార. తర్వాత స్టాప్ తోఫోన్ లో మాట్లాడుతూ నేను ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్లిపోయిన రోజు నా క్యాబిన్ సిసి ఫుటేజ్ కావాలి అని చెప్తుంది. మరోవైపు శైలేంద్ర ఆనంద పడుతూ మన ప్లాన్ వర్క్ అవుట్ అయింది బోర్డు మీటింగ్ పెట్టి త్వరలోనే ఆ రంగా గాడు నన్ను ఎండిగా ప్రకటిస్తాడు అని తల్లితో చెప్తాడు.

పని అయిన వెంటనే వాడిని ఊరు పంపించేయ్ అదే వాడికి మంచిది మనకి మంచిది అంటుంది దేవయాని. మన గురించి నిజాలు తెలిసిన వాడిని అక్కడికి ఇక్కడికి కాదు పైకి పంపించేయడమే మంచిది అంటాడు శైలేంద్ర. ఇప్పుడే అక్కడికి వచ్చిన ధరణి ఏమంటున్నారు, అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని నిలదీస్తుంది. ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాము అంటాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X