Guppedanta Manasu August 9th episode: శైలేంద్రకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రిషి..రంగా గురించి భయపడుతున్న సరోజ
మరెప్పుడూ తనని వదిలి వెళ్ళొద్దని రిషి దగ్గర ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. రిషి ని వెతుక్కుంటూ శైలేంద్ర ఇంటికి వస్తుంది సరోజ. నిజం తెలుసుకున్న తండ్రి తనని ఇంటి నుంచి బయటికి గెంటేసినట్లు కలకంటాడు శైలేంద్ర. మహేంద్ర వాళ్ళని వాళ్లతో పాటే ఉండిపోమని రిక్వెస్ట్ చేస్తాడు ఫణీంద్ర. కానీ వసుధార కి ఇష్టం లేకపోవడంతో అన్నగారి మాట కాదంటాడు మహేంద్ర. వాళ్ల పని పూర్తయిన వెంటనే రంగా ని పై లోకాలకు పంపించేయాలి అనుకుంటారు దేవయాని, శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక ఆగష్టు 9వ తేదీ ఎపిసోడ్ 1,150ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
మీరు ఏం మాట్లాడుకుంటున్నారు నిజం చెప్పండి, పరలోకానికి ఎవరిని పంపిస్తారు అంటుంది ధరణి. శైలేంద్ర ఆమెకి ఏదో సర్ది చెప్తాడు కానీ పరలోకం ఎక్కడ ఉందో తెలుసా అని అడుగుతుంది ధరణి. నీకు తెలుసా అని అడుగుతాడు శైలేంద్ర. తెలుసు కానీ చెప్పను, మీరు బాగుపడిపోతారు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి. మరోవైపు వసుధార సి సి ఫుటేజ్ ఇంకా పంపించలేదని స్టాప్ పై ఫైర్ అవుతుంది. అతను ఎప్పుడో పంపించేశాను అని చెప్పటంతో తన రూమ్ సీసీ ఫుటేజ్ చూస్తుంది వసుధార.

అందులో ఒరిజినల్ లెటర్ ని తీసి శైలేంద్ర జేబులో పెట్టుకోవడం అబ్జర్వ్ చేస్తుంది. నేను అనుకున్నదే అయింది అనుకుంటుంది వసుధార. ఇంతలోనే రిషి వచ్చి అంత సీరియస్ గా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. రిషి రావటం చూసిన వసుధార లాప్టాప్ క్లోజ్ చేస్తుంది. ఎందుకు క్లోజ్ చేస్తున్నావు నేను చూడకూడదా అంటాడు రిషి. దాంతో వసుధార మళ్లీ లాప్టాప్ ఓపెన్ చేసి సిసి ఫుటేజ్ చూపిస్తుంది. ఆ లెటర్లో ఏముంది అని అడుగుతాడు రిషి.
అందులో మను గారికి సంబంధించిన వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటుంది వసుధార. నాకు చెప్పకూడదా అంటాడు రిషి. అవును అంటుంది వసుధార. సరే నిన్ను అడిగి ఇబ్బంది పెట్టనులే అంటాడు రిషి. ఇంతలోనే బుజ్జి ఫోన్ చేస్తే పక్కకి వెళ్లి మాట్లాడుతాడు రిషి. నానమ్మకి ఏం బాగోలేదని తొందర్లోనే ఆపరేషన్ చేయించమంటున్నారని,డబ్బంతా మీ మామయ్య తీసేసుకున్నాడని చెప్తాడు బుజ్జి. డబ్బు గురించి ఏమీ ఆలోచించకు నేను చూసుకుంటాను నానమ్మని మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకో నేను తొందరలోనే వస్తాను అంటాడు రిషి.

నానమ్మ ఆరోగ్యం కన్నా నీకు ముఖ్యమైన పనులు ఏముంటాయిఅన్న, నిజం చెప్పు నువ్వు రంగా వా, రిషివా అని నిలదీస్తాడు బుజ్జి. అన్ని విషయాలు నీకు తొందర్లోనే తెలుస్తాయి అని ఫోన్ పెట్టేస్తాడు రిషి. మరోవైపు పక్క వాళ్ళ లెటర్ అలా తీయొచ్చా అని శైలేంద్ర పై ఫైర్ అవుతుంది వసుధార. బాధ్యతలని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిన నీతో నాకు మాటలేమిటి అని చులకనగా మాట్లాడుతాడు శైలేంద్ర. అప్పుడే రిషి అక్కడికి వచ్చి నా భార్య గురించి అలా మాట్లాడితే బాగోదు, తన గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు..
మరోసారి నా భార్య గురించి ఇలా మాట్లాడితే బాగోదు అని హెచ్చరించి వసుధారని తనతో పాటు రమ్మంటాడు రిషి. రిషి ప్రవర్తనకి ఆశ్చర్యపోతాడు శైలేంద్ర. నేను శైలేంద్ర తో మాట్లాడాలి మీరు వెళ్ళండి అని చెప్పటంతో రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వసుధార లెటర్ ఇమ్మని శైలేంద్రని అడుగుతుంది. అది అవసరం అయినప్పుడు మను కి చూపిస్తాను అని బెదిరిస్తాడు శైలేంద్ర. చూపించుకోండి అంటుంది వసుధార. ఆ మాటలకి షాక్ అవుతాడు శైలేంద్ర.

ఆ లెటర్ మనుకి చూపిస్తే బాబాయ్ ని మను చంపేస్తాడు తెలుసా అంటాడు శైలేంద్ర. మీరు అలా అనుకుంటున్నారు కానీ నిజం తెలిసిన తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకటైపోతారు, అప్పుడు నష్టపోయేది మీరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. అదీ నిజమే అనుకుంటాడు శైలేంద్ర. మరోవైపు రంగా కోసం బెంగపడుతుంది రాధమ్మ, నాతో చెప్పమని ఏమైనా చెప్పాడా అని బుజ్జిని అడుగుతుంది. త్వరలోనే వస్తానన్నాడు అంటాడు బుజ్జి. ఇంకెప్పుడు వస్తాడు, నా ప్రాణం పోయాకా అంటుంది రాధమ్మ.
అలా మాట్లాడతావేంటి నువ్వేమీ బెంగ పెట్టుకోకు నేను ఇప్పుడే బావకి ఫోన్ చేస్తాను అని చెప్పి రిషి కి ఫోన్ చేస్తుంది సరోజ. వసుధార ఫోన్ లిఫ్ట్ చేయటంతో షాక్ అవుతుంది. మా బావ నీ దగ్గర ఎందుకు ఉన్నాడు ఫోన్లో కాదు నీ సంగతి డైరెక్ట్ గా తేల్చుకుంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది సరోజ. తర్వాత విషయం రాధమ్మతో చెప్పి నాకెందుకో భయంగా ఉంది అమ్మమ్మ నేను వెళ్లి అసలు సంగతి కనుక్కుంటాను అంటుంది. ఎలా వెళ్తావు అంటుంది రాధమ్మ. బుజ్జి కి తెలిసే ఉంటుంది అంటుంది సరోజ.

అన్న ఇక్కడి నుంచి వెళ్లడం వరకే తెలుసు అడ్రస్ తెలియదు అంటాడు బుజ్జి. ధనరాజ్ ఉన్నాడు కదా వాడిని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అనుకుంటుంది సరోజ. మరోవైపు అనుపమ ఇంటికి వచ్చిన వసుధార మీరు మావయ్య ను వదిలేసి రావడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. అనుపమ మాట్లాడుతూ మను తండ్రి మహేంద్ర అని దేవయానికి తెలిసింది అని చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











