Guppedanta Manasu, July 30th episode: ధరణిని క్షమాపణ కోరిన శైలేంద్ర.. మళ్లీ కలిసిన రిషిధారలు!
మనం రంగా ని ఉపయోగించుకోవచ్చు అని కొడుక్కి ఒక సలహా ఇస్తుంది దేవయాని. వసుధార తన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. సెంటిమెంట్ గా ఫీల్ అయిన వసుధార రిషికి ఏమైనా అవుతుందేమో అని కంగారు పడుతుంది. రంగా నీకిమ్మన్నాడని ఒక గిఫ్ట్ వసుధార చేతిలో పెడుతుంది రాధమ్మ. రిషి గా నటించడానికి ఒప్పుకున్న రంగా శైలేంద్రతో పాటు వెళ్తాడు. రంగా ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసిన వసుధార రంగాయే రిషి అన్న క్లారిటీ వస్తుంది. కి ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ. ఇక జూలై 30వ తేదీ ఎపిసోడ్ 1,140ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
మా బాబాయ్ పేరు మహేంద్ర అని నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు శైలేంద్ర. మీరే చెప్పారు కదా అంటాడు రిషి. చెప్పే ఉంటాను అంటాడు శైలేంద్ర. తర్వాత తన ఫ్యామిలీ ఒక్కొక్కరి ఫోటోలు చూపించి పరిచయం చేస్తూ ఆఖరున వసుధార ప్లేస్ లో ఫోటో పెట్టకుండా ఖాళీ పేపర్ పెట్టి ఇంటు మార్క్ పెడతాడు శైలేంద్ర. అదేమిటి అలా ఉంది అంటాడు రిషి. తను ఇప్పుడు లిస్టులో లేదు తన గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు అంటాడు శైలేంద్ర.
నేను మీ ఇంట్లో వాళ్ళని సరిగ్గా గుర్తించకపోతే అప్పుడు సమస్యలలో పడతాము, అప్పుడు బాధపడేది మీరే అంటాడు రిషి.

మీరు ఇలా చెప్తుంటే నాకు అర్థం కావడం లేదు, నేను వాళ్ళని నేరుగా కలుస్తాను అంటాడు రిషి. అలా అయితే ప్రాబ్లం అవుతుంది అంటాడు శైలేంద్ర. ఒక పని చేయండి మీరు వాళ్ళని నాకు దూరం నుంచి చూపించి పరిచయం చేయండి అంటాడు రిషి. సరే అంటూ ఇంటికి తీసుకు వెళ్తాడు శైలేంద్ర. ఇంటిని చూసిన రిషి ఎమోషనల్ అవుతాడు. ఏంటి అలా చూస్తున్నావ్ ఇలాంటి ఇల్లు ఎప్పుడు చూసి ఉండవు కదా అయినా రేపటి నుంచి ఈ ఇల్లు మన ఇల్లు అవుతుందిలే అంటూ రిషి ని ఒక కిటికీ దగ్గర ఉంచి లోపలికి వెళ్లి ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు.
ఏమైంది అంటూ అందరూ శైలేంద్ర దగ్గరికి వస్తారు. రేపు మన కాలేజీ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది నాకు చాలా బాధగా ఉంది. ఆ బాధని మీతో షేర్ చేసుకుందామని పిలిచాను అంటూ ధరణికి క్షమాపణ చెప్తాడు శైలేంద్ర. ఎందుకు అంటుంది ధరణి. నీ భర్త ఆ కాలేజీని కాపాడలేకపోయాడు అందుకు నీకు బాధగా ఉంటుంది కదా అంటాడు శైలేంద్ర. నాకేమీ బాధ లేదు కానీ కాలేజీ చేజారి పోతుందని బాధగా ఉంది దాన్ని మనం కాపాడుకోలేమా అంటుంది ధరణి .

ఎలాంటి అవకాశం లేదమ్మా లేదంటే ఈ ఫణీంద్ర ఇలా ఊరుకునే వాడు కాదు కదా అంటాడు ఫణీంద్ర. అప్పుడే మహేంద్ర కి తనని ఎవరో చూస్తున్నట్లు తనని ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంది. కిటికీ వైపు చూడటంతో రిషి పక్కకి తప్పుకుంటాడు. శైలేంద్ర ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావ్ అంటాడు. నాకు రిషి ఇక్కడే ఉన్నాడు అనిపిస్తుంది ఎందుకో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, నా కొడుకు కోడలు వస్తారేమో అంటాడు మహేంద్ర. నీ ఆశ తీరాలనే నేను కూడా ఆశ పడుతున్నాను కానీ అది అసంభవం అంటాడు ఫణీంద్ర.
రేపు కాలేజీ గవర్నమెంట్ హాండ్ ఓవర్ చేసుకుంటుంది అందుకే ఒకసారి మనం వెళ్లి కాలేజీ చూద్దాం అంటాడు శైలేంద్ర. నేను రాను అంటాడు మహేంద్ర. రావాలి డాడ్ నేను మీతో మాట్లాడాలి అనుకుంటాడు రిషి. అక్కడినుంచి వెళ్ళిపోతుంటే కాలు తగిలి ఫ్లవర్ వేస్ పడిపోతుంది. ఆ సౌండ్ కి అక్కడ ఎవరో ఉన్నారు అనుకుంటూ ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు కానీ అప్పటికే రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవరూ లేరని చెప్పాను కదా అంటూ శైలేంద్ర ఇంట్లో వాళ్ళందరినీ లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు.

కానీ మహేంద్ర మాత్రం అక్కడే కూర్చుంది పోతాడు. రిషి నువ్వు ఇక్కడే ఉన్నావ అనిపిస్తుంది అనుకుంటూ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత శైలేంద్ర రిషి కి ఫోన్ చేసి చెప్పిన టైంకి చెప్పినట్లు వచ్చేయ్ ఎవరికీ ఎలాంటి అనుమానం రానివ్వద్దు అంటాడు. సరే అని ఫోన్ పెట్టేసి మహేంద్ర ఇంటికి వెళ్తాడు రిషి. అక్కడ తలుపులు తీసి ఉండటం చూసి ఎవరో వచ్చారు అనుకుంటూ ఎవరు అని పిలుస్తాడు. వసుధార వెనకనుంచి వచ్చి అతడిని హగ్ చేసుకుంటుంది.

ఏడుస్తున్న వసుధార ని ఎందుకు నేను రిషినని ఒప్పుకుంటున్నాను కదా అంటాడు రిషి. ఇన్ని రోజులూ ఒప్పుకోకుండా, నన్ను బాధ పెట్టేలా మాట్లాడారు అంటుంది వసుధార. అలా అంటే అయినా నువ్వు కాలేజీకి వచ్చి కాలేజీని రక్షిస్తావేమో అనుకున్నాను కానీ పొగరు కదా నా మాట వినలేదు అంటాడు రిషి. ఆ పొగరే ఈరోజు మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకువచ్చింది అంటుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











